రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్) : జిల్లాలోని వివిధ మండలాలలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్ భరత్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒకప్రకటన విడుదల చేశారు. వివిధ కేటగిరీల వారీగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏలూరు టౌన్ ఎస్సీ (జనరల్), ఏలూరు రూరల్ ఎస్సీ (స్త్రీ), పెదపాడు మండలం, ఎస్.కొత్తపల్లి బీసీ (స్త్రీ), పెదవేగి మండలం, దుగ్గిరాల బీసీ (స్త్రీ), పినకడిమి బీసీ (స్త్రీ), దెందులూరు మండలం, దెందులూరు ఓసీ (స్త్రీ), ముప్పవరం ఎస్సీ (జనరల్), భీమడోలు మండలం, భీమడోలు ఓసీ (స్త్రీ), పోలసానిపల్లి బీసీ (జనరల్), ద్వార కాతిరుమల మండలం, మారంపల్లి బీసీ (స్త్రీ), గణపవరం మండలం,
కొమట్లపాలెం ఎస్సీ (జనరల్), ముప్పర్తిపాడు ఓసీ (జనరల్), అప్పన్నపేట ఎస్సీ (స్త్రీ), నిడమర్రు మండలం తోకలపల్లి బీసీ (స్త్రీ), తాడేపల్లిగూడెం మండలం, తాడేపల్లిగూడెం టౌన్ ఓసీ (జనరల్), తాడేపల్లిగూడెం టౌన్ ఓసీ (జనరల్), తాడేపల్లిగూడెం టౌన్ ఓసీ (స్త్రీ),తాడేపల్లిగూడెం మండలం అప్పారావు పేట ఎస్సీ (జనరల్), తాడేపల్లిగూడెం మండలం మాధవరం ఓసీ(స్త్రీ), తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం ఓసీ (జనరల్), టి.నర్సపురం మండలం అల్లంచర్ల రాజుపాలెం ఎస్సీ (స్త్రీ)లకు రిజర్వుచేసినట్టు ఆర్డీవో తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు కులము, విద్యార్హతలు, నివాస ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు చేరే విధంగా దర ఖాస్తులను పంపాలన్నారు. దరఖాస్తు చేసినవారు ఈ నెల 28వ తేదీ ఉద యం 11 గంటలకు ఏలూరు సర్. సీఆర్‌రెడ్డి, పీజీ కాలేజీలో జరిగే రాత పరీక్షకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు. ఇతర వివరాలకు ఏలూరు ఆర్డీవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.