Tirupati SVIMS
-
బంగారు ఆభరణాలు మాయం; ఆళ్లనాని సీరియస్
సాక్షి, అమరావతి: తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్లో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయం వ్యవహారంపై ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై మంత్రి నాని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాయమైన బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్స్ వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు అందచేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీచేశారు. తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తి పై స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మఅలిపిరి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. (టీడీపీ ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేసింది) రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో జరిగిన ఈ సంఘటనపై మంత్రి ఆళ్ల నాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి కరోనా బాధితులకు అండగా ఉంటూ వారి ఆరోగ్యం మెరుగుదలకు కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ కోవిడ్ హాస్పిటల్స్ గాని, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో గాని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కరోనా మృతుని రింగ్, సెల్‌ఫోన్ మాయం! తిరుపతి తుడా: తిరుపతి స్విమ్స్ శ్రీపద్మావతి స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనాబారిన పడి మృతిచెందిన వ్యక్తి నుంచి బంగారు ఉంగరంతో పాటు సెల్‌ఫోన్ మాయం కావడం విమర్శలకు తావిచ్చింది. కొన్ని రోజులుగా స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి, ఈ నేపథ్యంలో చౌడేపల్లెకు చెందిన వెంకటరత్నంనాయుడు పదిరోజుల క్రితం మృతి చెందాడు. ఈ మృతదేహం చేతికి ఉన్న బంగారు ఉంగరంతో పాటు ఖరీదైన మొబైల్‌ను పీపీకిట్లతో విధుల్లో వున్న ఓ వ్యక్తి అపహరించడం గురువారం సీసీ పుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. కరోనా మృతుల ఆభరణాలు, మొబైల్ ఫోన్లను దొంగిలిస్తున్న ఉదంతాలు స్విమ్స్ ప్రతిష్టకు మచ్చలా మారింది. ఇకనైనా అధికారులు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఎంతైనా ఉంది. -
ఏపీలో మరో రెండు వైరాలజీ ల్యాబ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం 7 వైరాలజీ ల్యాబొరేటరీలు ఉండగా అదనంగా తిరుపతి రుయా ఆస్పత్రి, కర్నూలు జనరల్ ఆస్పత్రిలో ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. రోజుకు ఒక్కో ల్యాబ్‌లో 180 పరీక్షలు చేసే సామర్థ్యంతో కొత్తవి ఏర్పాటు చేస్తామని, ల్యాబొరేటరీల నిర్వహణాధికారి, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున ‘సాక్షి’కి తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ► కరోనా వచ్చే నాటికి మన రాష్ట్రంలో తిరుపతిలో స్విమ్స్‌లో మాత్రమే వైరాలజీ ల్యాబ్ ఉండేది. ► ఇప్పుడు ఆ సంఖ్య 7కు చేరింది. ఈ ల్యాబ్‌లలో రోజుకు 1,170 టెస్టులు చేస్తున్నాం. ► లివెందులలోని జినోమ్‌కార్ల్ అనే సంస్థ పశువులకు సంబంధించి పరిశోధనలకు ల్యాబొరేటరీ నిర్వహించేది. ఇప్పుడా పరికరాలు ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ పరికరాలు కర్నూలు మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నాం. ► ఐసీఎంఆర్ అనుమతులు ఇస్తే కొత్తగా ఏర్పాటు చేసే రెండు ల్యాబ్‌లు పది రోజుల్లోగా అందుబాటులోకి వస్తాయి. ► అప్పుడు ల్యాబ్‌ల సంఖ్య 9కి చేరుతుంది. దీంతో రోజుకు 1,530 టెస్టులు చేసే వీలుంటుంది ఇది చదవండి: వారికి ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దు -
హోం క్వారంటైన్లో స్విమ్స్ వైద్యుడు
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్యుడిని ముందస్తు చర్యల్లో భాగంగా హోం క్వారంటైన్లో ఉంచారు. తెలంగాణకు చెందిన ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. అయితే, అంతకు ముందు ఆయన ఈ నెల 17న ఇండిగో విమానంలో తిరుపతికి వచ్చారు. స్విమ్స్ ఆస్పత్రిలోని ఓ డాక్టర్‌ను కలిసి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో స్విమ్స్ వైద్యుడికి కరోనా సోకే అవకాశం ఉందని భావించిన అధికారులు ఆయనను హోం క్వారంటైన్లో ఉంచారు. (ఒకేరోజు 14 మందికి కరోనా పాజిటివ్) కాగా తిరుపతిలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతోంది. దీంతో ఫోన్‌చేస్తే ... నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే పంపిస్తున్నారు. మరోవైపు జనం నివాస గృహాలకే పరిమితం కావాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగర పాలక కమిషనర్ గిరీష్ సూచించారు. శనివారం ఉదయం వీరు ప్రధాన వీధుల్లో పర్యటించారు. అనవసరంగా వీధుల్లోకి వస్తే కేసులు నమోదు తప్పదని హెచ్చరించారు. (ఇంటికెళ్లండి ప్లీజ్..!) -
తిరుపతి స్విమ్స్ నోటీసులపై హైకోర్టు ఆగ్రహం
-
తిరుపతి స్విమ్స్ నోటీసులపై హైకోర్టు ఆగ్రహం
తిరుపతి : స్విమ్స్ అధికారుల నోటీసులుపై హైకోర్టు శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ, తిరుపతి స్విమ్స్ అధికారులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 8వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. కాగా వెంటిలేటర్ల కొరత ఉన్నందున.. కార్పొరేట్ హాస్పిటల్స్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను పంపించవద్దంటూ స్విమ్స్ అధికారులు ఈ ఏడాది జూన్ లో ప్రయివేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలసిందే. దీంతో స్విమ్స్ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి, పురుషోత్తమ్ రెడ్డి జూలైలో హైకోర్టును ఆశ్రయించారు. కాగా స్విమ్స్ జారీచేసిన వివాదాస్పద నోటీసులను రద్దు చేయాలని కోరుతూ గతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తియి. -
కమీషన్ల కక్కుర్తి!
► ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ల కొనుగోలులో తీవ్ర జాప్యం ► మూడుసార్లు టెండర్లు పిలిచి రద్దుచేసిన వైనం ► పీపీపీకి వెళ్లే యోచనలో వైద్యవిద్య ఉన్నతాధికారులు ► ఎంఆర్ఐ లేకపోతే గుంటూరు వైద్య కళాశాలకు 200 సీట్లు కష్టమే ► అధికారుల తీరుతో ఆందోళనలో వైద్య విద్యార్థులు సాక్షి, గుంటూరు : కమీషన్ల కోసం కక్కుర్తిపడి టెండర్లను సైతం రద్దుచేయాలని చూస్తున్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కొనుగోలు చేస్తే కమీషన్లు రావనే నెపంతో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) ద్వారా అద్దెకు పెట్టించాలని చూస్తున్నారు. కొనుగోలు కోసం టెండర్లు పిలవడం, రద్దు చేయడం వీరికి పరిపాటిగా మారింది. మూడేళ్లుగా టెండర్లు రద్దుచేసిన అధికారులు నాలుగోసారి కూడా రద్దుకు కుట్రపన్నుతున్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కొనుగోలు చేయాలంటే సుమారు రూ. 9.5 కోట్లు ఖర్చవుతుంది. పీపీపీ ద్వారా ఏర్పాటుచేస్తే నెలకు రూ. 30 లక్షల చొప్పున చెల్లించేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఐదేళ్ళలో వీరికి చెల్లించే అద్దెతో మిషన్ కొనుగోలు చేయవచ్చని తెలిసినా కాసులకు కక్కుర్తిపడి వైద్య విద్యార్థులు, రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే... ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ల కొనుగోలుకు మూడు నెలల క్రితం టెండర్లు గుంటూరు జీజీహెచ్, తిరుపతి స్విమ్స్, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు కొనుగోలుకు మూడు నెలల కిందట టెండర్లు పిలిచారు. మూడు ఆస్పత్రుల్లో మూడు ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు కలిపి రూ. 28 కోట్లకు ఫిలిప్స్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన టెండర్ దక్కించుకుంది. టెండర్ పూర్తయి నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకూ డబ్బు విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారు. డబ్బు విడుదల చేసిన వెంటనే మూడు ఆస్పత్రుల్లో మిషన్లను బిగించేందుకు ఫిలిప్స్ కంపెనీ సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు తాత్సారం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగిఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీపీపీ విధానంలో మిషన్లను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే నెలనెలా లక్షల్లో కమీషన్లు వస్తాయనే భావనతో వైద్య, విద్య ఉన్నతాధికారులు ఇలా చేస్తున్నారని ఆస్పత్రి వైద్యులు ఆరోపిస్తున్నారు. మూడేళ్లుగా ప్రతి సంవత్సరం టెండర్లు పిలవడం, రద్దుచేయడం వీరికి పరిపాటిగా మారిందని, ఇప్పుడు నాలుగోసారి కూడా టెండర్ రద్దుచేయాలని యోచిస్తున్నారని వారు మండిపడుతున్నారు. రోజుకు 35 మందికి స్కానింగ్ పరీక్షలు పీపీపీ ద్వారా ఏర్పాటుచేస్తే ఒక్కో ఆస్పత్రిలో రోజుకు సుమారు 35 మంది రోగులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తారని, ఒక్కో రోగికి రూ. 2 వేలు చొప్పున రోజుకు రూ.70 వేలు చెల్లించాలని, నెలకు సుమారుగా రూ. 25 లక్షల వరకూ చెల్లించాల్సిఉంటుంది. ఈ లెక్కన చూస్తే ఏడాదికి రూ. 3 కోట్లు చెల్లించాలి. వీరికి మూడున్నరేళ్లపాటు చెల్లించే డబ్బుతో కొత్త ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత మిషన్ ఆస్పత్రి సొంతమవుతుంది. నెలనెలా కమీషన్లు రావనే కారణంతోనే టెండర్ల రద్దుకు కొందరు ఉన్నతాధికారులు యత్నిస్తున్నట్లు సమాచారం. విద్యార్థుల జీవితాలతో చెలగాటం భారత వైద్య మండలి తనిఖీల్లో ఎంఆర్ఐ స్కా నింగ్ మిషన్ లేదని గుర్తిస్తే ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న 200 ఎంబీబీఎస్ సీట్లలో కోతపడే ప్రమాదం ఉంది. న్యూరాలజీ, యూరాలజీ, న్యూరోసర్జరీ, రేడియాలజీ విభాగాల్లో వైద్య విద్య పూర్తిచేసుకున్న విద్యార్థులకు గుర్తింపు లేకుండాపోతుంది. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయనే విషయం తెలిసినా ధనార్జనే ధ్యేయం గా ఉన్నతాధికారులు వ్యవహరించడం దారుణమని వైద్యాధికారులు మండిపడుతున్నారు.