రేపు సబ్‌కలెక్టర్ కార్యాలయం ముట్టడి
Published Sun, Aug 28 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
రాజమహేంద్రవరం : తమ డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ జిల్లా బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన రాజమహేంద్రవరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు సంఘ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పంపన రామకృష్ణ, మట్టపర్తి సూర్యచంద్రరావు పేర్కొన్నారు.
మోరంపూడిలోని ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్ల కల్యాణమండపంలో కడలి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం రూరల్ నియోజకవర్గ బీసీ కులాల ఐక్యత సదస్సు జరిగింది. అనంతరం రామకృష్ణ, సూర్యచంద్రరావు విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. వీటితో పాటు అనేక డిమాండ్లను తీర్చాలని కోరుతూ సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామన్నారు. జిల్లాలోని బీసీకులాల వారందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చే యాలని కోరారు.
Advertisement
Advertisement