కీచక టీచర్ వెకిలిచేష్టలు..దేహశుద్ధి
మహబూబాబాద్ : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి వెకిలిచేష్టలు మహబూబాబాద్‌లో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్‌ను దేహశుద్ధి చేసిన ఘటన కట్టెలమండి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో పని చేస్తున్న ప్రతాప్ అనే ఉపాధ్యాయుడు కొంతకాలంగా విద్యార్థులతో పాటు అటెండర్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సెల్ఫోన్లో అశ్లీల వీడియోలను విద్యార్థినులకు చూపించి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇప్పటికే పలుమార్లు టీచర్‌కు హెచ్చరించారు. అయినా ఆయన తీరు మార్చుకోకపోవడంతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని తీవ్రంగా కొట్టారు. కీచక టీచర్‌ను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.