
ప్రతీకాత్మక చిత్రం
పట్నా : కట్నంకోసం ఓ మహిళ పట్ల భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు అనాగరికంగా వ్యవహరించారు. కట్నం కింద రెండు లక్షల రూపాయల నగదుతో పాటు బైక్ తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేయడంతో పాటు వాటిని సమకూర్చలేదని బాధితురాలిపై భర్త, అత్తింటి వారు అత్యంత పాశవికంగా దాడికి తెగబడిన ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో వెలుగుచూసింది.
కట్నం తీసుకురానందుకు రాడ్‌తో ఆమె శరీర భాగాలపై వాతలు పెట్టడంతో పాటు ఆమె జుట్టును కత్తిరించి తీవ్రంగా హింసించారు. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన బాధితురాలిని రైల్వే ట్రాక్‌పై పడవేశారు. స్పృహలోకి వచ్చిన తర్వాత స్ధానికులు ఆమెకు సాయం అందించి సమీప ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్ధితి ఆందోళనకరంగా ఉందని, ఆమె శరీరంపై ఏడు చోట్ల తీవ్ర గాయాలున్నాయని, పలు శరీర భాగాల్లో కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment