three decades
-
ముప్పై ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు
ముంబై: ముప్పై ఏళ్ల క్రితం నాటి ముంబయి అల్లర్ల కేసులో పరారీలో ఉన్న ఓ నిందితుడు ఇప్పుడు మళ్లీ చిక్కాడు. అతడు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. 1993లో ముంబయిలో అలర్లు చెలరేగాయి. అల్లర్ల సమయంలో చట్టవిరుద్ధంగా మనుషులను పోగు చేసిన కేసుతోపాటు ఓ హత్యలో సయ్యద్ నాదిర్ షా అబ్బాస్ ఖాన్ (65) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైనప్పటి నుంచి కనిపించకుండా పోయి పరారీలో ఉన్నాడు. దీంతో కోర్టు అతడిని చట్టపరంగా పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెంట్రల్ ముంబయి సేవ్రీలోని నిందితుడి ఇంటికి పోలీసులు అనేకసార్లు వెళ్లినా అతడు ఎక్కడున్నాడో కనుక్కోలేకపోయారు. చివరకు బంధువుల ఫోన్ల రికార్డులను పరిశీలించగా ఆచూకీ లభ్యమైంది. జూన్ 29న అతడు తన ఇంటికి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. 1993 కేసులో నిందితుడిని తాజాగా మళ్లీ అరెస్టు చేశామని, కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందనియ పోలీసులు తెలిపారు -
కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్
Ajay Devgn Special Post On Kajol Completes 30 Years In Bollywood: కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. ఎన్నో చిత్రాల్లో గ్లామర్‌తోపాటు అభినయంతో విశేష అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టి మూడు దశాబ్ధాలు (30 ఏళ్లు) పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త, నటుడు, స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అజయ్ దేవగణ్-కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమాలోని ఓ పిక్‌ను షేర్ చేస్తూ 'ఈ 3 దశబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశావు. ఎన్నో మైలురాళ్లు దాటావు. ఈ ముప్పై ఏళ్ల సినీ కెరీర్లో జ్ఞాపకాలు నిక్షిప్తమయ్యాయి. కానీ, నిజానికి.. నువ్ ఇప్పుడే అసలైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నావు' అంటూ రాసుకొచ్చాడు అజయ్ దేవగణ్. అలాగే తన సినీ కెరీర్‌కు ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక స్పెషల్ గ్లింప్స్‌ను షేర్ చేసింది కాజోల్. చదవండి: షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) కాగా 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. 1999లో అజయ్ దేవగణ్‌ను వివాహం చేసుకోగా, వారిద్దరికి నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్, కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
'నింగి, నేల ఉన్నంత వరకు నవ్విస్తూనే ఉంటా'
మూడు దశాబ్దాల సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని.. అవన్నీ తన హృదయ ఫలకంపై తీపి గుర్తులుగా మిగిలిపోయాయని ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మనందం వెల్లడించారు. నింగి, నేల ఉన్నంత వరకు ప్రేక్షకులకు వినోదం పంచుతునే ఉంటానని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి మూడు దశాబ్దలు పూరైన సందర్భంగా చెన్నైలో బ్రహ్మనందం విలేకర్లతో మాట్లాడారు. తాను చిత్ర పరిశ్రమకు రెండేళ్ల ముందే వచ్చిన 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'చంటబ్బాయి' చిత్రం తనకు బ్రేక్ ఇచ్చిందని... నాటి జ్ఞాపకాల దొంతరలో నిక్షిప్తమైన స్మృతులను ఆయన ఈ సందర్భంగా నెమరేసుకున్నారు. వెయ్యికి పైగా చిత్రాలలో నటించినట్లు చెప్పారు. తాను ఈ రోజు ఇంత విజయం సాధించానంటే చిత్ర దర్శకులు,నిర్మాతలే ప్రధాన కారణమన్నారు. షూటింగ్ సమయంలో లైట్ బాయ్స్ నుంచి మేకప్ ఆర్టిస్ట్‌ల వరకు వారితో ఉన్న అనుబంధాన్ని బ్రహ్మనందం ఈ సందర్భంగా విశదీకరించారు. అటు తెలుగు ఇటు తమిళ చిత్ర రంగంలో సినిమాలలో నటిస్తు 58 ఏళ్ల బ్రహ్మనందం మహా బిజీగా ఉన్నారు.