Telugu candidates
-
లోక్‌సభ అభ్యర్థుల్లో31% సంపన్నులు... 20% నేరచరితులు
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 30.8 శాతం మంది కోటీశ్వరులే. అలాగే 20 శాతం (1,643) మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 1,190 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాల వంటి తీవ్రమైన కేసులున్నాయి. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను విశ్లేíÙంచిన మీదట అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు బుధవారం నివేదిక విడుదల చేశాయి. మొత్తం అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పారీ్టల తరఫున, 532 మంది రాష్ట్ర పారీ్టల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ పారీ్టల నుంచి బరిలో ఉన్నారు. 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు. మొత్తం 751 పారీ్టలు పోటీలో ఉన్నాయి. 2019లో 677 పార్టీలు, 2014లో 464, 2009 ఎన్నికల్లో 368 పారీ్టలు పోటీ చేశాయి. 2009 నుంచి∙2024 వరకు ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పారీ్టల సంఖ్య 104% పెరిగింది. కాగా మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 324 మంది సిట్టింగ్ ఎంపీల సంపద గత ఐదేళ్లలో సగటున 43% పెరిగింది. పెరుగుతున్న మహిళాæ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య ఈసారీ స్వల్పంగానే ఉంది. కేవలం 797 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే గత మూడు లోక్‌సభ ఎన్నికల నుంచి వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2009లో 7 శాతం, 2014లో 8 శాతం, 2019లో 9 శాతం మహిళలు లోక్‌సభ బరిలో నిలవగా ఈసారి 10 శాతానికి చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 69 మంది మహిళలకు, కాంగ్రెస్ 41 మందికి టికెట్లిచ్చాయి.సగానికి పైగా రెడ్ అలర్ట్ స్థానాలే...క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1,500 కాగా ఈసారి 1,643కు పెరిగింది. మొత్తం 440 మంది అభ్యర్థులలో 191 మంది నేర చరితులతో ఈ జాబితాలో బీజేపీ టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (327 మందిలో 143), బీఎస్పీ (487 మందిలో 63), సీపీఎం (52 మందిలో 33) ఉన్నాయి. 3903 మంది స్వతంత్ర అభ్యర్థులలో 550 (14%) మంది నేర చరితులు. ఈ జాబితాలో టాప్ 5లో కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, పశి్చమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరున్నారు. ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది నేర చరితులున్న (రెడ్ అలర్ట్) స్థానాలు 2019లో 36 శాతం కాగా ఈసారి ఏకంగా 53 శాతానికి పెరిగాయి. ఈ జాబితాలో 288 నియోజకవర్గాలు చేరాయి. అంటే దేశవ్యాప్తంగా ప్రతి రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి రెడ్ అలర్ట్ స్థానమే!సంపన్నుల్లో తెలుగు అభ్యర్థులే టాప్–2అభ్యర్థుల్లో కోటీశ్వరులు 2019లో 16 శాతం కాగా ఈసారి 27 శాతానికి పెరిగారు. మొత్తం అభ్యర్థులలో 2,572 మంది కోటీశ్వరులే! ఈ జాబితాలో కూడా బీజేపీయే టాప్‌లో నిలిచింది. 440 మంది బీజేపీ అభ్యర్థుల్లో 403 కోటీశ్వరులే. అంటే 91.6 శాతం! 2019లో ఇది 41.8 శాతమే. 327 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో 292 మంది (89%), 487 మంది బీఎస్పీ అభ్యర్థులలో 163 మంది (33%), 52 మంది సీపీఎం అభ్యర్థులలో 27 మంది (52%) ), 3,903 మంది ఇండిపెండెంట్లలో 673 మంది (17%) మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో తొలి, రెండో స్థానంలో తెలుగు అభ్యర్థులే ఉండటం విశేషం. ఏపీలోని గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏకంగా రూ.5,705 కోట్లతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4568.22 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
