కేసీఆర్‌గారూ.. టాక్స్‌నూ తీసేయండి! | We want KCR to remove 7% of the taxes on the films | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌గారూ.. టాక్స్‌నూ తీసేయండి!

Published Mon, Jul 3 2017 12:01 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

కేసీఆర్‌గారూ.. టాక్స్‌నూ తీసేయండి! - Sakshi

కేసీఆర్‌గారూ.. టాక్స్‌నూ తీసేయండి!

‘‘సినిమా టిక్కెట్ల రేట్లను పెంచుతూ విడుదల చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ సీయం కేసీఆర్‌గారు తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఆయనకు ధన్యవాదాలు’’ అని తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ అన్నారు. థియేటర్ల లీజుదారులు కొందరు హోమ్‌ సెక్రటరీని మేనేజ్‌ చేసి టికెట్ల రేట్లు పెంపు జీవోను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.

ఇంకా ఆర్కే గౌడ్‌ మాట్లాడుతూ – ‘‘చిత్ర పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ విధించడం వల్ల చిన్న నిర్మాతలు తమ సినిమాను విడుదల చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల, జీఎస్టీని 10 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. లేనిపక్షంలో ఈ రోజు (సోమవారం) నుంచి నిరాహారదీక్ష చేస్తాం. కేసీఆర్‌గారికి మా విజ్ఞప్తి ఏంటంటే... కేరళ ప్రభుత్వం చిత్ర పరిశ్రమపై ట్యాక్స్‌ను పూర్తిగా విరమించుకుంది. బెంగాల్‌ ప్రభుత్వం జీఎస్టీలో 12 శాతాన్ని తగ్గించింది. ఆ విధంగా తెలంగాణలో చిన్న సినిమాలపై ఉన్న 7 శాతం ట్యాక్స్‌ను పూర్తిగా తీసివేయాలని కేసీఆర్‌గారిని కోరుతున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement