కాంగ్రెస్‌లో చీలిక? | Elangovan new Tamil Nadu Congress chief | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చీలిక?

Published Sun, Nov 2 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

కాంగ్రెస్‌లో చీలిక?

కాంగ్రెస్‌లో చీలిక?

 తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ)లో చీలిక మొదలైంది. టీఎన్‌సీసీ అధ్యక్ష పదవికి జ్ఞానదేశికన్ చేసిన రాజీనామా ఆమోదం పొందడం, కొత్త అధ్యక్షునిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ నియామకం జరిగిపోగా, మాజీలు మరో పార్టీ సన్నాహాల్లో పడిపోయారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత సభ్యత్వం కార్యక్రమం జరుగుతుండగా, కార్యకర్తలకు జారీచేసే సభ్యత్వకార్డులో మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, సీనీయర్ నేత జీకే మూపనార్ ఫొటోలను తొలగించాలని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో పార్టీలో ముసలం బయలుదేరింది. ఫొటోల తొలగింపులో తనను మాటమాత్రమైనా అడగకుండా నిర్ణయం తీసుకోవడం జ్ఞానదేశికన్‌కు ఆగ్రహం తెప్పించింది. అధిష్టానం ఏకపక్ష నిర్ణయాలు చేస్తోంది అంటూ రెండు రోజుల క్రితం సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపగా వెంటనే ఆమోదించారు.
 
 2016లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోగల వ్యక్తిని నియమించాలనే ఏకవాక్య అజెండాతో సోనియా ఢిల్లీలోని తన స్వగృహంలో శనివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ ముకుల్‌వాస్నిక్ పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరి పారు. ఈ సందర్భంగా ఇళంగోవన్, పీటర్ ఆల్బెన్స్, సుదర్శన్ నాచియప్పన్, తిరునావుక్కరసు, వసంతకుమార్ పేర్లను సమావేశం పరిశీలించింది. టీఎన్‌సీసీ అధ్యక్షునిగా గతంలో పనిచేసిన అనుభవం ఉన్న ఇళంగోవన్ పేరును ఏకగ్రీవంగా తీర్మానించగా, రాష్ట్ర ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్ అధికారికంగా ప్రకటించారు. ప్రకటన వెలువడిన వెంటనే సత్యమూర్తి భవన్‌కు చేరుకున్న ఇళంగోవన్‌ను ఆయన అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. భవన్ ప్రాంగణంలో బాణాసంచా కాల్చి సంబరం చేశారు. ఇళంగోవన్ సత్యమూర్తి భవన్ నుంచి కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ ఇంటికి వెళ్లి అండగా నిలవాలని కోరారు.
 
 అనుభవం అనుకూలించేనా?
 ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళయంలో జన్మించిన ఇళంగోవన్ 2000 నుంచి 2002 వరకు టీఎన్‌సీసీ అధ్యక్షునిగా పనిచేశారు. 2004లో గోపిచెట్టి పాళయం నుంచి ఎంపీగా ఎన్నికై  కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా తిప్పికొట్టగల నేర్పు న్న నాయకునిగా పేరుంది. పార్టీలోని అన్నివర్గాలను కలుపుకుపోగల నాయకత్వ లక్షణాలు ఉన్న నేతగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో పార్టీ పూర్తిగా చతికిలబడి ఉన్న పరిస్థితిల్లో ఇళంగోవన్ అనుభవం అనుకూలిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement