30 టేకు దుంగలు స్వాధీనం
చెన్నూరు: అక్రమంగా నిల్వ ఉంచిన 30 టేకు దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం అక్కపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. అక్కపల్లి గ్రామంలోని అక్కపల్లి వాగులో టేకు దుంగలను అక్రమంగా నిల్వ ఉంచినట్లు అటవీ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని 30టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. కాగా, ఈ దుంగలను ఎవరు నిల్వ ఉంచారనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.