top 10 richest indians
-
నాన్న ఇచ్చిన గిఫ్ట్.. ప్రపంచంలో టాప్ 10లోకి..
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా చరిత్ర సృష్టించారు. మహిళల హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారు. రూ.3.5 లక్షల కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు.నాన్న గిఫ్ట్హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, తన తండ్రి శివ్ నాడార్ నుంచి 47 శాతం వాటా బదిలీ కావడంతో ఆమె ర్యాంకింగ్స్‌లో ఎదిగారు. ఈ బదిలీతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రమోటర్ సంస్థలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (వామ ఢిల్లీ), హెచ్‌సీఎల్ కార్ప్ నియంత్రణలోకి వచ్చాయి. ఫలితంగా 12 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ దిగ్గజానికి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలు ఇప్పుడు రోషిణి నాడార్ మల్హోత్రా చేతిలోకి వచ్చాయి.ఈ బదిలీతో రోష్ని నాడార్ మల్హోత్రా ఇప్పుడు వామా ఢిల్లీ 44.17 శాతం వాటా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో హెచ్‌సీఎల్ కార్ప్ 0.17 శాతం వాటా, వామా ఢిల్లీ 12.94 శాతం వాటా, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్‌లో హెచ్‌సీఎల్ కార్ప్ 49.94 శాతం వాటాపై ఓటింగ్ హక్కులపై నియంత్రణ కలిగి ఉన్నారు.వాటాల బదిలీకి ముందు శివ్ నాడార్ కు వామా ఢిల్లీ, హెచ్ సీఎల్ కార్పొరేషన్ రెండింటిలోనూ 51 శాతం వాటా ఉండగా, రోష్ని నాడార్ మల్హోత్రాకు ఈ రెండు సంస్థల్లో 10.33 శాతం వాటా ఉండేది. 2020 జూలైలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్స్‌గా రోషిణి నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అగ్రశ్రేణి విద్యా సంస్థలను స్థాపించిన శివ్ నాడార్ ఫౌండేషన్ కు ఆమె ట్రస్టీగా కూడా ఉన్నారు. -
దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?
దేశంలో అత్యంత ధనవంతులైన పది మందిలో అగ్రస్థానాన్ని మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సొంతం చేసుకున్నారు. ఆయన మొత్తం సంపద విలువ 1.52 లక్షల కోట్లు అని ఫోర్బ్స్ తాజా జాబితా తెలిపింది. గడిచిన సంవత్సరం ఆయన సంపద రూ. 1.26 లక్షల కోట్లు కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గడిచిన ఏడాది కాలంలో 21% పెరిగాయని, అందుకే అంబానీ సంపద కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది. అంబానీ తర్వాత రెండో స్థానంలో ఫార్మా దిగ్గజం దిలీప్ సంఘ్వీ నిలిచారు. ఆయన మొత్తం సంపద రూ. 1.13 లక్షల కోట్లుగా తేలింది. సన్ ఫార్మా షేర్ల విలువ తగ్గడంతో గత ఏడాది కంటే ఆయన సంపద కొంత తగ్గిందని ఫోర్బ్స్ తేల్చింది. మూడో స్థానంలో హిందూజా సోదరులు నిలిచారు. శ్రీచంద్, గోపీచంద్, ప్రకాష్, అశోక్.. ఈ నలుగురు సోదరులూ కలిసి మొత్తం హిందూజా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు దశాబ్దాలుగా విప్రోను ముందుండి నడిపిస్తున్న ఆ గ్రూపు అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఈసారి నాలుగో స్థానానికి పడిపోయారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతో సిమెంటు, పెయింటు కంపెనీల వాళ్లు బాగుపడ్డారు. వేణుగోపాల్ బంగూర్ తొలిసారిగా టాప్ 20 జాబితాలో చోటు సంపాదించారు. ఆయనకు ఈ జాబితాలో 14వ స్థానం లభించింది. అలాగే ఏషియన్ పెయింట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశ్వినీ దాని కూడా 34వ స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాది భారత దేశంలో దాదాపు 6700 కోట్లకు పైగా సంపద పెంచుకున్నవాళ్లు మొత్తం 15 మంది ఉన్నారు. వాళ్లలో వీళ్లిద్దరికీ స్థానం లభించింది. భారతదేశంలో టాప్ టెన్ కుబేరులు వీళ్లే.. 1. ముకేష్ అంబానీ - 1.52 లక్షల కోట్లు 2. దిలీప్ సంఘ్వీ - 1.13 లక్షల కోట్లు 3. హిందూజా సోదరులు - 1.02 లక్షల కోట్లు 4. అజీం ప్రేమ్‌జీ - లక్ష కోట్లు 5. పల్లోంజీ మిస్త్రీ - 93వేల కోట్లు 6. లక్ష్మీ మిట్టల్ - 84వేల కోట్లు 7. గోద్రెజ్ కుటుంబం - 83 వేల కోట్లు 8. శివనాడార్ - 76వేల కోట్లు 9. కుమార్ బిర్లా - 59వేల కోట్లు 10. సైరస్ పూనావాలా - 57వేల కోట్లు