సివిల్స్ ర్యాంకర్లకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందంటూ బుధవారం ట్వీట్ చేశారు. ‘సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’సీఎం జగన్ ట్వీట్ చేశారు. (చదవండి : సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా) కాగా, ఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2019 ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. దాదాపు 50 మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆయా సర్వీసులకు ఎంపికయ్యారు. గతంలో కంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ మంది తెలుగు అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 829 మంది ఐఏఎస్, ఐపీఎస్, తదితర కేడర్ పోస్టులకు, గ్రూప్ఏ, గ్రూప్ బి సర్వీసులకు ఎంపికయ్యారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను.#CivilServicesResults — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2020 -
సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/కడప ఎడ్యుకేషన్/మైదుకూరు: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2019 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు విజయఢంకా మోగించారు. 100లోపు ర్యాంకుల్లో ఐదుగురు తెలుగువారున్నారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో దాదాపు 50 మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆయా సర్వీసులకు ఎంపికయ్యారు. గతంలో కంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ మంది తెలుగు అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 829 మంది ఐఏఎస్, ఐపీఎస్, తదితర కేడర్ పోస్టులకు, గ్రూప్ఏ, గ్రూప్ బి సర్వీసులకు ఎంపికయ్యారు. సొంత ప్రణాళికలతోనే.. సొంతంగా ప్రిపేర్ అవుతూ ఆర్సీ రెడ్డి టెస్ట్ సిరీస్ రాశాను. సొంత ప్రణాళికను రూపొందించుకొని 76వ ర్యాంక్ సాధించా. – మల్లవరపు సూర్యతేజ, గుంటూరు, (76వ ర్యాంక్) నాలుగో ప్రయత్నంలో అత్యుత్తమ ర్యాంక్ సివిల్స్ మూడో ప్రయత్నం (2017)లో ఐఆర్ఎస్ సాధించాను. సివిల్స్ కోసం రోజూ 8 నుంచి 9 గంటలపాటు ప్రణాళికాబద్ధంగా చదివాను. – రుషికేశ్‌రెడ్డి, కడప (95 ర్యాంకు) మంచి సేవ చేయొచ్చనే.. నాలుగో ప్రయత్నంలో 103వ ర్యాంకు సాధించాను. సివిల్స్ ద్వారా దేశానికి మంచి సేవ చేయవచ్చు. –సత్యసాయి కార్తీక్, కాకినాడ ఆరో ప్రయత్నంలో 117వ ర్యాంకు మాది.. వ్యవసాయ కుటుంబం. ఐదుసార్లు సివిల్స్ రాసినా ఫలితం దక్కలేదు. నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో 117వ ర్యాంక్ సాధించాను. – రాహుల్‌కుమార్ రెడ్డి, పెండ్లిమర్రి, వైఎస్సార్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలోనే చదివా.. మా నాన్న.. రైతు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. – శివగోపాల్‌రెడ్డి, (263వ ర్యాంక్) మైదుకూరు -
ఎస్బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఎండీగా చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా కేంద్రం ఆయన నియామకాన్ని ఖరారు చేయటంతో... మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. గతంలో ఈయన ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1988లో అహ్మదాబాద్ ఎస్బీఐలో ప్రొబెషనరీ అధికారిగా ఉద్యోగంలో చేరిన శ్రీనివాసులుకు వ్యవసాయమంటే ఎంతో ఇష్టం. దానికి తగ్గట్టే ఆయన హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ) వ్యవసాయ విద్యను అభ్యసించారు. ఆ తరవాత అనుకోకుండా బ్యాంకింగ్ రంగంలో అడుగు పెట్టి అక్కడే స్థిరపడ్డారు. ఎస్బీఐలో వివిధ హోదాల్లో పనిచేసిన శ్రీనివాసులు... వృత్తి రీత్యా గతంలో కొన్నాళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. -
సివిల్స్‌లో తెలుగు ప్రభంజనం
-
సివిల్స్‌లో తెలుగు ప్రభంజనం
► ఎంపికైన 1099 మందిలో 90 మందికిపైగా మనోళ్లే.. సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన సివిల్స్‌లో తెలుగు అభ్యర్థులు దుమ్మురేపారు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 90 మంది వరకు సివిల్స్‌లో విజయం సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం రాత్రి సివిల్ సర్వీసెస్ ఎగ్జామి నేషన్–2016 ఫలితాలు వెల్లడించింది. కర్ణాట కకు చెందిన కేఆర్ నందిని తొలి ర్యాంకు కైవసం చేసుకున్నారు. కన్నడ సాహిత్యం ఆప్షనల్‌గా ఎంచుకుని ఆమె సివిల్స్ రాసి నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. ఈమె ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారిగా శిక్షణ పొందుతున్నారు. రెండోర్యాంకును అన్మోల్ షేర్ సింగ్ బేడీ సొంతం చేసుకున్నారు. పంజా బ్‌కు చెందిన ఈయన బిట్స్ పిలానీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీఈ పూర్తి చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాల కృష్ణ మూడో స్థానంలో నిలవగా, విజయవా డకు చెందిన కొత్తమాసు దినేశ్‌కు మార్(వరంగల్ ఎన్ఐటీలో చదివారు) ఆరో ర్యాంకు సాధించారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు కైవసం చేసు కున్నారు. ఆగస్టులో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 11,35,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,59,659 మంది పరీక్ష రాశారు. వీరిలోంచి 2016 డిసెంబర్లో నిర్వహించిన మెయిన్స్‌కు 15,452 మంది ఎంపికయ్యారు. తుదకు 2,961 మందికి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మౌఖిక పరీక్ష నిర్వహించి 1099 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేశారు. ఐఏఎస్, ఐఎఫ్ ఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ – గ్రూప్ ఏ, గ్రూప్ బీ సర్వీసులకు వీరు అర్హత సాధించారు. వీరిలో 253 మంది మహిళలు ఉండటం గమనార్హం. టాప్–25లో 18 మంది పురు షులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. వివిధ సర్వీసులకు ఎంపికైనవారిలో 500 మంది జనరల్ కేటగిరీలో, 347 మంది ఓబీసీ కేటగి రీలో, 163 మంది ఎస్సీ, 89 మంది ఎస్టీ కేటగిరీల్లో ఉన్నారు. మరో 172 మందిని రిజర్వు లిస్టులో పెట్టారు. ఐఏఎస్‌కు ఎంపికైన 180 మందిలో జనరల్ 90, ఓబీసీ 49, ఎస్సీ 27, ఎస్టీ 14 మంది ఉన్నారు. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికైన 45 మంది అభ్యర్థుల్లో జనరల్ 26, ఓబీసీ 12, ఎస్సీ 06, ఎస్టీ కేటగిరీలో ఒక్కరు ఉన్నారు. ఐపీఎస్ కేటగిరీలో ఎంపికైన 150 మందిలో జనరల్ 81, ఓబీసీ 37, ఎస్సీ 18, ఎస్టీ 14 మంది అభ్యర్థులున్నారు. కలిసొచ్చిన ఆంత్రోపాలజీ: సివిల్స్‌కు ఎంపికైన వారిలో ఎక్కువ మంది ఆంత్రోపాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్న వారే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో ఎక్కువ మంది ఆంత్రోపాలజీనే ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. విజేతలు ఏమంటున్నారు..? సివిల్స్‌లో ఆరో ర్యాంకు సాధించిన దినేశ్ వరంగల్ నిట్‌లో 2010–14 మెకానికల్ బ్రాంచీలో చదివారు. రెండు సంవత్సరాలుగా ఢిల్లీలో పొలిటికల్ సైన్స్‌ను సబ్జెక్ట్‌గా ఎంచుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయినట్లు తెలిపాడు. ఇక వైఎస్సార్ జిల్లావాసులు ఇద్దరు సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించారు. కడపలోని బాలాజీనగర్‌కు చెందిన గడికోట పవన్ కుమార్‌రెడ్డి 353వ ర్యాంకు సాధించారు. గతంలో ఐఎఫ్ఎస్లో 26వ ర్యాంకు సాధించిన ఆయన ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖలో డీఎఫ్ఓగా పనిచేస్తున్నారు. కడపలోని అక్కాయపల్లెకు చెందిన మేరువ సునీల్‌కుమార్‌రెడ్డి 354వ ర్యాంకు సాధించి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. ఈయన పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నిట్‌లో బీటెక్ చదివారు. భవిష్యత్తులో ఐఏఎస్‌ను సాధించ డమే తన లక్ష్యమని సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తిలోని పద్మశాలీ కాలనీకి చెందిన చెన్నూరి రూపేశ్ 526 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. హసన్‌పర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేసిన రూపేష్ ఆ తర్వాత పాలిటెక్నిక్ పూర్తి చేశారు. అనంతరం కిట్స్ కళాశాలలో బీటెక్ చదివారు. అలాగే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింతా కుమార్ గౌడ్ 608 ర్యాంకు సాధించారు. ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివిన కుమార్ ఘట్కేసర్లోని శ్రీనిధి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. సివిల్ సర్వీసే లక్ష్యంగా ఐదుసార్లు పరీక్షలు రాశాడు. 2015లో 768 ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికై శిక్షణలో ఉన్నారు. తాజా ర్యాంకుతో ఐపీఎస్ వచ్చే అవకాశం ఉంది. కాగా, ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఇద్దరు అభ్యర్థులు సివిల్స్–2016లో అర్హత సాధించారు. వీరిలో పి.ప్రేమ్ ప్రకాశ్ (ర్యాంకు–971), ఎం.నరేశ్‌కుమార్ (ర్యాంకు–1015) ఉన్నారు. ఏకే ఖాన్ కుమారునికి 22వ ర్యాంక్ సాక్షి, హైదరా బాద్: మాజీ ఐపీ ఎస్ అధి కారి, ప్రభుత్వ మైనా ర్టీ సంక్షేమ వ్యవ హారాల సలహా దారు ఏకే ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ సాధించారు. నగరంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ముజామిల్ గత ఏడాది సివిల్స్ రాసి ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఈసా రి 22వ ర్యాంక్ రావడంతో ఐఏఎస్‌కు ఖరారయ్యే అవకాశం ఉంది. ఎంపికలో భగవత్ పాత్ర.. దేశవ్యాప్తంగా 100 మంది సివిల్స్‌కు ఎంపిక కావడం వెనుక రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ పాత్ర ఉంది. సివిల్స్ ఇంటర్వూ్యలకు సంబంధించి ఈ ఏడాది దాదాపు 300 మందికి తర్ఫీదు ఇచ్చారు.300 మందిలో దాదాపు 100 మంది వివిధ ర్యాంకులు సాధించారని మహేష్ భగవత్ ‘సాక్షి’కి తెలిపారు. దివ్యాంగుల్లోఆత్మస్థైర్యం నింపడానికే.. హైదరాబాద్: సివిల్స్‌లో 167వ ర్యాంకు వచ్చిన ప్పటికీ ఐఏఎస్‌లో చేర ను. కేవలం దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపడానికే నేను సివిల్స్ రాశాను. 2004 సివిల్స్‌లో కూడా నాకు 399వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం నేను రక్షణ శాఖ (ఇండియన్ డిఫెన్స్)లో పనిచేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సివిల్స్ కోచింగ్ కోసం అభ్యర్థులు నగరానికి వస్తున్నారు. వారికి అవసరమైన మెళకువలు బోధిస్తున్నాను. 3వ ర్యాంకు సాధించిన గోపాలకృష్ణ కూడా నా విద్యార్థే. ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని, ఆత్మవిశ్వాసంతో సివిల్స్ రాయాలని వారికి సూచించాను. –బాలలత, దివ్యాంగురాలు, 2017 సివిల్స్‌లో 167వ ర్యాంకర్ దినపత్రికలు చదివే సివిల్స్ సాధించా.. సివిల్స్‌లో 142వ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. అటు ఉద్యోగం చేస్తూనే సొంతంగా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. రోజూ దినపత్రికలతో పాటు ఆన్లైన్ మెటీరియల్ సేకరించి చదివాను. – ప్రవీణ్ శామీర్ కుమార్ చిరువూరి -
మరో తెలుగు తేజం: రూ.80.6 లక్షల జీతం!
పత్తిపాడు: గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థలో భారీ వేతనంతో కొలువును దక్కించుకున్నాడు. ప్రత్తిపాడు మండలం గనికపూడికి చెందిన అంచా అయ్యేశ్వరరావు, ప్రమీల దంపతుల కుమారుడు వెంకట సిద్ధార్థ గౌహతిలోని ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే కళాశాలలో మైక్రోసాఫ్ట్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సిద్ధార్థ్ ఎంపికయ్యాడు. అమెరికాలోని రెడ్మౌంట్లో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు ఏడాదికి 1.30 లక్షల డాలర్లు (రూ. 80.60 లక్షలు) ఆఫర్ చేసినట్లు అయ్యేశ్వరరావు బంధువు అంచా రవిబాబు వెల్లడించారు. ఐఐటీ కంప్యూటర్ సైన్స్‌లో టాపర్ అయిన సిద్ధార్థ ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాడు. ** -
‘విదర్భ’ తెలుగు వీరులు వీరే..
విదర్భ రాజకీయాల్లో తెలుగు ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నుంచి పలు పార్టీల నుంచి రాష్ట్ర స్థాయి పదవులను అలంకరించినవారూ ఉండటం విశేషం. ఒకప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఎంతమంది గెలిచి తెలుగు వారి కీర్తిని పెంచుతారో వేచి చూడాల్సిందే.. సాక్షి, ముంబై: విదర్భలోని వివిధ నియోజకవర్గాల్లో ఆరుగురు తెలుగు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా చంద్రాపూర్ జిల్లా బల్లార్షా (బల్లార్పూర్) నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్, చంద్రాపూర్ నుంచి కిషోర్ జోరగేవార్, యావత్మాల్ జిల్లా వనీ నియోజకవర్గం నుంచి కాసవార్ వామన్రావ్, బొద్కూర్వార్ సంజీవ్‌రెడ్డి, యావత్మాల్ నుంచి మదన్ యేర్వార్, దిలీప్ ముక్కావార్లు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో విదర్భలో ఇద్దరు తెలుగువాళ్లు ఎమ్మెల్యేలుగా పదవులు అలంకరించారు. ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందన్న నమ్మకాన్ని తెలుగు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. బల్లార్షా (బల్లార్పూర్)లో.... జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న సుధీర్ మునగంటివార్ మరోసారి చంద్రాపూర్ జిల్లా బల్లార్షా నుంచి బీజేపీ టిక్కెట్‌పై బరిలోకి దిగారు. మరోవైపు శివసేన తరఫున కేశవ్ కత్రే, కాంగ్రెస్ నుంచి మూల్చందాని గన్‌శ్యాం, వామన్ జడే (ఎన్సీపీ), దహివడే రమేష్‌చంద్ర (సీపీఎం), హర్షల్ చిప్లూన్కర్ (ఎమ్మెన్నెస్)లతోపాటు మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారినప్పటికీ సుధీర్ మునగంటివార్‌కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని వరకు అనేక కీలక పదవులు అలంకరించిన ఆయన ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు (చంద్రాపూర్ నుంచి రెండు సార్లు, ఒకసారి బల్లార్షా నుంచి) ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగవ సారి మళ్లీ బరిలో ఉన్నారు. ఆయన చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలతోపాటు అభివృద్ధి పనులు రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా శివసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చిన సమయంలో నారాయణరాణే ముఖ్యమంత్రిగా ఉండగా పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఇలా వివిధ పదవులు చేపట్టిన ఆయనకు 1999లో ఉత్తమ శాసన సభ్యునిగా అవార్డు లభించింది. చంద్రాపూర్‌లో... చంద్రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగు వ్యక్తి అయిన కిషోర్ జోరగేవార్ శివసేన టిక్కెట్‌పై బరిలోఉన్నారు. మెన్దే మహేష్ (కాంగ్రెస్), అశోక్ నాగపూరే (ఎన్సీపీ), శమ్కులే నాన్జీ (బీజేపీ), సునితా గైక్వాడ్ (ఎమ్మెన్నెస్)లతోపాటు మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు అభ్యర్థి కిషోర్ జోరగేవార్ విజయం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బడుగు బలహీనవర్గాల కోసం నిత్యం ముందుండే కిషోర్ చాందా తెలుగు సేవా సమితి సంఘం స్థాపించి తెలుగు వారి ఐక్యతతోపాటు సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అదే విధంగా విదర్భ బురుడ్ సమాజం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతోపాటు ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో చంద్రాపూర్‌లో తనదైన ముద్రను వేసుకున్నారు. దీంతో ఆయనకు శివసేన టిక్కెట్ ఇచ్చింది. తాను గెలిస్తే చంద్రాపూర్‌ను మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. యావాత్మల్, వనీలలో.. యావత్మాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు తెలుగు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రముఖ పార్టీలపై బీజేపీ నుంచి మదన్ యేర్వార్, పీడబ్ల్యూపీ నుంచి దిలీప్ ముక్కావార్లు బరిలో ఉన్నారు. వీరితోపాటు కాంగ్రెస్ నుంచి రాహుల్ ఠాక్రే, సంతోష్ డవలే (శివసేన), సందీప్ బజోరియా (ఎన్సీపీ), రాజనే భానుదాస్ (ఎమ్మెన్నెస్)తోపాటు మొత్తం 22 మంది బరిలో ఉన్నారు. మరోవైపు యావత్మాల్ జిల్లాలోని వనీ నియోజకవర్గంలో కూడా ఇద్దరు తెలుగు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే కాసావార్ వామన్రావ్, బీజేపీ నుంచి బోద్కువార్ సంజీవ్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్సీపీ నుంచి సంజయ్ దేర్కర్, నాందేకర్ విశ్వాస్ (శివసేన), రాజు ఉంబార్కర్ (ఎమ్మెన్నెస్)తోపాటు మొత్తం 13 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
మరాఠ్వాడాలో మనోళ్లు ముగ్గురు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠ్వాడా నుంచి ముగ్గురు తెలుగు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కైలాష్ గోరింట్యాల్ జాల్నా నుంచి, నాందేడ్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున దిలీప్ కందుకుర్తి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) నుంచి ప్రకాష్ మరావార్లు పోటీ చేస్తున్నారు. గతంలో మరాఠ్వాడా నుంచి ఒకేఒక తెలుగు అభ్యర్థి బరిలో నిలవగా ఈసారి ముగ్గురికి చేరింది. జాల్నా... మరాఠ్వాడాలో ప్రస్తుతం ఏకైక తెలుగు రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన కైలాష్ గోరింట్యాల్ ఈసారి మల్లి జాల్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో శివసేన నుంచి అర్జున్ కోత్కర్, బీజేపీ నుంచి అరవింద్ చవాన్, ఎన్సీపీ నుంచి కుశాల్‌సింగ్ ఠాకూర్, ఎమ్మెన్నెస్ నుంచి రవి రావుత్లతోపాటు మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీ జరగనుంది. ఇక తెలుగు అభ్యర్థి కైలాష్ గోరింట్యాల్ గురించి చెప్పాలంటే.. బలమైన రాజకీయ వారసత్వం కలిగిన ఆయన ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరి పూర్వికులు జీవనోపాధికోసం వచ్చి స్థానికంగా స్థిరపడ్డారు. కైలాష్ తండ్రి కిషన్రావ్ కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేయడం, మేనమామ బీజేపీ తరఫున ప్రజాక్షేత్రంలో ఉండడంతో కైలాష్ చిన్ననాటి నుంచి రాజకీయాలకు దగ్గరగా ఉన్నారు. కాలేజీ చదివేరోజుల నుంచి రాజకీయాల్లో చేరి క్రియశీలంగా వ్యవహరించేవారు. 