Thrashes Wife
-
ఫ్యాషన్ బ్యాంగిల్స్ ధరించిందని భార్యను బెల్టుతో చితకబాది..
ముంబయి: నవీ ముంబయిలో అమానవీయ ఘటన జరిగింది. ఫ్యాషన్ బ్యాంగిల్స్ ధరించినందుకు భార్యను చితకబాదాడో వ్యక్తి. అత్త, మరో బంధువు కూడా ఇందులో పాలుపంచుకున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భర్తతో పాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. నవీ ముంబయిలో నివాసం ఉంటున్న ప్రదీప్ అర్కడే(30) భార్య, అతని అమ్మతో కలిసి నివసిస్తున్నాడు. ఫ్యాషన్ బ్యాంగిల్స్ వేసుకోకూడదని భార్యపై ఆంక్షలు విధించేవాడు. ఈ క్రమంలో నవంబర్ 13న ఆమె ఆ బ్యాంగిల్స్‌ను ధరించింది. దీనిపై ఇరువురు వాగ్వాదానికి దిగారు. అనంతరం ప్రదీప్ తన భార్యను విచక్షణా రహితంగా కొట్టాడు. భర్త తనను బెల్ట్‌తో విచక్షణా రహితంగా కొట్టాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. అత్త తన జుట్టు పట్టి పలుమార్లు చెంపపై కొట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. మరో బంధువు కూడా తనను కిందపడేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తర్వాత బాధితురాలు తన తండ్రి ఉంటున్న పుణెకి వెళ్లింది. అక్కడే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నవీ ముంబయికి బదిలీ చేశారు. ఇదీ చదవండి: హర్యానా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ చట్టాన్ని కొట్టేసిన హైకోర్టు -
హైకోర్టు లాయర్‌ను పట్టించిన కూతురు
-
హైకోర్టు లాయర్‌ను పట్టించిన కూతురు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయవాది తన భార్యను, కుమార్తెను దూషిస్తూ, హింసించిన దృశ్యాలతో కూడిన వీడియో పోలీసులకు అందింది. న్యాయవాది మరో కుమార్తె ఈ వీడియోను చిత్రీకరించి పోలీసులకు పంపడం గమనార్హం. న్యాయవాది భార్య చెప్పిన వివరాల మేరకు వారి కుటుంబం దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉంటోంది. తమకు వివాహమై 15 ఏళ్లయిందని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పింది. వాళ్లు ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రతి రోజు భర్త తనను కొడతాడని, పిల్లలపై కూడా చేయి చేసుకుంటాడని తెలిపింది. మగ పిల్లాడిని కనలేదనే కోపంతో ఆయన తమను హింసిస్తున్నాడని చెప్పింది. తండ్రి పెట్టే బాధలు భరించలేక ఓ అమ్మాయి వీడియో తీసి పోలీసులకు పంపింది. ఒక్క నిమిషం నిడివి గల ఈ వీడియోలో.. న్యాయవాది తన భార్య, కూతురును దూషిస్తూ, వారిని తోసివేసినట్టుగా ఉంది. కూతురిపై చేయి చేసుకోగా, ఆ అమ్మాయి నేలపై పడిపోయింది. కాగా న్యాయవాది పేరు ఏంటన్నది తెలియరాలేదు.