torcher
-
నిండా ముంచేస్తారు.. ‘యాప్గాళ్లు’
కొన్నాళ్ల క్రితం అత్యవసరమై ఓ యాప్ ద్వారా రూ.5 వేల రుణం తీసుకున్నా.. సకాలంలో వడ్డీ, వాయిదాలు చెల్లిస్తున్నా. రకరకాల కారణాలు చెప్పి పెనాల్టీలు వేశారు. మొత్తం రూ.9 వేలు కట్టా.. అయినప్పటికీ ఇంకా బాకీ ఉందంటూ ఫోన్లు, సందేశాలు పంపిస్తున్నారు. నా ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్ ఆధారంగా స్నేహితులు, బంధువులకు విషయం చెప్పి పరువు తీస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా.. – ఓ బాధితుడి ఆవేదన కోవిడ్ బారిన పడి క్వారంటైన్లో ఉండగా డబ్బు అవసరమైంది. దీంతో ఓ యాప్ నుంచి రూ.30 వేలు తీసుకున్నా.. వారం తర్వాత ఆ అప్పు తీర్చడానికి మరో దాని నుంచి ఇలా.. ఇప్పటికీ నా యాప్‌ల అప్పు రూ.2.7 లక్షలకు చేరింది. నా కాంటాక్ట్స్‌లో ఉన్న వారందరితో కలిపి వాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లు క్రియేట్ చేశారు. అందులో నా ఫొటోను ఫ్రాడ్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఒక యాప్ నుంచి అప్పు తీసుకుంటే.. వరుస పెట్టి మిగిలిన యాప్‌ల నుంచి ఆఫర్లు వచ్చి ఉచ్చులోకి దింపుతున్నాయి.. – నగరానికిచెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించని కాబూలీ వాలాలు వాళ్లు.. యాప్‌ల ఆధారంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్పులిస్తారు.. వడ్డీతో సహా అప్పు చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యమైనా రకరకాలుగా వేధిస్తారు.. గూగుల్ ప్లేస్టోర్స్ ద్వారా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అప్పులిచ్చే యాప్స్ వ్యవహారమిది.. ఈ ‘యాప్గాళ్ల’వేధింపులు పెరిగిపోయాయంటూ 4రోజుల్లో 50మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ప్లేస్టోర్స్‌లో లెక్కకు మిక్కిలిగా.. కంటికి కూడా కనిపించకుండా అప్పులిచ్చే యాప్స్ గూగుల్ ప్లేస్టోర్స్‌లో 250 ఉన్నాయి. ఇందులో హోస్ట్ కాకుండా లింకుల రూపంలో పనిచేసే వాటికి కొదవే లేదు. ఎం–పాకెట్, లెండ్ కరో, క్రేజీబీ, స్లైస్, ఉదార్ కార్డ్, రెడ్ కార్పెట్..వంటివి కొన్ని మచ్చుకు మాత్ర మే. ప్రధానంగా యువత, విద్యార్థులనే టార్గెట్‌గా చేసుకుని ఆన్లైన్ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్పు తీసుకునే వ్యక్తి తన ఆధార్ కార్డు, పాన్‌కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు అప్లోడ్ చేస్తే సరిపోతోంది. కొన్ని గంటల్లోనే ఆ మొత్తం సదరు వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతా లేదా..ఈ–వాలెట్స్‌లోకి వచ్చి పడుతుంది. ఈ యాప్స్ రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకు రుణం ఇస్తున్నాయి. వడ్డీ, పెనాల్టీలు తదితరాలను కలుపుకుంటే నెలకు 35 నుంచి 45 శాతం వరకు వడ్డీ ఉంటోంది. వీటి నుంచి అప్పు తీసుకున్న వాళ్లు వారం నుంచి 10 రోజుల్లో రీ–పేమెంట్ చెయ్యాల్సి ఉంటోంది. ఈ చెల్లింపులకు సంబంధించి నిర్ణీత గడువుకు కొన్ని గంటల ముందు ఎస్సెమ్మెస్ వస్తుంది. అందులోని లింకు క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లోనే చెల్లింపులు జరుగుతాయి. (చక్రవడ్డీ మాఫీ : వారికి సుప్రీం షాక్) అవన్నీ తమ వద్దకు చేరటంతో.. లోన్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకునేప్పుడు మిగిలిన యాప్స్ మాదిరిగానే కాంటాక్ట్స్, ఫొటోస్, లొకేషన్ తదితరాలు యాక్సెస్ చేయడానికి అనుమతి కోరుతుంది. దీన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా అప్పు తీసుకునే వ్యక్తికి సంబంధించిన సమస్త వివరాలనూ లోన్ యాప్స్ తమ అధీనంలోకి తీసుకుంటున్నాయి. రుణం చెల్లింపులో విఫలమైతే చాలు.. బెదిరింపులకు దిగుతున్నాయి. తమ వద్ద ఫలానా వ్యక్తి అప్పు తీసుకున్నాడని, అతడో ఫ్రాడ్ అనీ కాంటాక్ట్స్ లిస్ట్‌లోని వారికి వాట్సాప్ ద్వారా సందేశాలు, ఫొటోలు పంపిస్తున్నారు. రుణగ్రస్తులకు ఫోన్లు చేసి అభ్యంతరకంగా, అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే పది మంది సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడం తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది అసభ్యత ఉంటే సైబర్ కేసు.. ‘అప్పులిచ్చిన యాప్‌లను షార్క్ యాప్స్ అంటున్నారు. ఇవి సొర చేప మాదిరిగా ఓ వ్యక్తి ఆర్థికస్థితిని తినేస్తాయని అర్థం. వీటి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారు. ఇవన్నీ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల కిందకు వస్తాయి. యాప్స్ నిర్వాహకులు మహిళల్ని దూషించినా, అసభ్య పదజాలంతో సందేశాలు పంపినా అది ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 కిందకు వస్తుంది. ఇలాంటి కేసుల్ని నమోదు చేస్తున్నాం.. మిగిలిన ఫిర్యాదుల్లో ఐపీసీలోని 506 సెక్షన్ లేదా తెలంగాణ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా రుణం అవసరమైనప్పుడు ఆర్బీఐ అధీనంలో ఉండే సంస్థల నుంచి మాత్రమే తీసుకోవాలి’. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ, -
అప్పగింతల కర్ర
అమ్మాయిని పంపిస్తున్నాం. ‘సర్దుకుపోవాలి తల్లీ..’ ‘గుట్టును గడప దాటనివ్వకు బుజ్జీ..’ ‘అణకువగా ఉండు బంగారం..’ ‘మాటంటే నొచ్చుకోకు బిడ్డా..’ అన్నీ చెప్పాల్సిన మాటలే. వీటితో పాటు.. ఇవ్వాల్సిన కర్ర కూడా ఒకటి ఉంది. అప్పగింతల కర్ర! ధీమాకు.. ధైర్యానికి. అతడింకా నోరు విప్పలేదు. ‘నువ్వేనా నీ భార్యను చంపింది?’ ‘అవును’. ఎలా చంపావు? ‘ఆమె పడుకుని ఉన్న మంచం మీదికి పామును వదిలి కాటేయించాను’. ‘పాము ఎక్కడిది నీకు?’ ‘పాములోళ్ల దగ్గర పదివేలకు కొన్నాను’. ‘పాములోళ్లు నీకెలా తెలుసు?’ ‘యూట్యూబ్‌లో అడ్రస్ పట్టుకున్నాను’ ఉన్నది ఉన్నట్లు ఇంత బాగా చెబుతుంటే అతడు నోరు విప్పకపోవడం ఏమిటి? అవును. విప్పడంలేదు. ‘నీ భార్యను ఎందుకు చంపావు?’ అనే ప్రశ్నకు అతడింకా నోరు విప్పలేదు. అయితే అతడు నోరు విప్పడం అన్నది పోలీసులకు అవసరమే కానీ.. మన స్టోరీకి కాదు. మనక్కావలసింది.. అలాంటి వ్యక్తిని భర్తగా అమ్మాయిలు ఎందుకు భరిస్తూనే ఉంటారని! అలాంటి వ్యక్తితో సర్దుకుని పొమ్మని అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలకు ఎందుకు చెబుతూనే ఉంటారని! అలాంటి వ్యక్తి అంటే? ∙∙ కట్నంగా ఐదు లక్షల క్యాష్ ఇచ్చారు. కిలో బంగారం ఇచ్చారు. కారు కొనిపెట్టారు. వరుడి చెల్లి చదువుకు డబ్బిచ్చారు. చదువుకే కాదు, చదువుకోడానికి టూ–వీలర్ కావాలంటే ఆ చెల్లికి వీలర్‌ని కూడా కానుకగా ఇచ్చారు. ఇక వరుడి తండ్రిగారు.. ఆయనకు బాడుగలకు తిప్పే లోడ్–వ్యాన్ కావాలంటే దాన్నీ కొనిపెట్టారు. ఇన్ని చేశాక పెళ్లి చేసుకున్నాడు. భార్యను తీసుకెళ్లాడు. అదూర్ అతడిది. పట్టణంతిట్ట జిల్లాలో ఉంటుంది. వధువుది ఆంచల్. కొల్లం జిల్లాలో ఉంటుంది. కేరళలోని జిల్లాలివి. 2018 మార్చి 26న పెళ్లయింది. 2020 మే 7న భార్యను చంపేశాడు. ఈ రెండేళ్ల కాలంలో భార్యతో అతడు ఏం మాట్లాడినా ఒకేమాట.. డబ్బు! ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా. ఆ ఇంకా.. నెలవారీ అయింది. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం అతడిది. ఆమె గృహిణి. ఉద్యోగంలో నెల నెల జీతం రాకపోయినా, భార్య నుంచి నెలనెలా ‘జీతాన్ని’ ఏర్పాటు చేసుకున్నాడు అతడు! అతడు సూరజ్. ఆమె ఉత్తర. ఏడాది వయసున్న కొడుకు. ‘పాపం ఇక మావాళ్లు డబ్బు ఇవ్వలేరండీ’ అన్నందుకు ఆ ఇంట్లోకి పాము దూరింది. మొదట ఆ పాము అతడి మెదడులోకి ప్రవేశించి, తర్వాత ఆమె బెడ్రూమ్లోకి పాకింది. మార్చి 2 ఆ రోజు. పాము చేత ఆమెను కాటేయించాడు. రెండునెలలు ఆసుపత్రిలో ఉంది. ‘అదృష్టం బాగుండి బతికింది. అది మామూలు పాము అయి ఉండదు’ అన్నారు డాక్టర్లు. అదూర్‌లోని ఆసుపత్రి నుంచి నేరుగా ఆంచల్‌లోని పుట్టింటికి తీసుకెళ్లారు ఉత్తరను ఆమె తల్లిదండ్రులు. రెండో అటెంప్ట్ ఆమె పుట్టింట్లోనే మే 7న చేశాడు సూరజ్. ఈసారి కోబ్రాను ప్రయోగించాడు. ఆమె చనిపోయింది. ∙∙ అల్లుడు ఎలాంటివాడో తెలుస్తూ ఉన్నప్పుడు కూతుర్ని అతడితో ఎందుకు ఉండనిస్తారు తల్లిదండ్రులు? కూతురు చెప్తూనే ఉంటుంది.. మెంటల్‌గా టార్చర్ పెడుతున్నాడనీ, చంపేస్తానని బెదిరిస్తున్నాడనీ, తను ఇంటికొస్తుంటేనే భయం వేస్తుందనీ..! అంతులేని డబ్బు ఆశ ఉన్నవాడి దగ్గర కూతురు ప్రాణాలకు ఎప్పటికైనా ప్రమాదమే అని ఎందుకు అనుకోరు తల్లిండ్రులు? అలాంటి భర్త లేకపోయినా ఏం కాదు.. మేమొస్తున్నాం, మాతో వచ్చేయ్. అతడిని వదిలేద్దాం అని ఎందుకు ధైర్యం ఇవ్వరు? ఒడ్డున ఉండి ప్రశ్నించినంత సులభం కాకపోవచ్చు వీటికి సమాధానాలు. ఎన్నో భయాలు ఉంటాయి. భర్తకు దూరంగా ఉందని తెలిస్తే పిల్ల పలచనై పోతుందన్న భయం ఉంటుంది. రేపు ఎప్పుడైనా.. బిడ్డకు తండ్రి లేడా అనే మాట వస్తుందన్న భయం ఉంటుంది. ఎన్ని భయాలున్నా.. పిల్ల ప్రాణం పోతుందేమోనన్న భయం కన్నా పెద్దవా?! దేశంలో రోజుకు 21 మంది భర్తలు డబ్బు కోసం తమ భార్యల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి! అమ్మాయి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అమ్మాయికి కొంచెం సపోర్ట్‌గా ఉంటే ఇంట్లోకి పాము దూరక ముందే, ఆమె తన చేతిలోకి కర్రను తీసుకుంటుంది. ఆ కర్ర.. విడాకులే కానక్కర్లేదు. ‘నాకు నువ్వు అక్కర్లేదు’ అని చెప్పి బయటికి వచ్చే ధైర్యం కూడా కావచ్చు. పెళ్లినాటి ఫొటో : సూరజ్, ఉత్తర ఉత్తర ఫొటోతో ఆమె తల్లిదండ్రులు మణిమేఖల, విజయసేనన్ -
కట్నం తేలేదని మహిళపై దారుణం..
పట్నా : కట్నంకోసం ఓ మహిళ పట్ల భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు అనాగరికంగా వ్యవహరించారు. కట్నం కింద రెండు లక్షల రూపాయల నగదుతో పాటు బైక్ తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేయడంతో పాటు వాటిని సమకూర్చలేదని బాధితురాలిపై భర్త, అత్తింటి వారు అత్యంత పాశవికంగా దాడికి తెగబడిన ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో వెలుగుచూసింది. కట్నం తీసుకురానందుకు రాడ్‌తో ఆమె శరీర భాగాలపై వాతలు పెట్టడంతో పాటు ఆమె జుట్టును కత్తిరించి తీవ్రంగా హింసించారు. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన బాధితురాలిని రైల్వే ట్రాక్‌పై పడవేశారు. స్పృహలోకి వచ్చిన తర్వాత స్ధానికులు ఆమెకు సాయం అందించి సమీప ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్ధితి ఆందోళనకరంగా ఉందని, ఆమె శరీరంపై ఏడు చోట్ల తీవ్ర గాయాలున్నాయని, పలు శరీర భాగాల్లో కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్!
-
ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్!
హైదరాబాద్:ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్ ఏదొక రూపంలో అధికమవుతూనే ఉంది. టికెట్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్ కు అద్దం పడుతోంది. శనివారం రాత్రి న్యూధనుంజయ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ముంబైకి బయల్దేరింది. 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆ బస్సు ఒక్కసారిగా పటాన్ చెరువు వద్ద నడిరోడ్డిపై ఆగిపోయింది. అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బస్సు యాజమాన్యం చేతులెత్తేసి తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. దీంతో ఆదివారం ఉదయం 9 గం.లకు వరకూ ప్రయాణికులు రోడ్డుపైనే జాగారం చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, గర్భిణిలు ఉన్నా వేరే వెహికల్ ను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేకపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. ఈ ఉదంతాన్ని చూస్తే ప్రైవేట్ ట్రావెల్సా మజాకా? అన్నట్లు ఉంది కదూ.. -
నిజం చెప్పిన పాపానికి...వాతలు..!