
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : వరకట్న వేధింపులు, గృహ హింస ఎదుర్కొనే మహిళ భర్తకు దూరంగా ఎక్కడ నివసిస్తుంటే ఆ ప్రదేశం నుంచి తన జీవిత భాగస్వామితో పాటు మెట్టినింటి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయవచ్చని ఫిర్యాదుల పరిధిని విస‍్తరిస్తూ సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. వివాహిత తనకు ఎదురయ్యే వేధింపులపై ఫిర్యాదు చేసే క్రమంలో ప్రాంత పరిధిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
మహిళలపై వేధింపుల ఫిర్యాదులకు సంబంధించి పెళ్లికి ముందు, తర్వాత మహిళ నివసించిన ప్రాంతంతో పాటు ఆశ్రయం పొందిన ప్రాంతంలోనూ వివాహ సంబంధిత కేసులను నమోదు చేయవచ్చని బెంచ్ స్పష్టం చేసింది. యూపీకి చెందిన రూపాలి దేవి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం ఈ తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment