Telangana Association of Denmark
-
డెన్మార్క్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కొపెన్‌హెగెన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్)ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 500 మందికి పైగా తెలంగాణ ప్రవాసులు పాల్గొని ఆటా పాటలతో హోరెత్తించారు. ప్రకృతిని, పూలను, పూలలో దేవతలను పూజించే ఆడపడుచుల పండగ బతుకమ్మ అని టాడ్ అధ్యక్షుడు సతీష్ రెడ్డిసామ అన్నారు. మన సంస్కృతి, పండుగలు, భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా అసోసియేన్కి సహకరించిన సభ్యులకు, తెలంగాణ కుటుంబ సభ్యులకు, బోర్డు సభ్యులకు టాడ్ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంబరాల్లో టాడ్ బోర్డు సభ్యులు రమేష్ పగిళ్ల, కరుణాకర్ బయ్యపు, జయచందర్ కంది, సంగమేశ్వర్ బిళ్ల, వాసు నీల, రాజ్ కుమార్ కలువల, దామోదర్ లట్టుపల్లి, సులక్షణ కోర్వ, నర్మదా దేవిరెడ్డి, యాదగిరి ప్యారం,రఘు కలకుంట్ల, రంజిత్ రెడ్డి, విజయ్ మోహన్, రాజు ఎం, జగదీశ్ వంజ, వెంకట రెడ్డి టేకుల, సత్య బద్దం, రఘు భీరం, మానస కొదురుపాక, లైఫ్ టైం సభ్యులు పాల్గొన్నారు. -
డెన్మార్క్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కోపెన్‌హెగెన్: తెలంగాణా సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ సంబరాలను విదేశాల్లో వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా డెన్మార్క్‌లో తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) అధ్వర్యంలో యూరప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి అజిత్ గుప్త దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంబరాలకు ఆడపడుచులు అధిక సంఖ్యలో బతుకమ్మలను తీసుకువచ్చి ఆట పాటలతో, కోలాటాల విన్యాసాలతో ఆనందంగా పాల్గొన్నారు. స్థానికంగా దొరికే వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పరంగా బతుకమ్మల చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ పాటలు పాడారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాడ్ అధ్యక్షుడు సామ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతిని, పూలను, పూలలో దేవతలను పూజించే ఆడపడుచుల పండగ బతుకమ్మ అని, పాల్గొన్న ప్రతీ ఒక్కరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బ్రెగ్జిట్ తర్వాత యూరప్‌లో టాడ్ అతిపెద్ద అసోషియేషన్‌గా అవతరించి 4 వసంతాలు పూర్తి చేసుకొని, తెలంగాణ పండగలను పెద్ద ఎత్తున జరుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టాడ్ బోర్డు సభ్యులు సంగమేష్వర్ రెడ్డి, రమేష్ పగిల్ల, జయచందర్ రెడ్డి కంది, వాసు నీల, దాము లట్టుపల్లి, వెంకటేష్, రాజారెడ్డి, రఘు కంకుంట్ల, రాజు ముచంతుల, కర్నాకర్, నర్మద దేరెడ్డి, ఉష, ప్రీమియం సభ్యులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. -
డెన్మార్క్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
కొపెన్ హెగెన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో కొపెన్ హెగెన్‌లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటూ అత్యంత వైభవంగా గణేషుని ఉత్సవాలు జరిపి , చివరిరోజు భారీ ర్యాలీగా డానిష్ వీధుల్లో ఊరెంగించి సరస్సులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డాన్యులతో దారిపొడవునా సందడి చేశారు. గణేష్ ఉత్సవాలు భారతీయుల ఐక్యతకు నిదర్శనం అని టీఏడీ అధ్యక్షులు సతీష్ రెడ్డి సామ అన్నారు. వేలంపాటలో గణేష్ లడ్డూ, కలశం, పట్టు వస్త్రం గెలుచుకున్న అశ్విన్‌కుమార్, రాజు పోరెడ్డి, జయచందర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవాలకు అన్ని విధాలుగా సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాడ్ బోర్డు సభ్యులు సంగమేశ్వర్ పగిల్ల, జయచందర్ రెడ్డి, వెంకటేష్, రాజారెడ్డి, రఘు కలకుంట్ల, ఉపేందర్, జగదీష్, దాము, రంజిత్, కరుణాకర్, రాజు ముచంతుల, వాసు, డేవిడ్ క్రిస్టీన్, నర్మద, ప్రీమియం సభ్యుల సహకారంతో నిర్వహించారు. -
డెన్మార్క్‌లో టాడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
కోపెన్ హాగెన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్ హాగెన్‌లో శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ పద్ధతులలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, భక్షాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డెన్మార్క్‌లో ఉన్న ప్రవాస తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది పర్వదినాన్ని జరుపుకొన్నారు. ఈ ఉత్సవాలు టాడ్ అధ్యక్షులు సామ సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ రెడ్డి, సెక్రటరీ రమేష్ పగిళ్ళ, కోశాధికారి జయచందర్ రెడ్డి, టెక్నికల్ మేనేజర్ వెంకటేష్, కార్యవర్గ సభ్యులు వాసు, దాము, రాజారెడ్డి, శివసాగర్, శ్రీనివాస్, రఘు, కరుణాకర్, రాజు, నర్మద, ఉష, ప్రీమియం సభ్యులు, తదితరుల సహకారంతో వేడుక ఘనంగా జరిగింది.