tommorow
-
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
రేపే మలి విడత
నిజామాబాద్‌అర్బన్: బోధన్ డివిజన్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్త య్యాయి. బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసిపోగా ఈనెల 25న ఎన్నికలు జరుగనున్నా యి. ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒం టి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి అభ్యర్థులను ప్రకటిస్తారు. డివిజన్లోని బోధన్, కోటగిరి, రెంజల్, రుద్రూ రు, వర్ని, ఎడపల్లి మండలాల్లో 142 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 11న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 13న నామినేషన్ల ముగింపు, ఉపసంహరణల అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. 33 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానా లు ఏకగ్రీవం కాగా, 109 స్థానాలకు ఎన్ని కలు జరుగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 336 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,296 వార్డు లు ఉండగా ఇందులో 452 వార్డు స్థానాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగితా 844 వార్డులకు ఎన్నికలు జరుగనున్నా యి. వార్డు స్థానాలకు 2,002 మంది బరిలో ఉన్నారు. కుల సంఘాలకు.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియగానే, ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు గ్రామాల్లో కులసంఘాలు, యు వజన సంఘాలకు విందులు ఏర్పాటు చేస్తున్నా రు. మహిళా సంఘాలకు శీతల పానీయాలను పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి మద్యం అందిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా తమకు కేటాయించిన గుర్తులను వస్తువులుగా అభ్యర్థులు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. కులసంఘాలు, యువజన సంఘాల సభ్యులకు రోజూ విందులు ఇస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. -
రేపే మావోయిస్టుల బంద్
రంపచోడవరం:ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ) మల్కన్ గిరి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఈ నెల 3న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేప«థ్యంలో ఏజెన్సీలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. మావోయిస్టు ప్రభావిత పోలీస్ స్టేషన్లలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ ఎన్ కౌంటర్‌తో కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులు ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడినా తిప్పికొట్టేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చే వాహనాలతోపాటు బయటకు వెళ్లే వాహనాలను కూడా తనిఖీ చేసి వదిలిపెడుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు భద్రత కట్టుదిట్టం చేశారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచారు. ప్రజాప్రతినిధులను లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని ఇప్పటికే పోలీసులు సూచించారు. ముఖ్యమైన నేతలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మండల కేంద్రాలకు పరిమితం కావాలని పోలీసులు సూచించారు. గతంలో బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భాల్లో విధ్వంసక చర్యలకు పాల్పడిన ఘటనలున్నాయి. ఏజెన్సీలో పరిస్థితి గత రెండు రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉంది. బంద్ ప్రభావం ఉండదు జిల్లా ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో బంద్ ప్రభావం ఏమీ ఉండదని ప్రజా రవాణాకు ఎక్కడా ఎటువంటి అటంకాలు కలగవని తెలిపారు. -
రేపే మావోయిస్టుల బంద్
రంపచోడవరం:ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ) మల్క¯ŒSగిరి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన పోలీస్ ఎ¯ŒSకౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఈ నెల 3న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేప«థ్యంలో ఏజెన్సీలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. మావోయిస్టు ప్రభావిత పోలీస్ స్టేషన్లలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ ఎ¯ŒSకౌంటర్‌తో కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులు ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడినా తిప్పికొట్టేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చే వాహనాలతోపాటు బయటకు వెళ్లే వాహనాలను కూడా తనిఖీ చేసి వదిలిపెడుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు భద్రత కట్టుదిట్టం చేశారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచారు. ప్రజాప్రతినిధులను లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని ఇప్పటికే పోలీసులు సూచించారు. ముఖ్యమైన నేతలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మండల కేంద్రాలకు పరిమితం కావాలని పోలీసులు సూచించారు. గతంలో బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భాల్లో విధ్వంసక చర్యలకు పాల్పడిన ఘటనలున్నాయి. ఏజెన్సీలో పరిస్థితి గత రెండు రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉంది. బంద్ ప్రభావం ఉండదు జిల్లా ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో బంద్ ప్రభావం ఏమీ ఉండదని ప్రజా రవాణాకు ఎక్కడా ఎటువంటి అటంకాలు కలగవని తెలిపారు. -
రేపు సబ్‌కలెక్టర్ కార్యాలయం ముట్టడి
రాజమహేంద్రవరం : తమ డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ జిల్లా బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన రాజమహేంద్రవరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు సంఘ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పంపన రామకృష్ణ, మట్టపర్తి సూర్యచంద్రరావు పేర్కొన్నారు. మోరంపూడిలోని ఏపీఎస్ఈబీ ఇంజనీర్ల కల్యాణమండపంలో కడలి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం రూరల్ నియోజకవర్గ బీసీ కులాల ఐక్యత సదస్సు జరిగింది. అనంతరం రామకృష్ణ, సూర్యచంద్రరావు విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. వీటితో పాటు అనేక డిమాండ్లను తీర్చాలని కోరుతూ సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామన్నారు. జిల్లాలోని బీసీకులాల వారందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చే యాలని కోరారు.