Telugu student killed
-
‘జాహ్నవి’ మృతిపై అనుచిత వ్యాఖ్యలు..విధుల నుంచి అధికారి తొలగింపు
సియాటెల్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23)పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్న పోలీసు అధికారిపై వేటు పడింది. పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్‌ను గస్తీ విధుల నుంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ విభాగం గురువారం ధ్రువీకరించింది. అతడికి ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదని కూడా తెలిపింది. అయితే, అడెరర్పై చర్యలు ఎప్పుడు తీసుకున్నదీ వెల్లడించలేదు. జనవరి 23వ తేదీన సియాటెల్‌లో కెవిన్ డేవ్ పోలీసు అధికారి నడుపుతున్న వాహనం ఢీకొని రోడ్డు దాటుతున్న కందుల జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న మరో అధికారి డేనియల్ అడెరర్ చులకన చేస్తూ మాట్లాడటంపై తీవ్ర దుమారం చెలరేగింది. అడెరర్ బారీ కెమెరా రికార్డింగ్ ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సియాటెల్ పోలీస్ విభాగం పేర్కొంది. -
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి
హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన నంబూరి శ్రీదత్త అనే విద్యార్థి ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాలివీ... నగరంలోని వనస్థలిపురం, కమలానగర్ కు చెందిన శ్రీదత్త టెక్సాస్ రాష్ట్రం హోరిజాన్ నగరంలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆదివారం స్నేహితులతో కలసి ఓ జలపాతం వద్దకు వెళ్లిన శ్రీదత్త ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందినట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు అమెరికాలో కృష్ణా జిల్లాకు చెందిన నరేష్ అనే విద్యార్థి మూడు రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లి రిజర్వాయర్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
హైదరాబాద్: అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెం దాడు. దీంతో హైదరాబాద్ నాచారంలోని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు విచారంలో మునిగిపోయారు. నాచారంలోని సాయిదుర్గా అపార్ట్‌మెంట్‌కు చెందిన సీఏ మోజెస్, శివారాణి దంపతుల కుమారుడు నోయల్ మాథ్యూస్ (24) అమెరికాలోని ట్రాయ్ యూనివ ర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. మాథ్యూస్ తన స్నేహితులతో కలసి శనివారం ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగొస్తుండగా ఆదివారం ఉదయం అలబామా ప్రాంతం లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాథ్యూస్ అక్కడిక్కడే మృతి చెందారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరుకు చెందిన భరత్, వంశీలు తీవ్రంగా గాయపడ్డారని, నిఖిల్, యశ్వంత్లకు స్వల్ప గాయాలయ్యాయని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.