temple festival
-
Madipadiga Annapurna: టెంఫుల్ హార్ట్
‘లివింగ్ టెంపుల్(Living Temple)’ అనేది మన హెరిటేజ్‌ను సెలబ్రేట్ చేయడమే! టెంపుల్ ఆర్ట్‌కి సంబంధించిన పలు కళాకారులంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఒక డైలాగ్‌కు స్పేస్ ఇవ్వబోతున్నారు. ఇదిప్పుడు మనకు చాలా అవసరం. గుడి అనగానే గుర్తొచ్చేది దేవుడు, మొక్కులు, టెంకాయలు! కానీ గుడి అంటే సకల కళా నిలయం! జీవనశైలిని ఈస్తటిక్ లెన్స్‌లో చూపించే కాన్వాస్! నాడు వాస్తు, శిల్పం, చిత్రం, సంగీతం, నృత్యం అన్నిటికీ గుడే వేదిక.. వాటిని నేర్పే బడి కూడా! దాని ఆవరణలోని కొలను ఆధారంగా సాగూ సాగేది! అంటే సంస్కృతిని సంరక్షించే ఆలయంగానే కాదు సంపద పెంచే వనరుగానూ భాసిల్లింది!మారిన కాలంలో గుడికి ప్రాముఖ్యం తగ్గకపోయినా దాన్ని చూసే మన ఈస్తటిక్ లెన్సే మసకబారాయి! అయినా టెంపుల్ ఆర్ట్ (Temple Art) స్ఫూర్తితో ఆ ఘనమైన సాంస్కృతిక చరిత్రను పరిరక్షిస్తున్న కళాకారులు ఉన్నారు! దేశంలో ఎక్కడెక్కడో ఉన్న అలాంటి 31 మంది కళాకారులు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి వాళ్ల కళారూపాలతో ‘లివింగ్ టెంపుల్’ పేరుతో మూడు రోజుల ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు క్యురేటర్ మడిపడిగ అన్నపూర్ణ! ఎప్పుడు... ఫిబ్రవరి 28 నుంచి మార్చి రెండు వరకు! ఎక్కడ... టీ వర్క్స్, హైదరాబాద్!అసలీ అన్నపూర్ణ ఎవరు?హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగిన అన్నపూర్ణ విజువల్ ఆర్ట్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమెకు స్ఫూర్తి.. తొలి గురువు తండ్రి రోహిణీ కుమార్. ఆయన వృత్తిరీత్యా పెయింటరే అయినప్పటికీ సొంతంగా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ప్రారంభించి దాన్నే వృత్తిగా చేసుకున్నారు. దాంతో ఉగ్గుపాల నాడే అన్నపూర్ణకు టెంపుల్ ఆర్ట్‌ను పరిచయం చేశారు. కూతురు పెరుగుతున్న కొద్దీ ఆ కళ విశిష్టతను వివరిస్తూ వచ్చారు. కళలను, మనిషి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న వేదికగా గుడిని చూపించారు. ప్రతి ఆరునెలలకు ఒక పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి టెంపుల్ ఆర్ట్, జీవనశైలి మీదప్రాక్టికల్ జ్ఞానాన్నందించేవారు.ఒక్కమాటలో కూతురికి ఈస్తటిక్ లెన్స్‌లో ప్రపంచాన్ని పరిచయం చేశారని చెప్పాచ్చు. ఆ ఆసక్తితోనే అన్నపూర్ణ ఆర్ట్స్‌లో చేరారు. అయితే అకడమిక్స్‌లో నాన్న చెప్పినంత ఘనమైన స్థానం కనిపించలేదు మన ఆర్ట్, కల్చర్‌కి. పాశ్చాత్య కళానైపుణ్యంతోనే నిండిపోయి ఉంది సిలబస్ అంతా! మన కళల పట్ల నిర్లక్ష్యమో.. పెద్దగా పరిగణించకపోవడమో.. లేదంటే బ్రిటిష్ వాళ్లు నిర్ధారించిన అకడమిక్స్ అయ్యుండటమో.. కారణమేదైనా మన కళాసంస్కృతి గొప్పదనమైతే తెలియకుండా పోయింది. కాలగమనంలో చాలా గుళ్ల స్వరూప స్వభావాలూ మారిపోయాయి. వాస్తు శిల్ప చిత్రలేఖన సంపద మిగిలి ఉన్న గుళ్లల్లో సంగీతం, నాట్య కళల ఊసు లేదు. భవిష్యత్ తరాలకు అందాల్సిన ఆ సాంస్కృతిక వారసత్వ సంపద చెల్లాచెదురైంది. దాన్ని కాపాడాలి.. పరిరక్షించాలనే తపన పట్టుకుంది అన్నపూర్ణకు. చదువైపోయాక క్యురేటర్‌గా చేరినా.. ఆర్ట్ షోలు నిర్వహిస్తున్నా.. చిత్తమంతా టెంపుల్ ఆర్ట్ మీదే! ఆర్ట్ షోలు చేస్తున్న క్రమంలోనే దేశంలోని పలుప్రాంతాల్లో.. వాళ్ల వాళ్ల శైలిలో టెంపుల్ ఆర్ట్‌ను సాధన చేస్తున్న కళాకారులున్నారని తెలిసింది అన్నపూర్ణకు. అప్పుడు వచ్చింది ఆమెకు ‘లివింగ్ టెంపుల్’ ఆలోచన!రెండేళ్ల శ్రమఆ ఆలోచన వచ్చిన నాటి నుంచి టెంపుల్ ఆర్ట్ మీద పరిశోధన మొదలుపెట్టారు అన్నపూర్ణ. భారతదేశమంతా పర్యటించారు. శిథిలావస్థలోని గుళ్ల వాస్తుశిల్పాన్ని పునర్నిర్మిస్తున్న ఆర్కిటెక్ట్స్, విరిగిపోయిన విగ్రహాలను టెక్నాలజీ సహాయంతో తిరిగి చెక్కుతున్న.. రూపాలు చెదిరిన శిల్పాలను సాంకేతిక సహాయంతో తీర్చిదిద్దుతున్న శిల్పకారులు, చెదిరిపోయిన పెయింటింగ్స్ కు రంగులద్దుతూ పునరుద్ధరిస్తున్న చిత్రకారులు, గుళ్లల్లో పుట్టిన గాన.. నాట్య కళలను ఇంకా పోషిస్తున్న కళాకారుల కళారూపాలను చూశారు. వాళ్లలో విదేశీ కళాకారులూ ఉన్నారు. అందరూ సుప్రసిద్ధులే! అలాంటి 31 మంది కళాకారులను సంప్రదించారామె.వాళ్లకు తన ‘లివింగ్ టెంపుల్’ కాన్సెప్ట్‌ను వివరించారు. సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ ఉత్సవానికి హైదరాబాద్‌నే వేదికగా చేయాలనుకున్నారు. టీ వర్క్స్ప్రాంగణాన్నివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు అన్నపూర్ణ ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు. ఏదో అనుకున్నామా.. చేశామా అన్నట్టు కాకుండా ఈ వేడుక ఒక స్ఫూర్తిని, ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నారు అన్నపూర్ణ. కళాకారులు, ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కలిసి టెంపుల్ ఆర్ట్ పరిరక్షణకు అడుగులు వేయాలి, ఆ సాంస్కృతిక వారసత్వ సంపదను మన భావితరాలకు అందించాలి.. ఫైన్ ఆర్ట్స్ సిలబస్‌లో మన కళలకూ సముచిత స్థానం ఉండాలన్నదే దాని ఉద్దేశం. ఆశయం! అందుకే ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపాలనుకుంటున్నారు.చదవండి: రెక్కల గుర్రంపై.. విశాఖకు ఎగిరొచ్చిన జల కన్యలుఈ యజ్ఞం గురించి తెలుసుకున్న తమిళనాడు (Tamil Nadu).. వచ్చే ఏడాది తను ఆతిథ్యమివ్వడానికి ఉత్సాహపడింది. ‘లివింగ్ టెంపుల్’ అనేది మన హెరిటేజ్‌ను సెలబ్రేట్ చేయడమే! టెంపుల్ ఆర్ట్‌కి సంబంధించిన పలు కళాకారులంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఒక డైలాగ్‌కు స్పేస్ ఇవ్వబోతున్నారు. ఇదిప్పుడు మనకు చాలా అవసరం. ఇంకో విషయం.. టెంపుల్ అనగానే ఇదొక మతానికి సంబంధించిన సెలబ్రేషన్‌గా అనుకోవద్దు. ఇది మన దేశ సంస్కృతికి సంబంధించినది. మన ఆలయాలు పరిరక్షించిన పర్యావరణానికి సంబంధించినది. దాన్ని మళ్లీ పునరుద్ధరించడమే ఈ సెలబ్రేషన్ ఉద్దేశం’ అంటారు అన్నపూర్ణ. ఆమె పనిని ఫుల్ హార్ట్‌తో స్వాగతిద్దామా!– సరస్వతి రమ -
ఆలయ ఉత్సవాల్లో విషాదం.. క్రేన్ కుప్పకూలి నలుగురి మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదం జరిగింది. అరక్కోణం సమీపంలో నిర్వహించిన ఓ ఆలయ ఉత్సవాల్లో భక్తులపై క్రేన్ కూలడంతో నలుగురు మత్యువాత పడ్డారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. రాణిపేట జిల్లా నెమిలిలోని కిలివీడి గ్రామంలో ఆదివారం రాత్రి 8.15 గంటలకు ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. మాండియమ్మన్ దేవాలయంలో గత రాత్రి ద్రౌపది అమ్మన్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి 1500 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. నెమిలికి చెందిన 50 మంది పోలీసులు మోహరించారు. సాధారణంగా సంక్రాంతి(పొంగల్) తరువాత ఈ పండుగను జరుపుకుంటారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మైలేరు ఉత్సవాల్లో భాగంగా స్థానిక గ్రామానికి చెందిన వారు క్రేన్‌పై దేవతా విగ్రహాలను ఊరేగించారు. భక్తులు అందిస్తున్న పూలమాలలను అమ్మవారికి అలంకరించేందుకు 25 అడుగుల ఎత్తైన క్రేన్‌పై ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అయితే క్రేన్‌పై బరువు ఎక్కువవడటంతో ముందు భాగం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులపై క్రేన్ పడిపోయింది. క్రేన్‌పై నున్న ముగ్గురు వ్యక్తులు కిందపడి అక్కడిక్కడే మరణించారు. అనూహ్య ఘటనతో ప్రజలు భయాందోళనలతో పరుగలు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ బాలికతో సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అరక్కోణంలోని ప్రభుత్వ తాలూకా ఆసుపత్రికి, పొన్నైలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. మరోవైపు గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు అక్కడ ఓ వ్యక్తి తీసిన ఫోన్లో రికార్డయ్యాయి. ఇందులో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన బాధితులను కే ముత్తుకుమార్(39), ఎస్ భూపాలన్(4), బి జ్యోతి బాబుఉ(17)గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. క్రేన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. #TamilNadu | 4 people died & 9 others were injured after a #cranecollapsed during a temple festival event in #Keelveethi in #Arakkonam. #BREAKING #craneaccident #arakkonam #Accident #Temple #Death #India | #Crane | #Accident | #Dead | #Injury | #TN | #TempleFestival | pic.twitter.com/iKCjaw7OFV — Harish Deshmukh (@DeshmukhHarish9) January 23, 2023 -
ప్రాణం తీసిన కాసులు
ఆలయ ఉత్సవాల్లో ‘కాసుల’ కోసం ఎగబడ్డ భక్తులపై మృత్యువు పంజా విసిరింది. తొక్కిసలాటలో గాయాలతో, ఊపిరాడక ఏడుగురు మృతిచెందారు. మరో పదిహేను మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తిరుచ్చి తురయూరు వండితురై కరుప్పుస్వామి ఆలయ పరిసరాలు శోకసంద్రంలో మునిగాయి. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన వివరాలు.. సాక్షి, చెన్నై: తిరుచ్చి జిల్లా తురయూరు సమీపంలోని ముత్తయం పాళయంలో వండితురై కరుప్పుస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా చిత్తిరై, చిత్రా పౌర్ణమి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతాయి. ఇక్కడ ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతను చాటే రీతిలో ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజున భక్తులకు పిడి కాసుల్ని ఆలయ పూజారి పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈ కాసుల్ని తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకుంటే మహలక్ష్మి నట్టింట్లో ఉన్నట్టే. సిరి సంపదలు పెరుగుతాయన్నది భక్తులకు నమ్మకం. అలాగే, ఇక్కడ చెప్పే సోది తప్పకుండా ఫలిస్తుందని భక్తులు చెబుతుంటారు. అందుకే ఇక్కడి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలిరావడం జరుగుతుంది. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా శనివారం సోది చెప్పే కార్యక్రమం జరిగింది. ఆదివారం పిడికాసుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడి కాసుల్ని వరంగా, కానుకగా తీసుకునేందుకు వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు పోటెత్తారు. పదిహేను జిల్లాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివచ్చారు. కరుప్పుస్వామికి పూజల అనంతరం భక్తులకు పిడి కాసులు(పిడికిలి నిండా చిల్లర)పంపిణీకి పూజారి ధనపాల్ సిద్ధం అయ్యారు. తొలుత భక్తులు అందరూ బారులు తీరి మరీ కాసుల్ని అందుకుంటూ వచ్చారు. హఠాత్తుగా తొక్కిసలాట .. సజావుగా పంపిణీ సాగుతున్న సమయంలో హఠాత్తుగా తొక్కిసలాట చోటుచేసుకుంది. కాసు ల పంపిణి ముగియనున్నట్టుగా ప్రచారం సాగడంతో, ఉన్న కాసుల్ని దక్కించుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. దీంతో తొపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు భక్తులు కిందపడ్డారు. వారిని రక్షించే ప్రయత్నం కూడా చేయకుండా, వెనుక ఉన్న వాళ్లు తొక్కుకుంటూ ముందుకు సాగారు. క్రమంగా తొక్కిసలాట పెరగడంతో ఆ పరిసరాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కింద పడ్డ భక్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమై కాసుల పంపిణీ నిలుపుదల చేయించారు. భక్తుల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. బలవంతంగా అక్కడున్న వాళ్లందర్నీ బయటకు పంపించారు. అతి కష్టం మీద పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఏడుగురు బలి తొక్కిసలాటలో ఏడుగురు సంఘటన స్థలంలోనే మరణించడం విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న బలగాలు, అంబులెన్స్‌లు, వైద్య బృందాలు పరుగులు తీశాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన తురయూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఐజీ వరదరాజులు, కలెక్టర్ సెల్వరాజ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగ్రాతులందర్నీ ఆసుపత్రికి తరలించినానంతరం, మృతుల వివరాలను సేకరించారు. మృతుల్లో అరియలూరు జిల్లా తిరుమానూరు మంగళాపురానికి చెందిన కంథాయి(38). పెరంబలూరు జిల్లా వెప్పన్ తడైకు పిన్నకులంకు చెందిన రామర్(52), నామక్కల్ జిల్లా సేందమంగళంకు చెందిన శాంతి(47), కరూర్ జిల్లా నన్నియూర్‌కు చెందిన లక్ష్మి కాంతన్(60), కడలూరు జిల్లా పిన్నయత్తూరుకు చెందిన పూంగావనం(46), అరియలూరు జిల్లా పొన్ పరప్పికి చెందిన వళ్లి(46), కడలూరు జిల్లా దిట్టకుడికి చెందిన రాఘవేల్(52)గా గుర్తించారు. పదిహేను మంది గాయపడ్డట్టు తేల్చారు. ఆ ఏడుగురు తొక్కిసలాటలో గాయపడి, ఊపిరి ఆడక మరణించినట్టు విచారణలో తేలింది. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా, తమ వాళ్లు మరణించిన సమాచారంతో ఆప్తులు, బంధువులు ఆలయం వద్దకు తరలి రావడంతో ఆ పరిసరాలు శోక సంద్రంలో మునిగాయి. ఆలయ నిర్వాహకుడు, పూజారి ధనపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అనుమతులు పొందకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించడమే కాదు, పెద్ద ఎత్తున కానుకలు, విరాళాల్ని నిర్వాహకుడు స్వీకరిస్తూ వచ్చినట్టు విచారణలో తేలింది. మృతులకు సీఎం సాయం..... తిరుచ్చి తురయూరు తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబానికి సీఎం పళనిస్వామి సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబా లకు సీఎం సహాయ నిధి నుంచి రూ.లక్ష చొప్పున ప్రకటించారు. అలాగే, గాయపడ్డ వారిలో 12 మందికి తలా రూ. 50 వేలు సాయం ప్రకటించారు. కేంద్రప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు ప్రకటించింది. -
మేం ఇస్లాంలోకి మారే పరిస్థితి రావొచ్చు!
కరూర్ (తమిళనాడు): వివక్షపై దళితులు పోరుబాట పట్టారు. దేవాలయ ఉత్సవంలో పాల్గొనేందుకు తమను అనుమతించకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు వాపస్ ఇచ్చేస్తామని హెచ్చరించాయి. ఆలయంలోకి ప్రవేశించకుండా తమపై వివక్ష కొనసాగిస్తే.. అందుకు నిరసనగా తాము ఇస్లాం మతంలోకి మారుతామని వారు హెచ్చరించారు. తమిళనాడులోని కరూర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. దళిత కుటుంబానికి చెందిన గీత మాట్లాడుతూ తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, తమపై ఇలాగే వివక్ష కొనసాగిస్తే.. తాము బలవంతంగా ఇస్లాం మతంలోకి మారే పరిస్థితి రావొచ్చునని చెప్పారు.