హైకోర్టు లాయర్‌ను పట్టించిన కూతురు | Delhi High Court Lawyer Thrashes Wife, Daughter; Video Sent To Cops | Sakshi
Sakshi News home page

హైకోర్టు లాయర్‌ను పట్టించిన కూతురు

Published Thu, Dec 15 2016 10:29 AM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

హైకోర్టు లాయర్‌ను పట్టించిన కూతురు

హైకోర్టు లాయర్‌ను పట్టించిన కూతురు

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయవాది తన భార్యను, కుమార్తెను దూషిస్తూ, హింసించిన దృశ్యాలతో కూడిన వీడియో పోలీసులకు అందింది. న్యాయవాది మరో కుమార్తె ఈ వీడియోను చిత్రీకరించి పోలీసులకు పంపడం గమనార్హం.

న్యాయవాది భార్య చెప్పిన వివరాల మేరకు వారి కుటుంబం దక్షిణ ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో ఉంటోంది. తమకు వివాహమై 15 ఏళ్లయిందని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పింది. వాళ్లు ఓ ప్రైవేట్‌ స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రతి రోజు భర్త తనను కొడతాడని, పిల్లలపై కూడా చేయి చేసుకుంటాడని తెలిపింది. మగ పిల్లాడిని కనలేదనే కోపంతో ఆయన తమను హింసిస్తున్నాడని చెప్పింది. తండ్రి పెట్టే బాధలు భరించలేక ఓ అమ్మాయి వీడియో తీసి పోలీసులకు పంపింది. ఒక్క నిమిషం నిడివి గల ఈ వీడియోలో.. న్యాయవాది తన భార్య, కూతురును దూషిస్తూ, వారిని తోసివేసినట్టుగా ఉంది. కూతురిపై చేయి చేసుకోగా, ఆ అమ్మాయి నేలపై పడిపోయింది. కాగా న్యాయవాది పేరు ఏంటన్నది తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement