tournment
-
ఇల్లినాయిస్లో నాట్స్ ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్
షికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, నాట్స్ తాజాగా నిర్వహించిన ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్ దిగ్విజయంగా జరిగింది. ఇల్లినాయిస్లో చికాగో నాట్స్ టీం నిర్వహించిన మిడ్ వెస్ట్రన్ త్రో బాల్ టోర్నమెంట్‌కు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం ఇల్లినాయిస్ మాత్రమే కాకుండా మిచిగాన్, ఇండియానా, విస్కాన్సిన్, మిస్సోరి తదితర రాష్ట్రాల నుంచి మహిళ జట్లు ఈ పోటీలకు హాజరయ్యారు. దాదాపు 150 మందికి పైగా మహిళలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. విస్కాన్సిన్ కు చెందిన ఎఎస్‌సీటీగ్రెస్ టీమ్ టోర్నమెంట్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. ఇల్లినాయిస్ చెందిన హరికేన్స్ టీం రన్నర్ అప్ గా నిలిచింది. నాట్స్ చికాగో కల్చరల్ కో ఆర్డినేటర్ బిందు వీదులముడి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ చికాగో నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జ, వేణు కృష్ణార్దుల, డాక్టర్ ప్రసుధ నున్నా, హరీష్ జమ్ముల, మరియు కార్తీక్ మోదుకూరి తదితరులు ఈ టోర్నమెంట్ విజయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో సహాకరించిన శిల్పా ఎర్రా, పూజా సావంత్, రోజా శీలంశెట్టి, బిందు బాలినేని, ప్రదీప్, ప్రియాంక గుప్తా, సంధ్య అంబటి, సుమతి నెప్పలి, రామ కొప్పక, రవి కిరణ్ ఆలా, శివ దేసు, రాజేష్ వీధులమూడి, ఆర్కే బాలినేని, పండూ చెంగలశెట్టి, యాజ్నేష్, కిరణ్ అంబటి, తుషార్ సావంత్ తదితరులకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది చదవండి : .Miss Universe Singapore-2021: మిస్ సింగపూర్‌గా శ్రీకాకుళం యువతి -
హ్యూస్టన్‌లో నాట్స్ మెన్స్ సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్
హ్యూస్టన్: తెలుగు వారి కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్... తాజాగా వారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెన్స్ సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగు ప్రజలు ఈ టెన్నిస్ టోర్నమెంట్లో ఆడేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ హ్యూస్టన్ క్రీడా సమన్వయకర్త చంద్ర తెర్లీ నేతృత్వంలో ఈ టోర్నమెంట్ జరిగింది. నాట్స్ హ్యూస్టన్ సమన్వయకర్త వీరు కంకటాల, నాట్స్ నాయకులు సునీల్ పాలేరు, హేమంత్ కొల్ల, శ్రీనివాస్ కాకుమాను తదితరులు విజయవంతంగా టోర్నమెంట్ నిర్వహించేందుకు కృషి చేశారు. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని తెలుగువారందరికీ నాట్స్ ఎప్పుడూ వెన్నంటి ఉండి తమ సహాయ సహకారాలను అందిస్తుందని బోర్డు సభ్యులు సునీల్ పాలేరు అన్నారు. చక్కటి సమన్వయంతో, క్రీడా స్ఫూర్తితో, ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ పోటీలు నిర్వహించిన నాట్స్ హ్యూస్టన్ విభాగానికి కేంద్ర కమిటీ సభ్యులు, సహాయ కోశాధికారి హేమంత్ కొల్ల అభినందనలు తెలిపారు. క్రీడా నైపుణ్యత ఆధారంగా రెండు విభాగాలుగా జరిగిన ఈ పోటీలకు ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న క్రీడాకారులకు నాట్స్ ట్రోఫీలను అందజేసి సత్కరించింది. తెలుగు వారిలో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడంపై నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, ప్రెసిడెంట్ శేఖర్ అన్నే నాట్స్ హ్యూస్టన్ విభాగాన్ని అభినందించారు. చదవండి: 500 కార్మిక కుటుంబాలకు నాట్స్ సాయం