రోడ్లో ఏం జరిగింది?
యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు, ఎంటర్టైన్మెంట్ - వీటన్నిటి కలగలుపుగా ‘అరకు రోడ్లో’. రామ్ శంకర్, నికీషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శ కత్వంలో మేకా బాల సుబ్రమణ్యం, సురేశ్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు పూరీ జగ న్నాథ్ తనయుడు ఆకాష్ పూరి విడుదల చేశారు. హీరో రామ్ శంకర్ మాట్లాడుతూ- ‘‘ఇదొక యాక్షన్- థ్రిల్లర్. రెండో షెడ్యూల్ జరుపు తున్నాం’’ అన్నారు. ‘‘మంచి వినోదం ఉన్న ఈ చిత్రానికి వైజాగ్, పాడేరుల్లో షూటింగ్ జరిపాం’’ అని దర్శకుడు పేర్కొన్నారు. కోవై సరళ, కెమేరా మన్ జగదీశ్ చీకటి తదితరులు పాల్గొన్నారు.