మహిళా సాధికారతకు టై గ్లోబల్ ప్రోత్సాహం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న నగరాల్లోని మహిళలను వ్యాపార రంగం వైపు ప్రోత్సహించేం దుకు టై గ్లోబల్ దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యునైటెడ్ స్టేట్స్ మిషన్ ఇన్ ఇండియా ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్టును వరంగల్, కోయంబత్తూరు, జైపూర్, నాగ్‌పూర్, దుర్గాపూర్ నగరాల్లో నిర్వహిస్తున్నారు.
ఔత్సాహిక మహిళలకు సేల్స్, మార్కెటింగ్, నిర్వహణ, మానవ వనరులు, ఫైనాన్స్ అంశాల్లో మూడు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. అభ్యర్థులకు యూఎస్ఏకు చెందిన నిపుణులు మెంటార్లుగా ఉంటారని ప్రాజెక్టు చైర్పర్సన్ సీమ చతుర్వేది తెలిపారు. జనవరి 31లోగా వుమెన్.టై.ఓఆర్జీ వెబ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వరంగల్‌లో ఫిబ్రవరి 21–23 తేదీల్లో వర్క్‌షాప్ జరుగుతుందని టై హైదరాబాద్ ఈడీ శ్రీదేవి దేవిరెడ్డి చెప్పారు.