నిలిచిన తిరుపతి-హుబ్లీ ఎక్స్ప్రెస్
కడప: తిరుపతి నుంచి హుబ్లీ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల అత్యవసరంగా రైలును నిలిపివేశారు. వైఎస్సార్ జిల్లా నంవలూరు సమీపంలోకి రాగానే రైళ్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గుర్తించిన డ్రైవర్ నంవలూరు సమీపంలో రైలును నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు.