Telangana Economy
-
తెలంగాణ ఆర్ధిక పరిస్థితి
-
తీవ్ర అనిశ్చితిలో ఆర్థిక పరిస్థితి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని తెలిపారు. ఈ ఏడాది రూ.2957కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిందని అన్నారు. కాగా అన్ని శాఖల్లో ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థిక మంత్రికి కేసీఆర్ సూచించారు. ఈ విషయమై త్వరలో ప్రధానిని కలిసి వివరిస్తానని కేసీఆర్ వెల్లడించారు. ఈ నెల 11న జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. -
తెలంగాణ-పర్యాటకం
కాంపిటీటివ్ గెడైన్స్ : తెలంగాణ ఎకానమీ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. పర్యాటక రంగ అభివృద్ధి వల్ల అధిక రాబడితో పాటు విదేశీ మారక ద్రవ్య ఆర్జన పెరగటంతో ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యమిస్తున్నాయి. పర్యాటకం ద్వారా అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, ఆస్ట్రియా తదితర దేశాలకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. మానవ సమాజం సాంఘికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా సాధించిన ప్రగతికి తోడ్పాటునందించిన రంగాల్లో పర్యాటకం ఒకటి. తెలంగాణ రాష్ర్టంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ’ ఏర్పాటైంది. దీన్ని 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వేరుచేశారు. రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులకు అవసరమైన మౌలికవసతులు, ఇతర సౌకర్యాలు కల్పించటం పర్యాటక అభివృద్ధి సంస్థ లక్ష్యం. దీని వద్ద వోల్వో, మెర్సిడెస్ బెంజ్ కోచ్‌లున్న 63 వాహనాలు ఉన్నాయి. ముఖ్య పర్యాటక కేంద్రాల్లో హరిత హోటళ్లను నిర్వహిస్తోంది. విభిన్న పర్యాటక ప్యాకేజీలు అందిస్తూ దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. నిజాం ప్యాలెసెస్ టూర్, హైదరాబాదీ హెరిటేజ్ ఫ్లేవర్ వీకెండ్ ప్యాకేజ్, టెంపుల్ కమ్ హిల్ స్టేషన్ టూర్, కాకతీయ హెరిటేజ్ టూర్ వంటి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీలను ఇరుగుపొరుగు రాష్ట్రాలతో అనుసంధానించేందుకు పర్యాటక సంస్థ చర్యలు తీసుకుంది. నదీ ప్రయాణాలు, జల విహారాలకు అవసరమైన పడవలను కూడా సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు ♦ యాదగిరి గుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 400 ఎకరాల్లో నరసింహ అభయారణ్యాన్ని అభివృద్ధిపరచటంతో పాటు మరో 1600 ఎకరాల్లో ఉద్యానవనాలు, కల్యాణమండపాలు, ధ్యానమందిరాలు, వేద పాఠశాల, కాటేజీలను ఏర్పాటు చేస్తారు. ♦ నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండలో దాదాపు 2,000 ఎకరాల విస్తీర్ణంలో ‘మెగా సినిమా సిటీ’ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. ♦ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించింది. ♦ బతుకమ్మ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా పర్యాటక ప్యాకేజీలను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఈ విశిష్టమైన పండగకు దేశంలోని అన్ని ప్రాంతాల పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. ♦ అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే ఉత్సవం మేడారం జాతర. 2016, ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతరలో లక్షల మంది పాల్గొన్నారు. ఈ జాతర వైపు దేశ ప్రజలను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ♦ నాగార్జున సాగర్, కిన్నెరసాని, రామప్ప, కొత్తగూడెం, గజ్వేల్ ప్రాంతాల్లో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ‘నీతి ఆయోగ్’ రూ.33 కోట్లు కేటాయించింది. ♦ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి సమగ్ర జిల్లా ప్రణాళికల రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ♦ ప్రభుత్వం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టులోని హనుమాన్ ఆలయం, ధర్మపురిలోని నరసింహ స్వామి ఆలయం, వరంగల్ జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయం, మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లోని జోగులాంబ ఆలయాల వద్ద పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ♦ తెలంగాణ జిల్లాల్లో తక్కువ ప్రాచుర్యం పొందిన పర్యాటక కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించటం ద్వారా ఆయా ప్రాంతాలు ఎక్కువ పర్యాటకులను ఆకర్షించేలా చేయటంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ♦ కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ గ్రామీణ పర్యాటకానికి సంబంధించి గుర్తించిన వాటిలో నల్గొండలోని పోచంపల్లి గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, ఆదిలాబాద్‌లోని నిర్మల్ గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, వరంగల్ జిల్లాలోని చేర్యాల గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, పెంబర్తి గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులున్నాయి. ♦ భారత ప్రభుత్వం సహకారంతో కుతుబ్‌షాహీ సమాధుల పరిరక్షణ, ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ♦ ప్రసిద్ధ సమాధుల పరిరక్షణ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో అగాఖాన్ ట్రస్ట్ ఇప్పటికే చేతులు కలిపింది. ఆర్థిక వ్యవస్థపై పర్యాటక రంగ ప్రభావం ♦ అధిక ఆర్థిక వృద్ధి సాధనకు పర్యాటక రంగం ముఖ్య సాధనంగా ఉపకరిస్తోంది. మధ్యతరగతి ప్రజల ఆదాయాల పెరుగుదలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వ చర్యల కారణంగా పర్యాటక రంగ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ధనాత్మకంగా ఉంటోంది. ♦ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణలో నిర్మాణాత్మక మార్పు ద్వారా ఆధునిక ఆర్థిక వృద్ధి జరగాలంటే పర్యాటక రంగాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. ♦ పర్యాటక రంగ అభివృద్ధి వల్ల రాష్ట్రంలో రవాణా రంగం, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, కుటీర పరిశ్రమలు, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. ♦ ఆదాయం, ఉపాధికల్పన పెరుగుదలతో పాటు పేదరిక నిర్మూలన, సుస్థిర మానవాభివృద్ధి సాధనకు పర్యాటక రంగం దోహదపడుతుంది. ♦ పర్యావరణ పరిరక్షణ, అంతర సాంస్కృతిక అవగాహన పెంపునకు పర్యాటక రంగం తోడ్పడుతుంది. ♦ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో వివిధ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటకం, పౌరవిమానయానం, ఆతిథ్య పరిశ్రమల్లో పీపీపీ నమూనాను ప్రవేశపెడితే ప్రభుత్వ వ్యయభారం తగ్గుతుంది. ♦ పర్యాటక రంగం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. బహుళ ప్రయోజన మౌలిక వసతుల అభివృద్ధిని పర్యాటక రంగం ప్రోత్సహిస్తుంది. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, ఇతర ఉత్పాదక కార్యకలాపాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. తద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో వృద్ధి అధికమవుతుంది. ♦ పర్యాటక రంగం పరంగా అంతగా ప్రాచుర్యం చెందని ప్రాంతాలపై దృష్టిసారించటం ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెంది, ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
అకాడమీ పుస్తకాలు సిద్ధం!
పోటీ పరీక్షలకు..అందుబాటులోకి జనరల్ స్టడీస్, తెలంగాణ చరిత్ర, సాంఘిక అంశాల పుస్తకాలు నాలుగైదు రోజుల్లో మరో ఐదు పుస్తకాల విడుదలకు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ ప్రత్యేక పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. పలు ఉద్యోగ పరీక్షల నోటిఫికేషన్లు జారీ అవుతున్న నేపథ్యంలో... పుస్తకాల కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, పోరాటాలు తదితర అంశాలకు సంబంధించి ‘ప్రైవేటు’ పుస్తకాలు కొన్ని మార్కెట్లో అందుబాటులో ఉన్నా... ప్రామాణిక పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల కోసం ప్రభుత్వ సంస్థ తెలుగు అకాడమీ ప్రధానమైన జనరల్ స్టడీస్, తెలంగాణ చరిత్ర-సంస్కృతి, సాంఘిక అంశాలపై పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. మరి కొన్ని పుస్తకాలను నాలుగైదు రోజుల్లో తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. టీఎస్పీఎస్సీ ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్ ఆధారంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లతో ఈ పుస్తకాలను రాయించింది. ఇప్పటివరకు భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలనా శాస్త్రం, భౌతిక భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర వంటి పుస్తకాలను అందుబాటులో ఉంచిన అకాడమీ... ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 8 రకాల పుస్తకాలను తీసుకురానుంది. ఇందులో మూడు పుస్తకాలను సోమవారం విడుదల చేసింది. మొత్తంగా వచ్చే 10 రోజుల్లో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుగు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. తెలంగాణపై ప్రత్యేక అంశాలు తెలంగాణ చరిత్ర-సంస్కృతి పుస్తకంలో తెలంగాణ పరిచయం నుంచి మొదలుకొని పూర్వ తెలంగాణ చరిత్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పూర్వకాలం, శాతవాహనుల తరువాత కాలం, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకరణులు, ముసునూరి నాయకులు, బహమనీ పరిపాలన, కుతుబ్‌షాహీల కాలం, మెఘల్ల కాలం, అసఫ్జాహీలు, నిజాంల పాలన, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు తదితర 33 అంశాలతో పాఠ్యాంశాలను పొందుపరిచింది. వీటితోపాటు తెలంగాణ చరిత్ర, భూగోళ, ఆర్థిక అంశాలు, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీ లు, జేఏసీల పాత్ర, చరిత్ర ఆధారాలు, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ పుస్తకాల్లో పాఠ్యాంశాలను పొందుపరుస్తోంది. అందుబాటులోకి తేనున్న పుస్తకాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పర్యావరణ సమస్యలు- అభివృద్ధి ప్రభుత్వ పాలనా శాస్త్రం సమాజ శాస్త్రం తెలంగాణ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం ఇదివరకే అందుబాటులో ఉన్నవి ఇండియన్ జియోగ్రఫీ భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ సోషియాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ భారత రాజ్యాంగం ప్రభుత్వ పాలనా శాస్త్రం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర -
అకాడమీ పుస్తకాలు సిద్ధం!
-
నీళ్లు.. నిధులు..
‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యురాలు, ప్రొఫెసర్ ఇ.రేవతి - గ్రూప్స్ సహా పోటీ పరీక్షల జనరల్ స్టడీస్‌లో ఇవే ప్రధానం - అభ్యర్థులు వీటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలి - గ్రూప్స్ -1లో లోతైన అధ్యయనం అవసరమని సూచన సాక్షి, హైదరాబాద్: నీళ్లు.. నిధులు.. నియామకాలే ప్రధానంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపిరి పోసుకుంది. క్రమంగా ప్రజా ఉద్యమంగా మారి, చివరికి రాష్ట్రం అవ తరించింది. అలాంటి రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగం పొంది 20-30 ఏళ్ల పాటు సేవలందించాల్సిన అభ్యర్థులకు కచ్చితంగా వాటిపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ భావన. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏం కోల్పోయింది, ఆ ప్రభావం ఇక్కడి మానవ వనరులు, ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి రంగాలపై ఎలా పడిందన్నది ఉద్యోగాల్లో చేరేవారు తెలుసుకోవాలి. అందులో భాగంగానే ఎకానమీలో దేశ ఎకానమీతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎకానమీపై ప్రత్యేక దృష్టి పెట్టి సిలబస్‌ను రూపొందించారు. ఏ దేశమైనా, ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అయినా భౌతిక వనరులు, మానవ వనరులు, ఉత్పత్తి రంగాలు, ఉత్పత్తి రంగాల వాటా, వృద్ధిరేటుపైనే ఆధారపడి ఉంటుంది. వీటితో ముడిపడి ఉన్నవే నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల్లో ఎకానమీది ప్రత్యేక స్థానం. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ భర్తీ చేయబోయే వివిధ ఉద్యోగాల్లో అభ్యర్థులు ఎకానమీ సబ్జెక్టును ఎలా చూడాలి, ఏ కోణంలో చదవాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్న దానిపై టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యురాలు, ఎకనమిక్స్ ప్రొఫెసర్ రేవతి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ఆమె వెల్లడించిన వివరాలు, సూచనలు, సలహాలను ఉద్యోగార్థుల కోసం ‘సాక్షి’ అందిస్తోంది... ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అయినా నాలుగు వనరులపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అవి 1. భౌతిక వనరులు. 2. మానవ వనరులు. 3. ఉత్పత్తి రంగాలు. 4. ఉత్పత్తి రంగాల వాటా, వృద్ధిరేటు. వనరులు, ఆదాయం ఆధారంగా వృద్ధి ఎలా మారుతూ వస్తోందన్నది ప్రధాన అంశం. భౌతిక వనరులు రాష్ట్రంలో మొత్తం భూమి, అందులో సాగు భూమి, సాగుకు యోగ్యంగా లేని భూమి, సాగు చేస్తున్న భూమి, ముఖ్య నదులు, వాటి ప్రవాహ ప్రాంతాలు, పరిశ్రమలు, మైనింగ్, ఇతర అటవీ వనరుల లభ్యత ఉంటాయి. మానవ వనరులు స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించిన భావనను అర్థం చేసుకోవాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి తెలుసుకోవాలి. అభివృద్ధికి సూచి కగా పట్టణీకరణను చెబుతాం. కాబట్టి పట్టణాలు, నగరాల నిర్వచనాలు, గ్రామీణ ప్రాంత పరిస్థితులపై దృష్టిపెట్టాలి. 0-6 వ యస్సును ఒక విభాగం, 7 ఏళ్లకంటే ఎక్కువ వున్నవారిని ఒక విభాగంగా చూడాలి. సామాజిక వర్గాల వారీగా కూడా ప్రధానమే. ఇందులో మరో ప్రధాన అంశం అక్షరాస్యత. ఇదే సామాజిక సూచీగా ఉంటుంది. అక్షరాస్యతను రెండు భాగాలుగా చూడాలి. ఆరేళ్లలోపు వారిని పరిగణనలోకి తీసుకోరు. ఏడేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఒక విభాగంగా, 15 ఏళ్ల పైబడిన వారిని మరో గ్రూప్‌గా తీసుకోవాలి. ఇందులో గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంది. స్త్రీ పురుషుల్లో ఎలా ఉందన్న అంశాలు చూసుకోవాలి. విద్యలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్, డి గ్రీ, పీజీ చదువుకున్న వారి రేటు ఎంతన్నది తీసుకోవాలి. స్థూల నమోదు రేటులో వయసుతో సంబంధం లేకుండా చదువుకుంటున్న వారు... నికర నమోదు రేటులో నిర్ణీత వయస్సులో చదుతున్న వారి నమోదును చూడాల్సి ఉంటుంది. పైతరగతికి వెళ్తున్న వారు, డ్రాపవుట్స్‌పై సామాజిక వర్గాలు, బాల బాలికలల్లో వేర్వేరుగా చూసుకోవాలి. శ్రామిక శక్తి (వర్క్‌ఫోర్స్): ఇందులో 15 ఏళ్ల నుంచి 57 ఏళ్ల వారిని తీసుకుంటాం. ఇందులో స్త్రీల వాటా చూడాలి. ఉద్యోగులు, నిరుద్యోగుల నిర్వచనాలు, గణాంకాలపై దృష్టిపెట్టాలి. ప్రాథమిక ఆరోగ్య స్థాయి, మాతా, శిశు మరణాల రేటు, సగటు జీవిత కాలం, సగ టున 30 వయస్సు వారు అత్యధికంగా ఉన్న దేశం మనది. దీనిపెనా దృష్టి పెట్టాలి. ఇతర అంశాలు.. భూమి బదలాయింపు విధానాలపై స్పష్టత అవసరం. పెద్ద, మధ ్య, చిన్న, ఉపాంత రైతు విధానంపై అవగాహన ఉండాలి. ఎంత భూమి ఉంటే ఏమంటారన్నది తెలుసుకోవాలి. 2.47 ఎకరాలు ఉంటే ఉపాంత రైతులని, 2.5-5 ఎకరాలు ఉంటే చిన్న రైతులని, 5-10 ఎకరాలు ఉంటే దిగువ మధ్యతరహా రైతులని, 10-25 ఎకరాలు ఉంటే మధ్యతర హా రైతులుగా, 25 ఎకరాల కంటే ఎక్కువుంటే పెద్ద రైతులుగా పరిగణిస్తారన్న అవగాహన ఉండాలి. వీటితోపాటు రాష్ట్రంలో పంటలు, వాటి పరిస్థితులు, సాగునీరు, వర్షపాతం, భూగర్భ జలాలు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. భూగర్భ జలాలపై ఆధారపడటం వల్ల పెట్టుబడులు పెరిగి, ఆదాయం రాక, అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. ముల్కనూర్ వంటి సహకార వ్యవస్థ, ఉమ్మడి రాష్ట్రానికంటే ముందు ఇక్కడ జరిగిన పారిశ్రామిక అభివృద్ధి (ఉదాహరణకు డీబీఆర్ మిల్స్, ఆజంజాహీ మిల్స్) వంటి తెలుసుకోవాలి. దీంతోపాటు ప్రస్తుత పారిశ్రామిక విధానం (టీఎస్ఐపాస్)పై పట్టు సాధించాలి. గ్రూప్-2, గ్రూప్-3లో.. గ్రూప్-2, గ్రూప్-3లో ఇదే తరహాలో ఎకానమీ సిలబస్ ఉన్నప్పటికీ ఇంత విస్తృతంగా ఉండదు. 1956 కంటే ముందు కాలంనాటి పరిస్థితులపై సిలబస్‌లో లేదు. ఆ తరువాత పరిస్థితులపైనే ఉన్నాయి. మానవ వనరులకు సంబంధించిన అంశాలు ఉండవు. ఇక గ్రూప్-4, ఇతర పరీక్షల జనరల్ స్టడీస్‌లో ఎకానమీపై ప్రశ్నలు ఉంటాయి. ఉత్పత్తి రంగాలు ఇందులో 1. వ్యవసాయం, 2. పారిశ్రామిక రంగం, 3. సేవా రంగం ప్రధానమైనవి. - వ్యవసాయంలో ఉప రంగాలు ఉంటాయి. అవి వ్యవసాయం, పశుపోషణ, అటవీ, మత్స్య సంపద గురించి తెలుసుకోవాలి. - పారిశ్రామిక రంగంలో క్వారీ, మైనింగ్, తయారీ, నిర్మాణ రంగాలు, విద్యుత్, గ్యాస్, నీటిపారుదల వంటివి చదువుకోవాలి. - సేవారంగంలో ఆరు ఉప రంగాలు ఉంటాయి. అందులో 1.రవాణా, స్టోరేజ్, సమాచార వ్యవస్థ, రైల్వేలు; 2.ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్లు; 3.బ్యాంకింగ్, ఇన్సూరెన్స్; 4.రియల్ ఎస్టేట్, ఓనర్స్ ఆఫ్ డ్వెల్లింగ్, బిజినెస్ సేవలు; 5.పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్; 6.ఇతర సేవలు ఉంటాయి. వీటికి సంబంధించిన అంశాలను చదువుకోవాలి. ఉత్పత్తి రంగాల వాటా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన రంగాల వాటా ఇలా ఉంది. ప్రస్తుతం వ్యవసాయ రంగం వాటా 14 శాతం కాగా సేవా రంగం వాటా 59 శాతం. పారిశ్రామిక రంగం వాటా 27 శాతం. పారిశ్రామిక రంగం వాటా 2000వ సంవత్సరం నుంచి స్థిరంగా ఉండగా, 2000-01లో 25.8 శాతం ఉన్న వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గింది. తగ్గిన మేర సేవారంగం వాటా పెరిగింది. గ్రూప్-1కు లోతైన అధ్యయనం గ్రూప్-1 అభ్యర్థులు మరింత లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 1956 కంటే ముందు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తరువాతి ఆర్థిక వ్యవస్థగా రెండు భాగాలుగా తీసుకోవాలి. 1956 కంటే ముందు ఆర్థిక వ్యవస్థలో 1853-1883 మధ్యకాలంలో వచ్చిన భూసంస్కరణలు కీలకాంశాలే. సాలార్జంగ్ హయాంలో వచ్చిన భూసంస్కరణలు, రెవెన్యూ, వ్యవసాయ సంస్కరణలు ప్రధానమైనవి. వాటిని 6, 7వ నిజాంలు కొనసాగించిన తీరు, వాటివల్ల తెలంగాణలో ఆయా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 1911-1948లో పారిశ్రామిక అభివృద్ధి తెలంగాణలో 7వ నిజాం కాలంలోనే పారిశ్రామిక అభివృద్ధికి బీజాలు పడ్డాయి. పరిశ్రమలను స్థాపించారు. మౌలిక సదుపాయాల కల్పన కు చేపట్టిన చర్యలపై (పోచంపాడు వంటి ప్రాజెక్టు) అధ్యయనం చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ 1956-2014 మధ్యకాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్నకోణంలో చదవడం ముఖ్యం. ఎలా చదవాలంటే.. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక స్థితిపై ప్రత్యేకంగా పుస్తకాలు లేవు. ప్రస్తుతం తెలుగు అకాడమీ వాటి ముద్రణను చేట్టింది. రెఫరెన్స్ మెటీరియల్ ఉంది. 2010-2015 మధ్యకాలంలో ఎలా ఉందన్న వివరాలు తెలంగాణ సోషియో ఎకమిక్ ఔట్‌లుక్‌లో ఉన్నాయి. అందులో ఉత్పత్తి రంగాలు, వాటి వాటా వివరాలను జాతీయ స్థాయిలో కేంద్రం విడుదల చేసిన ఎకనమిక్ సర్వేలో... రాష్ట్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన సోషియో ఎకనమిక్ ఔట్‌లుక్‌లో లభిస్తాయి. వృద్ధిరేటు, తలసరి ఆదాయం, జిల్లాల ఆదాయం, ఆదాయ వనరులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, తెలంగాణలోని అటవీ వనరులు, బొగ్గు, నీరు వంటివి తెలంగాణకు ఎలా ఉపయోగపడలేదన్నది తెలుసుకోవాలి. అంతేకాదు తెలంగాణలో పన్నులు వసూలు చేసి ఇతర ప్రాంతాలకు ఎలా తరలించారన్నది, నీళ్లు ఎలా తరలించుకుపోయారన్నది, నియామకాల్లో ఎలా నష్టం జరిగిందన్న కోణంలో కచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. మూడు కాలాలుగా విభజన.. పై అంశాలను చదువుకునే క్రమంలో 1956 నుంచి ఇప్పటివరకు మూడు దశలుగా విభజించుకోవాలి. 1956 నుంచి 1971 వరకు ఒకటి; 1972 నుంచి 1992 వరకు రెండో దశ; 1993 నుంచి 2014 వరకు మూడో దశగా విభజించుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలో మూడో దశకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. అంతకుముందు దశలకు సంబంధించిన సమాచారం పూర్తిగా లేదు. కానీ వీటికి సంబంధించిన అధ్యయనాలు ఉన్నాయి. వాటి ఆధారంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు 1969లో వచ్చిన ‘ది తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్’; 2009, 2014ల్లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ-ప్రాంతీయ అసమానతల పరిణామక్రమం, డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956-2001 ఏ స్టడీ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్ అనే అధ్యయనాల ఆధారంగా నోట్స్ రాసుకోవాలి. కీలకంగా భూసంస్కరణలు.. - తెలంగాణలో భూసంస్కరణలు ఎంతో కీలకమైనవి. ఎక్కువ సంస్కరణలకు చట్టాలు ఇక్కడే వచ్చాయి. ఆ చట్టాలతోపాటు వాటి అమలును తెలుసుకోవాలి. మొదటి తరం భూసంస్కరణలు 1948 నుంచి 1973 మధ్యకాలంలో వస్తే.. ఆ తరువాత వచ్చినవి రెండో తరం సంస్కరణలు. మొదటి తరంలో 1948లో జాగీర్దారీ విధానం రద్దు చట్టం, 1949లో వచ్చిన జమీందారీ విధానం, 1954లో వచ్చిన ఇనాందారీ విధానాల రద్దు, 1950లో వచ్చిన కౌలుదారీ చట్టం వంటివి ప్రధానమైనవి. ఈ చట్టాలన్నీ తెలంగాణకు సంబంధించినవే. - రెండో తరంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్-1973, అసైన్డ్‌భూముల చట్టం, 2011లో వచ్చిన ల్యాండ్ లెసైన్ ్సడ్ కల్టివేషన్ యాక్ట్ ప్రధానమైనవి. ఇందులో కౌలుదారునికి పం టపై హక్కువంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఆదివాసీ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూ బదలాయింపు, నియంత్రణ చట్టాలపై అవగాహన అవసరం. నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ధర్ కమిటీ, వాంఛూ కమిటీ, ఫజల్ అలీ కమిషన్, కుమార్ లలిత్, విశిష్ట్ భార్గవ, రోశయ్య కమిటీ, 14 ఆర్థిక సంఘం, ముల్కీ నిబంధనలకు సంబంధించిన నివేదికలను చదువుకోవాలి. పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, 12వ పంచవర్ష ప్రణాళిక, నీతి ఆయోగ్ వంటి వాటిని చదువుకోవాలి.