1986లో మరాఠ్వాడా యూనివర్సిటీ సెనెటర్‌గా గెలుపొందిన ఆయన 1991లో జాల్నా కౌన్సిలర్‌గా 1992లో కౌన్సిల్ చెర్మైన్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇలా అతిపిన్న వయసులో కౌన్సిలర్ చెర్మైన్ పదవి చేపట్టిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అనంతరం శివసేన, బీజేపీల కాషాయకూటమి అధికారంలో ఉండగా అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన కైలాష్‌ను కాంగ్రెస్ అధిష్టానం 1999లో జాల్నా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 2004లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ 2009లో మళ్లీ కాంగ్రెస్ టిక్కెట్‌పై ఆయన 20 వేల మెజార్టీతో శివసేన అభ్యర్థి అంబేకర్ భాస్కర్‌పై విజయం సాధించారు. తాను చేసిన అభివృద్ది పనులే ఈసారి తనను గెలిపిస్తాయని కైలాష్ చెబుతున్నారు. నాందేడ్‌లో.... సౌత్ నాందేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు తెలుగు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి దిలీప్ కందుకుర్తి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ప్రకాష్ మారావార్లు బరిలో ఉన్నారు. వీరిద్దరితోపాటు కాంగ్రెస్ తరఫున ఓంప్రకాష్ పోకర్ణా, ఎన్సీపీ నుంచి పాండురంగ కాకడే, శివసేన నుంచి హేమంత్ పాటిల్‌తోపాటు మొత్తం 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దిలీప్ కందుకుర్తి... దిలీప్ కందుకుర్తి 20 సంవత్సరాలకుపైగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందుతూ వస్తున్న ఆయన కార్పొరేటర్‌గా తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం ఆయనతోపాటు ఆయన భార్య కూడా కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభిస్తుందని ఆశించిన ఆయన కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఓంప్రకాష్ పోకర్ణానే మళ్లీ బరిలోకి దింపింది. దీంతో తెలుగు ప్రజల మద్దతు లభించడంతో కాంగ్రెస్‌పై తిరుగుబాటుచేసి బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ నుంచి టికెట్ లభించింది. బీజేపీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేస్తున్నవారిలో కీలక సభ్యుడిగా మారారు. ప్రకాష్ మారావార్... ప్రకాష్ మారావార్కు నాందేడ్ జిల్లాలో శివవసేన స్థానిక నాయకునిగా మించి గుర్తింపు ఉంది. ఇటీవలే పార్టీలో వచ్చిన విభేదాల కారణంగా శివసేన నుంచి వైదొలగి ఎమ్మెన్నెస్‌లో చేరారు. ముఖ్యంగా శివసేన నాందేడ్ జిల్లా కార్యాధ్యక్షులుగా ఉండే ప్రకాష్‌ను కాదని మరొకరికి జిల్లా అధ్యక్షుని పదవికి ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేసిన ఆయన తిరుగుబాటు చేశారు. అనంతరం ఎమ్మెన్నెస్‌లో చేరారు. దీంతో ఎమ్మెన్నెస్ ఆయనను సౌత్ నాందేడ్ నుంచి బరిలోకి దింపింది. తనకంటు ఓ గుర్తింపు ఉన్న ప్రకాష్ మొదటిసారిగా సారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే తాను చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు ఓట్లు వేస్తారన్న నమ్మకంతో ఉన్నాడు. ఉత్తరనాందేడ్లో నివాసముంటున్న ఆయన దక్షిణ నాందేడ్ నుంచి పోటీచేయడం కొంత ప్రతికూలాంశంగా విశ్లేషకులు చెబుతున్నారు.