కొత్త వాళ్లకి అవకాశాలు ఇవ్వండి
‘‘ఈ వేదికపై ఉన్న చాలా మంది నిర్మాతలు నా సినిమాలతో స్ఫూర్తి పొందామని చెబుతుండటం సంతోషం. మీరు పెద్ద సినిమాలు చేస్తున్నారు.. అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసి కొత్తవాళ్లకి చాన్స్ ఇస్తే ఇన్నేళ్లుగా నేను చేసిన ప్రయత్నానికి కొనసాగింపుగా ఉంటుంది’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు అన్నారు.
ఆకాష్ , భావనా వళపండల్ జంటగా గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్కారు నౌకరి’. కె.రాఘవేంద్ర రావు నిర్మిస్తున్నారు. ఆర్కే టెలీఫిలింస్ స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘సర్కారు నౌకరి’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సురేశ్ బాబు, నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, గాయని సునీత తదితరులు పాల్గొన్నారు.