Town Planning staff
-
‘ఇల్లు కూల్చితే మా చావును చూస్తారు..’
సాక్షి, చంపాపేట(హైదరాబాద్): పక్కింటి యజమాని ఫిర్యాదుతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఇంటిని కూల్చివేసేందుకు సమాయత్తం అవుతుండగా కూల్చివేతలు నిలిపివేయాలంటూ కుటుంబ సభ్యులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని అనడంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం రాత్రి చంపాపేట డివిజన్లో చోటు చేసుకుంది. టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్ దుర్గానగర్‌కాలనీకి చెందిన తేలుకుంట్ల రాజు 35 సంవత్సరాలుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. తన ఇల్లు శిథిలావస్థకు చేరటంతో ఇటీవలే పాత ఇంటిని కూల్చి పునర్నిర్మాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంటి పక్కనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న శ్రీనివాస్ ఇంటి పునర్నిర్మాణం చేసేందుకు అభ్యంతరం తెలిపి కోర్టు నుంచి స్టే ఆర్డరు కూడా తెచ్చారు. ఆవేమీ పట్టించుకోని రాజు ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయటంతో గురువారం శ్రీనివాస్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది జేసీబీతో సంఘటనా స్థలానికి చేరి ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా రాజు కుటుంబ సభ్యులు కూల్చివేత నిలిపేయాలంటూ కిరోసిన్ డబ్బాలు చేత పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి రాజుకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. -
టౌన్‌ప్లానింగ్ అధికారి సహా ఇద్దరు విలేకరుల అరెస్టు
బంజారాహిల్స్ : భవన నిర్మాణ యజమానిని బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి సిద్ధాంతం మదన్‌రాజుతో పాటు ఓ రెండు పత్రికల విలేకర్లు సోపాల శ్రీనివాస్, ఆకుల కిరణ్‌గౌడ్‌లు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ సిటీ రేంజ్–2 డీఎస్పీ ఎస్. అచ్చేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని మెట్రో స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా షెడ్డు నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కిరణ్‌గౌడ్, సోపాల శ్రీనివాస్‌లు ఆయన వద్దకు వెళ్లి ఇది అక్రమ నిర్మాణమంటూ బెదిరించారు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే సెక్షన్ అధికారి మదన్‌రాజుకు చెప్పి కూల్చివేయిస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో మదన్‌రాజును కూడా వెంటబెట్టుకొని నిర్మాణ స్థలానికి వెళ్లి.. కేశవరెడ్డిని వారు డబ్బులు డిమాండ్ చేశారు.దీంతో తాను రూ. 2 లక్షలు ఇచ్చేందుకు ఆయన వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటికి రావాల్సిందిగా చెప్పాడు. అప్పటికే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో కేశవరెడ్డి సెక్షన్ అధికారితో పాటు ఇద్దరు విలేకరులను ఇంటికి పిలిపించాడు. అక్కడ అతను రూ. 2లక్షలు ఈ ముగ్గురికీ ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణ చేపట్టి ముగ్గురినీ అరెస్ట్ చేశారు. సెక్షన్ అధికారి మదన్‌రాజు, ఈ ఇద్దరు విలేకరులను కొంత కాలంగా తన అసిస్టెంట్లుగా పెట్టుకున్నాడని వారితోనే డబ్బులు వసూ లు చేయిస్తున్నాడని అధికారులు తెలిపారు. ఇది లా ఉండగా ఈ ఇద్దరు విలేకరులు బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. -
క్యాష్ కొట్టు.. ప్లాన్ పట్టు!
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల కోడ్ అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిందేమో గానీ.. అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది. పెపైచ్చు జీవీఎంసీ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగరంలోని పలు జోన్లలో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. వీటికి టౌన్ ప్లానింగ్ సిబ్బంది, జోనల్ కమిషనర్లు(జెడ్సీ) కుమ్మక్కయి మరీ సహకరించారన్న ఆరోపణలున్నాయి. ఆ నాలుగింటే అధికం! జీవీఎంసీలో ఆది నుంచీ నగర శివారు జోన్ల(మధురవాడ, పెందుర్తి, గాజువాక)లో అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో ఉంటాయో.. జోన్-2లో కూడా అంతే స్థాయిలో ఉంటాయి. విభజన తర్వాత ఊపందుకున్న అపార్ట్మెంట్ల నిర్మాణాలు అధికారులకు ఆదాయ మార్గాలుగా మారాయి. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల సంఖ్య ఆధారంగా భారీ మొత్తంలో ముడుపులు వసూలు చేసినట్టు సమాచారం. సాధారణ సమయంలో భవన నిర్మాణ ప్లాన్ కోసం నెలల తరబడి తిరగాల్సి వస్తే.. ఎన్నికల కోడ్ సమయంలో మాత్రం వారం పది రోజుల్లోనే ప్లాన్ చేతికొచ్చే పరిస్థితి. ‘క్యాష్ కొట్టు.. ప్లాన్ పట్టు’ అన్న రీతిలో టౌన్‌ప్లానింగ్ అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. గతంలో జెడ్సీలకు, టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి మధ్య విభేదాలెక్కువగా ఉండేవి. కమిషనర్ ‘మెతక’ వైఖ రి పుణ్యమా.. అని వీరిలో వీరు సర్దుకుపోతున్నారు. ప్రతి అక్రమ నిర్మాణంలో ‘మామూళ్లు’ గా సహకరించుకుంటున్నారు. దీనిపై భవన యజమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో డబ్బులు ఇచ్చి రోజుల తరబడి అధికారులు చుట్టూ ప్రదక్షిణలు తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆనందపడుతున్నారు. జోన్-3ది మరో దారి! : ఊరందరిదీ ఒకదారి.. ఉలిపికట్టెది మరో దారన్నట్టుగా ఉంటుంది.. జీవీఎంసీ జోన్-3 పరిస్థితి. ఇక్కడ భారీ నిర్మాణాలు చాలా తక్కువ. ఉన్నవంతా చిన్నా చితకా నిర్మాణాలు, అంతస్తులపై అంతస్తులు వేయడం. అయితే సెల్లార్ల ఆక్రమణలు మిగిలిన అన్ని జోన్ల కంటే ఇక్కడే ఎక్కువ. రామాంజనేయులు హయాంలో తొలగించిన సెల్లార్ ఆక్రమణలన్నీ మళ్లీ నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి. దీనిపై ఎన్నిసార్లు.. ఎంతమంది ఫిర్యాదు చేసినా ఇటు కమిషనర్ గానీ, అటు జెడ్సీగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. డాబాగార్డెన్స్ రోడ్డులో సెల్లార్ ఆక్రమణల వెనుక భారీ స్థాయిలో ముడుపులు చేతుల మారడమే.. అధికారుల నిర్లిప్తతకు కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వీటిపై స్థానిక కోర్టుల మధ్యంతర ఉత్తర్వులు చెల్లవని తెలిసీ, అక్రమ నిర్మాణదారులకు అధికారులు సహకరిస్తుండడం గమనార్హం.