విజయనగరం: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సోమవారం ఏడుగురు టేకు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.లక్ష విలువ చేసే టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాలోని గుణపూర్ నుంచి వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు