Delhi High Court Lawyer
-
సర్ కాదు.. అందులో నుంచి బయటకు రండి!
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో మహిళా న్యాయమూర్తి, న్యాయవాది మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టులో ఓ కేసుకు సంబంధించిన వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మహిళా న్యాయమూర్తి రేఖాపల్లిని ఉద్దేశిస్తూ ఓ అడ్వకేట్.. ‘సర్’ అని సంబోధించాడు. దీంతో వెంటనే స్పందించిన న్యాయమూర్తి రేఖాపల్లి.. తాను ‘సర్’ కాదని, ఆ భావన నుంచి బయటకు రావాలని చాకచక్యంగా సమాధానం ఇచ్చారు. జడ్జి మాటలకు స్పందించిన సదరు అడ్వొకేట్.. క్షమాపణ కోరుతూనే ఆ స్థానంలో ఎక్కువగా మగవారే కూర్చుంటారు కదా. ఆ ఉద్దేశంతోనే ఏమరపాటుతో అలా అనేశానని వివరణ ఇచ్చాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. An advocate keeps addressing Justice Rekha Palli of Delhi HC as "Sir". "I am not Sir. I hope you can make that out" - Justice Palli to lawyer. Lawyer - "Sorry, it's because of the Chair you are sitting in" pic.twitter.com/R8Gthtum9j — Live Law (@LiveLawIndia) February 16, 2022 -
హైకోర్టు లాయర్‌ను పట్టించిన కూతురు
-
హైకోర్టు లాయర్‌ను పట్టించిన కూతురు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయవాది తన భార్యను, కుమార్తెను దూషిస్తూ, హింసించిన దృశ్యాలతో కూడిన వీడియో పోలీసులకు అందింది. న్యాయవాది మరో కుమార్తె ఈ వీడియోను చిత్రీకరించి పోలీసులకు పంపడం గమనార్హం. న్యాయవాది భార్య చెప్పిన వివరాల మేరకు వారి కుటుంబం దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉంటోంది. తమకు వివాహమై 15 ఏళ్లయిందని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పింది. వాళ్లు ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రతి రోజు భర్త తనను కొడతాడని, పిల్లలపై కూడా చేయి చేసుకుంటాడని తెలిపింది. మగ పిల్లాడిని కనలేదనే కోపంతో ఆయన తమను హింసిస్తున్నాడని చెప్పింది. తండ్రి పెట్టే బాధలు భరించలేక ఓ అమ్మాయి వీడియో తీసి పోలీసులకు పంపింది. ఒక్క నిమిషం నిడివి గల ఈ వీడియోలో.. న్యాయవాది తన భార్య, కూతురును దూషిస్తూ, వారిని తోసివేసినట్టుగా ఉంది. కూతురిపై చేయి చేసుకోగా, ఆ అమ్మాయి నేలపై పడిపోయింది. కాగా న్యాయవాది పేరు ఏంటన్నది తెలియరాలేదు.