tolerant
-
దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించం
వాషింగ్టన్: అమెరికాలో తమ ప్రభుత్వం ఏర్పాటైతే దక్షిణాసియాలో టెర్రరిజాన్ని సహించబోదని బైడెన్ ఎన్నికల ప్రచార నిర్వాహకులు చెప్పారు. భారత దేశం అమెరికా సహజ భాగస్వాములని నమ్ముతున్నామని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు. అమెరికాలోని హిందూ, అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వివిధ అంశాలతో ఒక ప్రశ్నావళి తయారుచేసి, తమ తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా అధ్యక్షస్థానానికి పోటీ చేస్తోన్న పార్టీలకు పంపించింది. మొట్టమొదటిగా ఆ ప్రశ్నావళికి బైడెన్ రాతపూ ర్వకం గా సమాధానమిచ్చారు. ఇరువురూ ఈ ప్రశ్నావళికి ఇచ్చిన సమాధానాలను బట్టి, నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో కమిటీ నిర్ణయిస్తుంది.(చదవండి: బైడెన్‌కే భారతీయుల బాసట) -
'భారత్ ఎప్పటికీ సహనశీల దేశమే'
న్యూఢిల్లీ: భారత్ ఎప్పటికీ సహనశీల దేశమేనని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం లోక్‌సభలో అసహనంపై జరిగిన చర్చలో రాజ్‌నాథ్ మాట్లాడారు. దేశ విభజన, ఎమర్జెన్సీ, 1984 అల్లర్ల సమయంలో మాత్రమే దేశంలో అసహనం కనిపించిందని పేర్కొన్నారు. దాద్రి ఘటన జరిగిన వెంటనే యూపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని, అందులో బీఫ్ గురించి ఏమీ లేదని రాజ్‌నాథ్ సభకు తెలిపారు. అవినీతి, ఉగ్రవాద, మహిళలపై హింసను సహించబోమని, ఇలాంటి విషయంలో అసహనంగానే ఉంటామని చెప్పారు.