షారుక్ కు న్యూజిలాండ్ ప్రధాని ఘనస్వాగతం!
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు ఆదేశ ప్రధాని జాన్ కీ ఆక్లాండ్ నగరంలో ఘనంగా స్వాగతం పలికారు. 'టెంప్టేషన్ రీలోడెడ్' టూర్ లో భాగంగా షారుక్ ఖాన్ ఆక్లాండ్ కు చేరుకున్నారు. ప్రధాని జాన్ కీ ఘనంగా స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. నా జట్టు తరపున జాన్ కీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
ఆక్లాండ్ లో ఇవ్వనున్న ప్రదర్శన కోసం రిహార్సల్ జరుగుతోంది. ఈ ప్రదర్శన ద్వారా బోలెడంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించనున్నాం. హానీ సింగ్, మాధురీ, రాణీ, జాక్వలైన్ లు తమ ప్రదర్శనతో ఊర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నారు అని షారుక్ ట్వీట్ చేశారు.
'టెంప్టేషన్ రీలోడెడ్' టూర్ లో మాధూరి దీక్షిత్, రాణీ ముఖర్జీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యోయో సింగ్, మీయాంగ్ చాంగ్ లతో కలిసి షారుఖ్ ప్రదర్శనను ఇవ్వనున్నారు.