రేపే మావోయిస్టుల బంద్‌ | tommorow maoist bandh | Sakshi
Sakshi News home page

రేపే మావోయిస్టుల బంద్‌

Published Wed, Nov 2 2016 12:14 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

రేపే మావోయిస్టుల బంద్‌ - Sakshi

రేపే మావోయిస్టుల బంద్‌

రంపచోడవరం:ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ) మల్కన్‌ గిరి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన పోలీస్‌ ఎన్‌ కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఈ నెల 3న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేప«థ్యంలో ఏజెన్సీలో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమయింది. మావోయిస్టు ప్రభావిత పోలీస్‌ స్టేషన్లలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ ఎన్‌ కౌంటర్‌తో కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులు ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడినా తిప్పికొట్టేందుకు పోలీస్‌ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చే వాహనాలతోపాటు బయటకు వెళ్లే వాహనాలను కూడా తనిఖీ చేసి వదిలిపెడుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు భద్రత కట్టుదిట్టం చేశారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచారు. ప్రజాప్రతినిధులను లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని ఇప్పటికే పోలీసులు సూచించారు. ముఖ్యమైన నేతలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మండల కేంద్రాలకు పరిమితం కావాలని పోలీసులు సూచించారు. గతంలో బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భాల్లో విధ్వంసక చర్యలకు పాల్పడిన ఘటనలున్నాయి. ఏజెన్సీలో పరిస్థితి గత రెండు రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉంది. 
బంద్‌ ప్రభావం ఉండదు
జిల్లా ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో బంద్‌ ప్రభావం ఏమీ ఉండదని ప్రజా రవాణాకు ఎక్కడా ఎటువంటి 
అటంకాలు కలగవని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement