'భారత్ ఎప్పటికీ సహనశీల దేశమే' | India will remain tolerant: Rajnath Singh | Sakshi
Sakshi News home page

'భారత్ ఎప్పటికీ సహనశీల దేశమే'

Published Tue, Dec 1 2015 8:26 PM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

'భారత్ ఎప్పటికీ సహనశీల దేశమే'

'భారత్ ఎప్పటికీ సహనశీల దేశమే'

న్యూఢిల్లీ: భారత్ ఎప్పటికీ సహనశీల దేశమేనని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం లోక్సభలో అసహనంపై జరిగిన చర్చలో రాజ్నాథ్ మాట్లాడారు. దేశ విభజన, ఎమర్జెన్సీ, 1984 అల్లర్ల సమయంలో మాత్రమే దేశంలో అసహనం కనిపించిందని పేర్కొన్నారు.

దాద్రి ఘటన జరిగిన వెంటనే యూపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని, అందులో బీఫ్ గురించి ఏమీ లేదని రాజ్నాథ్ సభకు తెలిపారు. అవినీతి, ఉగ్రవాద, మహిళలపై హింసను సహించబోమని, ఇలాంటి విషయంలో అసహనంగానే ఉంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement