కేసీఆర్తో ఏకే ఖాన్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఏకే ఖాన్ సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి కేసీఆర్ను కలిశారు.
ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏసీబీ సమన్లు జారీ చేయనుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఏకే ఖాన్ ఓటుకు నోటు కేసు విషయం కేసీఆర్తో చర్చించినట్టు సమాచారం.