theme parks
-
Visakhapatnam: 7 వండర్స్ ఇన్ వైజాగ్
ఏడు ప్రపంచ వింతలు.. వీటిని జీవితంలో ఒక్కసారైనా చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఒక్కో దిక్కున ఉన్న వీటిని చూసేందుకు చాలా సమయం పడుతుంది. రెక్కలు కట్టుకుని చుట్టుకు రావాలనే కోరిక ఆర్థిక స్తోమత లేక కాళ్లకు బంధాలు వేస్తుంది. ఈ వింతలన్నీ ఒకే చోట ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుందా? ఇది అసాధ్యమని మాత్రం అనుకోవద్దు. మన వైజాగ్‌లోనే ఉంటూ ఈ వింతలన్నింటినీ ఒకేసారి చూసి ఎంజాయ్ చేసే అవకాశం త్వరలోనే మీ ముందుకు రానుంది. ఏడు వింతలను ప్రతి సృష్టి చేసి.. సరికొత్త అనుభూతిని అందించేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం ఏడు వింతల పార్కే కాదు.. విభిన్న రకాల థీమ్ పార్కులకు శ్రీకారం చుడుతోంది. – సాక్షి, విశాఖపట్నం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న పుడమి తల్లికి పచ్చల హారాన్ని అలంకరించేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ సమాయత్తమవుతోంది. నగరవాసులకు ఒత్తిడి దూరం చేసి.. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలు మేరకు విశాఖ నగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే మియావాకీ తరహా చిట్టడవుల పెంపకాన్ని ప్రారంభించిన జీవీఎంసీ.. తాజాగా పంచతత్వ పార్కులు, థీమ్ పార్కులు, స్వింగ్ గార్డెన్స్, నక్షత్ర వనాలు.. ఇలా విభిన్న పార్కులను అన్ని జోన్లలోనూ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. 9.88 ఎకరాల్లో రూ.10.92 కోట్లతో తొలివిడతలో 11 పార్కులు ఏర్పాటు చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. తొలి విడతలో 9 థీమ్ పార్కులు... ►ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయాలని జీవీఎంసీ ఆలోచన చేసింది. ఇందుకోసం ఆయా జోన్లలో ఉన్న జీవీఎంసీకి చెందిన ఖాళీ స్థలాలను గుర్తించి.. సీఎం ఆలోచనల మేరకు ఆ స్థలాల్లో థీమ్ పార్కులను సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ►వివిధ దేశాల్లో ఉన్న ఏడు వింతలను ఎంచక్కా.. సిటీలోనే సరదాగా ఎంజాయ్ చేసేలా సెవన్ వండర్స్ పార్క్ రానుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారీ స్థాయిలో థీమ్ పార్కులు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ సంకల్పించింది. ఇందులో భాగంగా మినియేచర్స్‌తో సెవన్ వండర్స్ పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వండర్‌ను 22 నుంచి 30 అడుగుల ఎత్తు ఉండేలా ఆవిష్కరించనున్నారు. అన్ని వింతలూ రాత్రి పూట విద్యుత్ కాంతుల్లో ధగధగలాడేలా ఈ పార్కు రూపుదిద్దుకోనుంది. ►వర్షపు నీటిని ఎన్ని రకాలుగా భూమిలోకి ఇంకించవచ్చు అనే అంశం వివరిస్తూ.. రెయిన్ వాటర్ హార్వెస్ట్ పార్కు రానుంది. ప్రజలకు నీటి విలువను తెలియజెప్పడం, భూగర్భ జలాలు పెంపొందించుకోవడంపై అవగాహనతో పాటు పిల్లలు ఆడుకునేలా పచ్చదనంతో ఈ పార్కు కళకళలాడనుంది. ►పార్కులో బెంచ్‌లు కాకుండా వివిధ రకాల ఫ్రూట్ షేప్‌లు ఏర్పాటు చేసి వాటిపై సేదతీరేలా ఫ్రూట్ థండర్ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, డాగ్ పార్కు, లేక్ పార్కు... ఇలా విభిన్న థీమ్ పార్కులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార మొదలైన ప్రాంతాల్లో ఉన్న పెద్ద పార్కుల్లో కొన్నింటిని, మిగిలిన పార్కుల కోసం ఇప్పటికే గుర్తించిన ఖాళీ స్థలాలను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యాన్ని పంచే పంచతత్వ వాక్‌వేలు ►ఉరుకుల పరుగుల జీవితంలో అలిసిపోతున్న నగరవాసుల ఒత్తిడి దూరం చేసేలా నగరంలో ఆస్ట్రో గార్డెన్తో కూడిన పంచతత్వ వాక్‌వేలను ఏర్పాటు చేయనుంది. ప్రజలకు స్వచ్ఛమైన గాలినిచ్చేలా ఈ పంచతత్వ పార్కులు వేదికగా మారనున్నాయి. ఆరోగ్యకరమైన గాలికి చిరునామాగా.. మందులు లేకుండానే రక్తపోటు, కీళ్ల నొప్పులు మొదలైన వ్యాధులను దూరం చేసే ఆస్పత్రుల్లా... ఒత్తిడి మటుమాయం చేసే ధ్యాన కేంద్రంలా ఆస్ట్రో గార్డెన్తో కూడిన పంచతత్వ వాక్‌వే పార్కులు ఉపయోగపడనున్నాయి. ఈ తరహా పార్కులను జీవీఎంసీ పరిధిలో మొత్తం 6 ఏర్పాటు చేయనున్నారు. నక్షత్ర, రాశివనాల కలయికతో ఆస్ట్రోగార్డెన్స్‌తో పాటు పంచతత్వ వాక్‌వేలు ఈ పార్కుల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ►ప్రతి మనిషికి జన్మించిన ఘడియలను బట్టి ఓ జన్మ నక్షత్రం ఉంటుంది. 27 నక్షత్రాలకు అనుసంధానమైన 27 రకాల మొక్కలను ఓ చోట చేర్చితే నక్షత్రవనంగా మారుతుంది. అదేవిధంగా రాశులకు అనుగుణంగా 12 రకాల చెట్లను పెంచనున్నారు. ►పంచతత్వ వాక్‌వే పార్కు ఎనిమిది భాగాలుగా ఉంటుంది. తూర్పు, ఉత్తర భాగాలు నీటితో నిండి ఉంటాయి. మిగిలిన భాగాల్లో నల్లమట్టి, ఇసుక, 6ఎంఎం మెటల్ చిప్స్, సాగర్‌రాయి, 12ఎంఎం చిప్స్, 20 ఎంఎం గుండ్రని చిప్స్‌తో నింపుతారు. ►రెండో వరసలో చక్కెర మొక్క, సదాపాకు, నిమ్మగడ్డి, తమలపాకు, దవనం, తులసి, కలబంద, సరస్వతి, రణపాల మొదలైన మూలిక, వైద్య మొక్కలు ఏర్పాటు చేస్తారు. ►మూడో వరసలో ఆక్యుపంక్చర్ అంటే సిమెంట్, కాంక్రీట్‌తో కూడిన 6 ఎంఎం మెటల్ చిప్స్‌తో ఉంటాయి. ►నాలుగో వరసలో పునాది రాయితో కూడిన గడ్డి ఉంటుంది. ►ఐదో వరసలో ఎనిమిది బాక్స్‌ల్లో మూలిక, ఔషధ మొక్కలుంటాయి. ►ఆరో వరసలో నక్షత్రవనం, రాశివనాలుంటాయి. ►ప్రతి జోన్లో ఒక పార్కు ఉండేలా జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మధురవాడ క్రికెట్ స్టేడియం ఎదురుగా, హెచ్‌బీ కాలనీలోని ఆదర్శనగర్ పార్కులో, బుచ్చిరాజుపాలెం, షిప్‌యార్డు కాలనీ, అగనంపూడిలోని జనచైతన్య లే అవుట్, కూర్మన్నపాలెంలోని రాజీవ్‌నగర్‌తో పాటు భీమిలి, అనకాపల్లిలో మొత్తం 8 పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ►పంచతత్వ వాక్‌వేతో నిద్రలేమి సమస్య తీర్చుట, కంటి చూపు, నరాల బలహీనత మెరుగుపడుతుంది. రుతు సమస్య, హోర్మన్ల సమస్య తీరుతుంది. హృదయనాళ కార్యకలాపాలను మెరుగుపరచడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. పంచతత్వ పార్కులో నడవడం వల్ల ఆక్యుపంక్చర్ వైద్యంగా ఉపయోగపడుతుంది. వినూత్న కాన్సెప్ట్‌లు సిద్ధం విశాఖ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జీవీఎంసీ వినూత్న కాన్సెప్ట్‌లను సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో వందలాది ఖాళీ స్థలాలను గుర్తించాం. వాటిని వివిధ రకాల పార్కుల కోసం వినియోగించాలని నిర్ణయించాం. ఏపీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ సహకారంతో 5 శాతం ఎస్టిమేట్ కాస్ట్‌తో ఫీజ్ తీసుకునే ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ డ్రాయింగ్ మొత్తం వారి ద్వారా జరిగేలా నిబంధనలు పాటిస్తున్నాం. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా థీమ్‌తో పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి పూర్తయితే నగర వాసులకు పంచతత్వ పార్కులు పంచప్రాణాలుగా నిలుస్తాయి. ఆక్యుపంచర్ వైద్యం అందించే వైద్యశాలలుగా పార్కులు మారనున్నాయి. మొత్తంగా విశాఖనగరాన్ని సిటీ ఆఫ్ పార్క్స్‌గా తీర్చిదిద్దుతాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
తకదిం'థీమ్'
సిటీలో పార్కులు ఇక కొత్తరూపు సంతరించుకోనున్నాయి.ప్రతి పార్కుకూ ఓ థీమ్ ఉండేలా తీర్చిదిద్దనున్నారు. ఈ థీమ్‌లు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఉంటాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ రూ.120 కోట్లు వ్యయం చేయనున్నది. ఈ మేరకుగ్రేటర్ వ్యాప్తంగా 47 పార్కుల్ని తీర్చిదిద్దాలని అధికారులునిర్ణయించారు. ఇవీ థీమ్స్.. స్వచ్ఛత, ఘనవ్యర్థాల నిర్వహణ, ట్రాఫిక్, ఇంకుడుగుంతలు, చిల్డ్రన్స్, తెలంగాణ కల్చర్, వేస్ట్ టు వండర్స్ ఆఫ్ తెలంగాణ, పేట్రియాటిక్, యూనివర్సల్, టన్నెల్గార్డెన్, నాలెడ్జ్ ఆన్ సైన్స్, రెయిన్‌ఫారెస్ట్, వాటర్, అడ్వెంచర్, ఎనర్జీ కన్జర్వేషన్, ఉమెన్, సీనియర్ సిటిజెన్, పార్క్ ఆఫ్ సెన్సెస్, కాళేశ్వరం తదితర థీమ్స్‌ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. సాక్షి,సిటీబ్యూరో: కోటి మందికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకంగా చిల్డ్రన్స్ పార్కు లేదు. అలాంటి ఒక పార్కు త్వరలో ఏర్పాటు కానుంది. అందులో కేవలం పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. పిల్లలుంటేనే వారి వెంట పెద్దలకు ప్రవేశం ఉంటుంది. పిల్లల్లేకుండా కేవలం పెద్దలే వస్తే ప్రవేశం ఉండదు. ఈ చిల్డ్రన్స్ పార్కులో 3–14 ఏళ్ల మధ్య వయసు పిల్లల కోసం ఆయా ఆకర్షణలు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. డ్రాయింగ్, సంగీతం,డ్యాన్స్ వంటివి నేర్చుకోవాలనుకునేవారికి తర్ఫీదునిచ్చే ఏర్పాట్లుంటాయి. వివిధ రకాల పుస్తకాలు తదితరమైనవి ఉంటాయి. పూర్తిగా పిల్లల కోసమే వారిని ఆకర్షించేలా తీర్చిదిద్దుతారు. ♦ మరో పార్కు మహిళలకే ప్రత్యేకం. ఇందులో మహిళల స్వీయ రక్షణకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి. మహిళలకు సంబంధించిన వస్తువుల దుకాణాలు, బ్యూటీపార్లర్, కిట్టీ పార్టీలకు క్లబ్ ఏరియా.. ఇలా అన్నీ మహిళలకు సంబంధించిన అంశాలు, సదుపాయాలుండే లేడీస్ పార్క్. ♦ సీనియర్ సిటిజెన్లకు అవసరమైన శారీరక వ్యాయామాలు, ఇబ్బందుల్లేకుండా సాఫీగా నడిచేందుకు ఎగుడుదిగుడుల్లేని నడకమార్గాలు, వృద్ధాప్యంలో ఆడుకునే ఆటలు..తదితర సదుపాయాలతో సీనియర్ సిటిజెన్స్ పార్క్. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు మోడల్‌తో మరో పార్కు. ఎన్ని జలాశయాలు, ఎన్ని మోటార్లు.. ఎత్తిపోతలు ఎక్కడినుంచి మొదలై నీరు ఎక్కడకు చేరుతుంది. తదితరమైనవి కళ్లకు కట్టేలా ఇరిగేషన్ పార్కు. ♦ చెత్త అంటే వ్యర్థమే కాదు.. దాంతో ఎన్నో అర్థాలున్నాయి. దాన్నెలా వినియోగించుకుంటే ఏయే ప్రయోజనాలుంటాయి తదితరమైనవి అర్థమయ్యేలా స్వచ్ఛ అంశాలకు సంబంధించి 12 రకాల పార్కులు. ♦ ఇలా వివిధ రకరకాల థీమ్‌లతో పార్కుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. దాదాపు 25 థీమ్‌లతో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఎకరానికి పైగా విస్తీర్ణమున్న ఖాలీ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు ఇలాంటి 47ప్రదేశాలను గుర్తించారు. వీటిల్లో ఈ థీమ్‌లతో పార్కుల ఏర్పాటుకు దాదాపు రూ. 