రేణిగుంట రైల్వే స్టేషన్లో డీఆర్ఎం తనిఖీలు
రేణిగుంట రైల్వే స్టేషన్లో డీఆర్ఎం తనిఖీలు
రేణిగుంట : గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ గోపీనాథ్ మాల్యా ఆదివారం రేణిగుంట రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. మొదటి ప్లాట్‌ఫాం చివరన ఉన్న పెండింగ్ పనులను పరిశీలించారు. అలాగే రైల్వే స్టేషన్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్టేషన్‌లోని ప్రయాణికుల వెయిటింగ్ హాళ్ల పరిస్థితి, ప్లాట్ ఫాంలపై సదుపాయాలను గమనించారు. ఈ తనిఖీల్లో పనుల సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సాంబమూర్తి, స్టేషన్ మేనేజర్ సుబోథ్ మిత్రా, ఏడీఎన్ శ్రీనివాస్, చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.