గాంధీభవన్లో తెలంగాణ జాగ్రఫీ పుస్తకావిష్కరణ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జ్ఞాపకార్ధం తెలంగాణ జాగ్రఫీ పుస్తకాన్ని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు, ప్రజా సంఘాలకు చరిత్రలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడం దురదృష్టమన్నారు.
తెలంగాణ ఆవిర్భావంలో సోనియా పాత్రను కూడా చేర్చకపోవడం దారుణమన్నారు. ఈ విషయం గురించి టీఎస్పీఎస్సీ చరిత్ర పుస్తకాల్లో జోడించాలని డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ మాట ఎటుపోయిందని ఎద్దేవా చేశారు.