తిరుపతి : స‍్విమ్స్ అధికారుల నోటీసులుపై హైకోర్టు శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ, తిరుపతి స్విమ్స్ అధికారులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 8వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. కాగా వెంటిలేటర్ల కొరత ఉన్నందున.. కార్పొరేట్ హాస్పిటల్స్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను పంపించవద్దంటూ స్విమ్స్ అధికారులు ఈ ఏడాది జూన్ లో ప్రయివేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలసిందే.
దీంతో స్విమ్స్ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి, పురుషోత్తమ్ రెడ్డి జూలైలో హైకోర్టును ఆశ్రయించారు. కాగా స్విమ్స్ జారీచేసిన వివాదాస్పద నోటీసులను రద్దు చేయాలని కోరుతూ గతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తియి.