రేపు గవర్నర్ నరసింహన్ పుట్టపర్తి రాక
పుట్టపర్తి టౌన్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శనివారం పుట్టపర్తికి రానున్నట్లు రెవెన్యూ అధికారులు గురువారం తెలిపారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక కాన్వాయ్‌లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పుట్టపర్తికి చేరుకుంటారన్నారు. మూడు గంటల పాటు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గడిపి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడి నుంచి ఆయన బయలు దేరుతాయని వారు తెలిపారు.