ticket rates increase
-
మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన
-
RRR Movie: మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన
సాక్షి, అమరావతి: రెమ్యూనేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారని.. పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని వెల్లడించారు. మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తెలిపారు. ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆన్లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ -
కేసీఆర్‌గారూ.. టాక్స్‌నూ తీసేయండి!
‘‘సినిమా టిక్కెట్ల రేట్లను పెంచుతూ విడుదల చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ సీయం కేసీఆర్‌గారు తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఆయనకు ధన్యవాదాలు’’ అని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. థియేటర్ల లీజుదారులు కొందరు హోమ్ సెక్రటరీని మేనేజ్ చేసి టికెట్ల రేట్లు పెంపు జీవోను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఇంకా ఆర్కే గౌడ్ మాట్లాడుతూ – ‘‘చిత్ర పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ విధించడం వల్ల చిన్న నిర్మాతలు తమ సినిమాను విడుదల చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల, జీఎస్టీని 10 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ఈ రోజు (సోమవారం) నుంచి నిరాహారదీక్ష చేస్తాం. కేసీఆర్‌గారికి మా విజ్ఞప్తి ఏంటంటే... కేరళ ప్రభుత్వం చిత్ర పరిశ్రమపై ట్యాక్స్‌ను పూర్తిగా విరమించుకుంది. బెంగాల్ ప్రభుత్వం జీఎస్టీలో 12 శాతాన్ని తగ్గించింది. ఆ విధంగా తెలంగాణలో చిన్న సినిమాలపై ఉన్న 7 శాతం ట్యాక్స్‌ను పూర్తిగా తీసివేయాలని కేసీఆర్‌గారిని కోరుతున్నాం’’ అన్నారు.