తిమ్మమ్మ కథ
అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. భవ్యశ్రీ ప్రధాన పాత్రలో బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెదరాసు సుబ్రమణ్యం నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ‘‘మర్రి మాను చరిత్రను ప్రేక్షకులకు చూపించాలనే సంకల్పంతో ఈ చిత్రం తీశాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్.రామ్‌కుమార్.