అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి | telugu student killed in america | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

Published Tue, Jun 21 2016 1:59 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి - Sakshi

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన నంబూరి శ్రీదత్త అనే విద్యార్థి ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాలివీ... నగరంలోని వనస్థలిపురం, కమలానగర్ కు చెందిన శ్రీదత్త టెక్సాస్ రాష్ట్రం హోరిజాన్ నగరంలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆదివారం స్నేహితులతో కలసి ఓ జలపాతం వద్దకు వెళ్లిన శ్రీదత్త ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందినట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు అమెరికాలో కృష్ణా జిల్లాకు చెందిన నరేష్ అనే విద్యార్థి  మూడు రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లి రిజర్వాయర్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement