'ఇలాంటి శిక్షలతో నేరాలు అదుపులోకి'
హైదరాబాద్: మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డ స్నేక్ గ్యాంగ్ దోషులకు రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షలు విధించడాన్ని ఐద్వా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కె. ఎన్ ఆశాలత, కార్యదర్శి బి. హైమావతిలు స్వాగతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది అరుదైన మంచి తీర్పు అని, ఇటువంటి శిక్షల ద్వారా నేరాలు కొంతవరకు అదుపులోకి వస్తాయన్నారు.
నేరాల నివారణకు ప్రభుత్వం మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలనీ, జిల్లా కొక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఇటువంటి నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ వేగంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, మహిళల గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రసార మాధ్యమాలలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, సినిమాలలో, టీ.వీ చానళ్లలో మహిళల అసభ్య, అశ్లీల చిత్రీకరణను నివారించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.