అలెఫ్ మోబిటెక్లో టాటా క్యాపిటల్ ఫండ్ పెట్టుబడులు
ముంబై: అమెరికాకు చెందిన అలెఫ్ మోబిటెక్ సొల్యూషన్స్ సంస్థలో టాటా క్యాపిటల్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఈక్విటీ ఫండ్.... టాటా క్యాపిటల్ ఇన్నోవేషన్స్ ఫండ్(టీసీఐఎఫ్) 50 లక్షల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. తమ వ్యాపారాభివృద్ధి, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధి తదితర కార్యకలాపాలు టీసీఐఎఫ్ పెట్టుబడులతో మరింత శక్తివంతమవుతాయని ఆలెఫ్ మోబిటెక్ సొల్యూషన్స్ పేర్కొంది. మొబైల్ వినియోగదారులకు అలెప్ సంస్థ మొబైల్ కంటెంట్‌ను అందిస్తోంది.
టాటా ప్రాజెక్ట్స్‌కు రూ. 4,328 కోట్ల రైల్వే ప్రాజెక్ట్
* టాటా ప్రాజెక్ట్స్ రూ. 4,328 కోట్ల రైల్వే కారిడార్ కాంట్రాక్టును కైవసం చేసుకుంది. సరుకు రవాణాకు సంబంధించిన ఈ ప్రత్యేక కారిడార్ కింద ముంబై-ఢిల్లీ పట్టణాల మధ్య 320 కి.మీ రైల్వే కారిడార్‌ను టాటా ప్రాజెక్ట్స్ 48 నెలల్లో నిర్మించనుంది.