
ప్రతీకాత్మక చిత్రం
రఘునాథపాలెం: అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని రఘునాథపాలేనికి చెందిన ప్రశాంతి అనే వివాహిత ఫిర్యాదుతో ఐదుగురిపై గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. తన మేనత్త కొడుకు అయిన పారుపల్లి సురేష్‌తో ప్రశాంతికి 2005లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో రూ. 10 లక్షలు కట్నం ఇచ్చారు. అయితే, కొన్ని రోజులుగా తమ ఇల్లును అమ్మిడబ్బులు తేవాలని వత్తిడి చేస్తున్నారని, ఇంతటితో ఆగకుండా..రూ.20 లక్షలు ఇస్తేసరి లేకుంటే ప్రాణం తీస్తానని కూడా బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలు ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆడపడుచు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment