గొంతు కోసి వివాహిత దారుణ హత్య
కాజులూరు(తూర్పుగోదావరి): తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం తిప్పరాజుపాలెంలో ఓ వివాహిత దారుణహత్యకు గురైంది. గ్రామ శివారులోని పొలాల్లో ఉన్న కాల్వ ఒడ్డున మహిళను గొంతుకోసి చంపేసిన దుండగులు మృతదేహంపై గడ్డి వేసి నిప్పంటించారు.
సగం కాలిన మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడకు తరలించారు.