thatipudi reservoir
-
‘తాటిపూడి’లో లాహిరి.. లాహిరి!
సాక్షి, విశాఖపట్నం: విశాఖకు తాగునీటిని అందిస్తున్న తాటిపూడి జలాశయంలో స్పీడ్ బోట్లు షికారు చేయనున్నాయి. విశాఖ నుంచి అరకు వెళ్లే రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ రిజర్వాయరు పర్యాటకులను ఎంతగానో అలరిస్తోంది. ఆ జలాశయంలో పర్యాటకుల విహారానికి కొన్నేళ్లుగా స్థానికులు 20 సీట్ల సామర్థ్యం ఉన్న నాలుగు మోటారు బోట్లను నడుపుతున్నారు. వాటిని కొనుగోలు చేసి దాదాపు 15 ఏళ్లు దాటింది. అంతగా కండిషన్లో లేకపోయినప్పటికీ ఏదోలా వాటిని నడుపుతూ వచ్చారు. గత ఏడాది నవంబరులో కృష్ణా జిల్లా పవిత్ర సంగమంలో బోటు బోల్తా దుర్ఘటనలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో నదులు, జలాశయాల్లో కాలం చెల్లిన, కండిషన్ తప్పిన బోట్లను నిలుపుదల చేశారు. అందులోభాగంగానే తాటిపూడి రిజర్వాయరులో తిప్పుతున్న పాత బోట్లను కూడా ఆపేశారు. దాదాపు నాలుగు నెలలుగా అక్కడ బోటు షికారు జరగడం లేదు. అరకు వెళ్లే, అటు నుంచి వచ్చే పర్యాటకులు ఈ రిజర్వాయరుకు వెళ్లి బోటులో ఎంజాయ్ చేస్తుంటారు. వారాంతపు రోజుల్లో (శని, ఆదివారాల్లో) సగటున 500 నుంచి 600 మంది వరకు పర్యాటకులు తాటిపూడి జలాశయంలో విహారానికి వెళ్లేవారు. తాటిపూడిలో బోటు షికారు నిలిచిపోవడంతో అక్కడకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అక్కడ మూడు నాన్ ఏసీ, రెండు ఏసీ కాటేజీలు ఉన్నాయి. బోటు రైడింగ్ లేకపోవడంతో ఈ కాటేజీల్లో ఆక్యుపెన్సీ పడిపోయింది. ఫలితంగా పర్యాటకశాఖకు ఆదాయం క్షీణించింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్తగా స్పీడ్ బోట్లను కొనుగోలు చేసి బోటు రైడింగ్‌ను పునరుద్ధరించాలని పర్యాటకశాఖ అధికారులు నిర్ణయించారు. ఆరు సీట్ల సామర్థ్యం ఉన్న స్పీడ్ బోట్లు రెండు, 20 సీట్ల కెపాసిటీ గల ఒక బోటును కొనుగోలు చేయనున్నారు. ఆరు సీట్ల బోటు రూ.15 లక్షలు, 20 సీట్ల బోటుకు రూ.20 లక్షల చొప్పున వెచ్చించనున్నట్టు పర్యాటకశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. దాదాపు అరగంట సేపు లాహిరి లాహరికి ఒక్కొక్కరి నుంచి టిక్కెట్టు ధర రూ.50 వసూలు చేయనున్నారు. స్పీడ్ బోట్లు అందుబాటులోకి రావడానికి మరో మూడు నెలల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. మోటారు బోటుకంటే స్పీడ్ బోటులో రైడింగ్ పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మరో రూ.50 లక్షలతో పర్యాటక సదుపాయాలు కల్పించేందుకు పర్యాటకశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
విషాదాన్ని నింపిన తాడిపూడి రిజర్వాయర్ ఘటన
విజయనగరం : సాగునీటికి ప్రాణాదారమైన తాటిపూడి జలాశయం వద్ద నేటి ఉదయం చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. జలాశయంలో గల్లంతైన మహిళ కోసం వెతుకుతూ వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ ఏరులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సింహాచలంగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు గల్లంతైన మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. విజయనగరం జిల్లాలోని మూడు మండలాలకు సాగునీటితో పాటు, విశాఖపట్నానికి తాగునీరు అందించడానికి ప్రధాన ఆధారంగా ఈ తాడిపూడి జలాశయం ఉంది. ఈ జలాశయానికి మొత్తం నాలుగు ప్రధాన గేట్లుండగా.. వాటిలో మొదటి గేటు శనివారం ఉదయం విరిగిపోయింది. ఒక్కసారిగా పైనున్న నీళ్లన్నీ ఉధృతమైన ప్రవాహంతో కిందకు రావడంతో, కిందివైపు దుస్తులు ఉతుక్కుంటున్న ఇద్దరు మహిళలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయారు. వారిలో ఒకరు ఆచూకీ కొన్ని గంటల తర్వాత లభ్యమవడంతో, గల్లంతైన మహిళ కోసం వెతకడం ప్రారంభించారు. జామి గోస్థని నదిలో గాలిస్తూ వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ ఏరులో పడి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జలాశయ గేట్ల నిర్వహణ సరిగా లేదని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కసారిగా నీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలలో ఉన్నారు. వెంటనే అడ్డుకట్ట వేయకపోతే మొత్తం గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయని చెబుతున్నారు. -
విషాదాన్ని నింపిన రిజర్వాయర్ ఘటన
-
జలాశయం గేటు విరిగి.. ఇద్దరు మహిళల గల్లంతు
తాటిపూడి జలాశయం గేటు విరగడంతో అక్కడకు సమీపంలో దుస్తులు ఉతుక్కుంటున్న ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. విజయనగరం జిల్లాలోని మూడు మండలాలకు సాగునీటితో పాటు విశాఖపట్నం నగరానికి తాగునీరు అందించడానికి ప్రధాన ఆధారంగా ఉన్న తాటిపూడి జలాశయం గేట్ల నిర్వహణ సరిగా లేదని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. దానికి మొత్తం నాలుగు ప్రధాన గేట్లు ఉండగా, వాటిలో మొదటి గేటు శనివారం ఉదయం విరిగిపోయింది. దాంతో ఒక్కసారిగా పైనున్న నీళ్లన్నీ ఉధృతమైన ప్రవాహంతో కిందకు వచ్చేశాయి. కిందివైపు దుస్తులు ఉతుక్కుంటున్న ఇద్దరు మహిళలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ, శృంగవరపుకోట, జామి మండలాలకు ఈ జలాశయం నుంచే నీళ్లు వస్తాయి. అయితే ఒక్కసారిగా నీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలలో ఉన్నారు. వెంటనే అడ్డుకట్ట వేయకపోతే మొత్తం గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయని చెబుతున్నారు. -
జలాశయం గేటు విరిగి.. ఇద్దరు మహిళల గల్లంతు