120 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. అర్బన్ లివింగ్ థీమ్ పార్కులుగా వ్యవహరించే వీటి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. స్వచ్ఛత పార్కుల్లో.. స్వచ్ఛత (స్వచ్ఛ హైదరాబాద్) థీమ్‌తో ఏర్పాటయ్యే పార్కుల్లో ఒక దాంట్లో వ్యర్థాల రీసైక్లింగ్‌తో చేసిన ఉత్పత్తులుంటాయి. మరోదాంట్లో పాత టైర్లతో అందంగా రూపొందించిన కుర్చీలు తదితరమైనవి ఉంటాయి. ఇంకో పార్కులో అచ్చంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్‌చేసి తయారు చేసిన బెంచీలు, డస్ట్బిన్లు, ఫెన్సింగ్ తదితరమైనవి ఉంటాయి. ఒక పార్కులో వ్యర్థాలను ఎన్ని రకాలుగా( పేపర్, గ్లాస్, ప్లాస్టిక్, ఆర్గానిక్, మెటల్‌గా) వర్గీకరించవచ్చో తెలుస్తుంది. మరో దాంట్లో వ్యర్థాలతోనే ప్రముఖ కట్టడాలను నిర్మిస్తారు. దీన్ని వేస్ట్ టు వండర్ పార్క్ అంటారు. ఇందులో గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, వరంగల్ ఫోర్ట్, ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్ వంటివి ఉంటాయి. మరోదాంట్లో చెత్తనుంచి విద్యుత్ ఎలా వస్తుందో తెలిసేలా ఉంటుంది. పొడిచెత్తలో ఎన్ని రకాలుంటాయో ఇంకోపార్కు వివరిస్తుంది. అంతేకాకుండా చెత్తను ఎలా వేరుచేయాలో , ఎలా రీయూజ్ చేయవచ్చో కూడా పిల్లలకు తెలియజేసే వారుంటారు. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ కాన్సెప్ట్‌తో‘ 3ఆర్ కాన్సెప్ట్’ పేరిట మరో పార్కు. వ్యర్థాలను ఎలా రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ చేయవచ్చో పిల్లలకు అర్థమయ్యేలా ప్రదర్శనలుంటాయి. ఇలా స్వచ్ఛ అంశాలకు సంబంధించే 12 థీమ్‌లతో పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ప్రజలకు సందేశమిచ్చేలా ఉంటాయి. -
ఇక కర్ణాటక.. పర్యాటక హబ్
- నూతనంగా 11 థీమ్ పార్క్‌లు - మొత్తం వ్యయం రూ.708 కోట్లు - ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటుకు సన్నాహాలు - ఏడాది పొడవునా పర్యాటకుల ఆకర్షణే లక్ష్యం - పెలైట్ ప్రతిపాదికన స్నో, డిస్నీల్యాండ్, కేబుల్‌కార్ పార్కుల ఏర్పాటు సాక్షి, బెంగళూరు: కర్ణాటకను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం 11 థీమ్ పా ర్కులను రాష్ట్రం నలుమూలలా ప్రారంభించనుంది. అవసరమైన నిధుల కోసం ప్రైవేటు సంస్థల సహకారం కూడా తీసుకోనుంది. టెం పుల్ టూరిజానికి కర్ణాటక పెట్టింది పేరు. దేశ విదేశాల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో ఉన్న దేవాలయాలు, అందులోని శిల్పా లు తిలకించడానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో రాష్ట్రానికి వచ్చే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మిగిలిన నెలల్లో కర్ణాటక ప్రభుత్వానికి పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం తక్కువగానే ఉం టుంది. దీనినిదృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో వి విధ ప్రాంతాల్లో 12 నెలల పాటూ పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా 11 థీమ్ పార్కులను ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా పెలైట్ ప్రతిపాదికన స్నో పార్క్, డిస్నీల్యాండ్ మా దిరి పార్క్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల వ్యయం దాదాపు రూ.193 కోట్లుగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్దతిలో పర్యాటక శాఖ సమకూర్చుకోనుంది. అదేవిధంగా మం చి కొండలు, గుట్టలు కలిగిన కర్ణాటకలో కేబుల్ కార్ టూరిజాన్ని అభివృద్ధి చే యడానికి వీలుగా చాముండిహిల్స్, నందిహిల్స్, కెమ్మనగుడి, మధుగిరిల్లో కేబుల్ కార్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కు కోసం పీపీపీ విధానంలో రూ.80 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మూడింటితో సహా మొత్తం 11 థీమ్ పార్కుల ఏర్పాటుకు రూ.708 కోట్లు ఖర్చుకాగలవని పర్యాటక శాఖ అంచనా వేసింది. పర్యాటక శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమవనున్నాయని పర్యాటకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
రూ.5 వేల కోట్లతో ‘డిస్కవరీ సిటీ’
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల తర్వాత హైదరాబాద్ పట్టణం ఎలా ఉండబోతుందో ముందుగానే ఊహించాం. అప్పటి పరిస్థితులు, అవసరాలను తీర్చే ప్రాజెక్ట్‌ను నిర్మించాలనుకున్నాం. అందుకే ఒకే ప్రాజెక్ట్‌లో నివాస, వాణిజ్య సముదాయాలే కాకుండా కేజీ నుంచి పీజీ స్థాయి వరకు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, ఐటీ, ఫార్మా వంటి అనేక రంగాల కార్యాలయాలు, ఇండోర్, అవుట్ డోర్ ఆట స్థలాలు, థీమ్ పార్క్ వంటివెన్నో కొలువుదీరే సరికొత్త సిటీని నిర్మించనున్నాం. దక్షిణ భారతదేశంలోనే తొలి స్మార్ట్ సిటీ అవార్డ్‌ను సొంతం చేసుకున్న డిస్కవరీ సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ వివరాలను రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ లిమిటెడ్ జీఎం (సేల్స్, మార్కెటింగ్) కేవీ రాజ్‌నారాయన్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 10 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉన్న మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ అనే గ్రామంలో 600 ఎకరాల్లో డిస్కవరీ సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నాం. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న డిస్కవరీ సిటీ ప్రాజెక్ట్‌ను 4 ఫేజుల్లో పదేళ్ల లోపు పూర్తి చేస్తాం. ఫేజ్-1లో రూ. 300 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల్లో ‘గార్డెనియా గ్రూవ్ విల్లా’ను నిర్మిస్తున్నాం. ఇందులో విల్లాలు, ఫ్లాట్లలతో పాటు పాఠశాల కూడా ఉంటుంది. ఇప్పటికే 5 ఎకరాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పాఠశాల నడుస్తోంది. గార్డెనియా గ్రూవ్లో మొత్తం 228 విల్లాలొస్తాయి. 200 గజాల నుంచి 300 గజాల విస్తీర్ణాల్లో ఉంటాయి. ధర రూ.57 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 2, 3 పడక గదుల ఫ్లాట్లు 400 నిర్మిస్తున్నాం. వీటి విస్తీర్ణం 730 చ.అ. నుంచి 1,800 చ.అ. మధ్య ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 150 వరకు నిర్మిస్తున్నాం. వీటి విస్తీర్ణం 350 చ.అ. నుంచి 550 చ.అ. మధ్య ఉంటుంది. ఇప్పటికే 32 విల్లాలు, 60 ఫ్లాట్లు విక్రయించేశాం. పుణెలోని మగర్‌పట్టా, అహ్మదాబాద్‌లోని శాంతిగ్రామ్, చెన్నై, జైపూర్‌లలోని మహీంద్రా వరల్డ్ సిటీలతో పాటు దుబాయ్, కౌలాలంపూర్ వంటి విదేశాల్లోని స్మార్ట్ సిటీలను రెండేళ్ల పాటు క్షేత్ర స్థాయిలో క్షుణ్నంగా పరిశీలించాకే హైదరాబాద్‌లోనూ అలాంటి స్మార్ట్ సిటీని నిర్మించేందుకు ముందుకొచ్చాం. విమానాశ్రయం చుట్టూ కనీసం 25 కి.మీ. వరకు అభివృద్ధి అనేది ఎల్లవేళలా ఉంటుంది. అందుకే శ్రీనగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. ప్రాజెక్ట్ వెనుక భాగంలో 3 వేల ఎకరాల్లో కొంగరకలాన్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండటం కలిసొచ్చే అంశం. ఎందుకంటే చుట్టూ చక్కని ప్రకృతి, పుష్కలమైన నీటి వనరులు ప్రాజెక్ట్ సొంతం. డిస్కవరీ సిటీ ప్రాజెక్ట్‌లో ఎకరం, అర ఎకరం విస్తీర్ణంలో కూడా విల్లాలను నిర్మిస్తున్నాం. అయితే ఇవి ఫేజ్-4లో వస్తాయి.