tncc president
-
కాంగ్రెస్‌లో చీలిక?
తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ)లో చీలిక మొదలైంది. టీఎన్‌సీసీ అధ్యక్ష పదవికి జ్ఞానదేశికన్ చేసిన రాజీనామా ఆమోదం పొందడం, కొత్త అధ్యక్షునిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ నియామకం జరిగిపోగా, మాజీలు మరో పార్టీ సన్నాహాల్లో పడిపోయారు. చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత సభ్యత్వం కార్యక్రమం జరుగుతుండగా, కార్యకర్తలకు జారీచేసే సభ్యత్వకార్డులో మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, సీనీయర్ నేత జీకే మూపనార్ ఫొటోలను తొలగించాలని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో పార్టీలో ముసలం బయలుదేరింది. ఫొటోల తొలగింపులో తనను మాటమాత్రమైనా అడగకుండా నిర్ణయం తీసుకోవడం జ్ఞానదేశికన్‌కు ఆగ్రహం తెప్పించింది. అధిష్టానం ఏకపక్ష నిర్ణయాలు చేస్తోంది అంటూ రెండు రోజుల క్రితం సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపగా వెంటనే ఆమోదించారు. 2016లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోగల వ్యక్తిని నియమించాలనే ఏకవాక్య అజెండాతో సోనియా ఢిల్లీలోని తన స్వగృహంలో శనివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ ముకుల్‌వాస్నిక్ పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరి పారు. ఈ సందర్భంగా ఇళంగోవన్, పీటర్ ఆల్బెన్స్, సుదర్శన్ నాచియప్పన్, తిరునావుక్కరసు, వసంతకుమార్ పేర్లను సమావేశం పరిశీలించింది. టీఎన్‌సీసీ అధ్యక్షునిగా గతంలో పనిచేసిన అనుభవం ఉన్న ఇళంగోవన్ పేరును ఏకగ్రీవంగా తీర్మానించగా, రాష్ట్ర ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ అధికారికంగా ప్రకటించారు. ప్రకటన వెలువడిన వెంటనే సత్యమూర్తి భవన్‌కు చేరుకున్న ఇళంగోవన్‌ను ఆయన అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. భవన్ ప్రాంగణంలో బాణాసంచా కాల్చి సంబరం చేశారు. ఇళంగోవన్ సత్యమూర్తి భవన్ నుంచి కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ ఇంటికి వెళ్లి అండగా నిలవాలని కోరారు. అనుభవం అనుకూలించేనా? ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళయంలో జన్మించిన ఇళంగోవన్ 2000 నుంచి 2002 వరకు టీఎన్‌సీసీ అధ్యక్షునిగా పనిచేశారు. 2004లో గోపిచెట్టి పాళయం నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా తిప్పికొట్టగల నేర్పు న్న నాయకునిగా పేరుంది. పార్టీలోని అన్నివర్గాలను కలుపుకుపోగల నాయకత్వ లక్షణాలు ఉన్న నేతగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో పార్టీ పూర్తిగా చతికిలబడి ఉన్న పరిస్థితిల్లో ఇళంగోవన్ అనుభవం అనుకూలిస్తుందా అనేది వేచి చూడాల్సిందే. -
నువ్వా...నేనా?
సాక్షి, చెన్నై : టీఎన్‌సీసీ అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. నువ్వా...నేనా అన్నట్టు గా ఆ పార్టీ రాష్ర్ట నాయకులు ఢిల్లీలో తిష్ట వేసి ఉన్నారు. అయితే, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, జీకే వాసన్లు ఈ పోటీకి దూరంగా ఉండడటం గమనార్హం.రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో పునరుత్తేజం కల్గించేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధమయ్యా రు. రాష్ట్రంలో ఒంటరిగా మిగిలిన పార్టీకి మున్ముందు రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదురుకాకుండా, ఇప్పుడే జాగ్రత్త లు తీసుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ తీరుతోనే డీఎంకేను దూరం చేసుకుని, రాష్ట్రంలో ఒంటరిగా మిగలాల్సి వచ్చిందన్న ఫిర్యాదులు ఏఐసీసీకి వెళ్లాయి. ఇద్దరికీ బ్రేక్ : రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యధిక శాతం మద్దతుదారులను కలిగిన నేతలు జికే వాసన్, చిదంబరం మాత్రమే. అయితే, ప్రస్తుతం ఆ ఇద్దరి నేతల హవాకు బ్రేక్ పడి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో వీరోచితంగా శ్రమించినా, తమ వాళ్లను ఈ ఇద్దరు నేతలు గెలిపించుకోలేని పరిస్థితి. దీంతో అధిష్టానం వద్ద గుర్తింపు ఉన్న నాయకులంతా తమ కంటే, తమకు అధ్యక్ష పదవి ఇవ్వాలని మొర పెట్టుకునే పనిలో పడ్డారు. వారిలో జాతీయ పార్టీ కార్యదర్శి తిరునావుక్కరసు, కేంద్ర మాజీ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్, మాజీ ఎంపీ ఆర్ ప్రభు, మానిక్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యేలు పీటర్ అల్పోన్స్, విష్ణు ప్రసాద్, వసంతకుమార్‌లు ఉన్నారు. తక్కువ వయస్కులకు, కొత్త వాళ్లకు ఈ సారీ అధ్యక్ష పదవి కట్ట బెట్టాలన్న ఉద్దేశంతో ఏఐసీసీ అధినేత్రి సోనియా ఉన్న సమాచారంతోనే వీరంతా అధ్యక్ష పదవి మీద కన్నేయడం గమనార్హం. మంతనాలు : అధ్యక్ష పదవి ఎంపిక మీద ఢిల్లీలో శనివారం సీనియర్ నేత ఏకే ఆంటోని నేతృత్వంలో మంతనాలు జరిగినట్టు టీఎన్‌సీసీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందులో మాజీ అధ్యక్షుడు తంగబాలు, ప్రస్తుత అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత గోపినాథ్, అధ్యక్ష పదవికి ఆశావహులైన వసంతకుమార్, మానిక్ ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శులు జయకుమార్, సెల్వకుమార్, తిరునావుక్కరసులు పాల్గొన్నట్టు చెబుతున్నారు. అయితే, జీకే వాసన్, చిదంబరం మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టడం గమనార్హం. చివరకు, వాసన్, చిదంబరం నేతృత్వంలో మరో మారు చర్చల అనంతరం అధ్యక్ష సీటు ఎవరికి అన్నది తేల్చే పనిలో ఆంటోని పడ్డట్టు సమాచారం. పార్లమెంట్ సమావేశాల అనంతరం, త్వరలో జరగనున్న ఏఐసీసీ కార్యవర్గం భేటీలో తీసుకునే నిర్ణయానికి అధ్యక్ష పదవి ఎంపికను వదలినట్టు మరో నేత పేర్కొనడం గమనార్హం.