వంశీకి 6 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: టీకేఆర్ కాలేజి బౌలర్ వంశీ (6/12) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. దీంతో జేఎన్టీయూహెచ్ జోన్-ఎ క్రికెట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీకేఆర్ కాలేజి 50 పరుగుల తేడాతో ఎంఆర్‌ఐఈటీ కాలేజిపై గెలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీకేఆర్ కాలేజి 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రవి చరణ్ (55) అర్ధ సెంచరీతో రాణిచాడు. ఎంఆర్ఐటీ బౌలర్ శ్రీకాంత్ 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఎంఆర్ఐటీ 110 పరుగులకే చేతులెత్తేసింది. బాల (42) మెరుగ్గా ఆడాడు. మరో మ్యాచ్‌లో ఎంఎల్ఆర్ఐటీ కాలేజి 18 పరుగుల తేడాతో ఐఏఆర్ఈ కాలేజిపై విజయం సాధించింది.
మొదట బరిలోకి దిగిన ఎంఎల్ఆర్ఐటీ 127 పరుగుల వద్ద ఆలౌటైంది. విశాల్ సింగ్ 26 పరుగులు చేశాడు. ఐఏఆర్ఈ బౌలర్ హిమకర్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన ఐఏఆర్ఈ 108 పరుగుల వద్ద కుప్పకూలింది. రోహిత్ 31 పరుగులు చేశాడు. ఎంఎల్ఆర్ఐటీ బౌలర్ 3 వికెట్లు పడగొట్టాడు.