Toxic Injection
-
ఆంధ్రా చేపలు..విషపూరితం
భువనేశ్వర్ : ఆంధ్రప్రదేశ్ నుంచి విష పూరిత చేపలు ఎగుమతి అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అస్సాం ప్రభుత్వం ఈ విషయాన్ని బహిరంగపరిచింది. ఒడిశా రాష్ట్రానికి కూడా నిత్యం ఆంధ్రప్రదేశ్ నుంచి విశేషంగా చేపలు దిగుమతి అవుతాయి. రాష్ట్ర చేపల అంగడిలో ఆంధ్రప్రదేశ్ చేపల వాటా సింహభాగంగా కొనసాగుతోంది. అస్సాం ప్రభుత్వం వెలువరించిన భయానక ప్రకటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న చేపల్ని పరీక్షించేందుకు రాష్ట్ర వ్యవసాయ–పశు సంవృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియను నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. నిపుణుల పరీక్షల నివేదిక ఆధారంగా బాధ్యుల్ని గుర్తించి కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర వ్యవసాయ–పశు సంవృద్ధి శాఖ మంత్రి ప్రదీప్ మహారథి హెచ్చరించారు. విషపూరిత చేపల విషయంలో తమ విభాగం ప్రత్యేకంగా విచారణ నిర్వహించిన మేరకు తగిన చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసిన చేపలకు అస్సాం ప్రభుత్వం గత నెల 29వ తేదీన ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విషపూరిత చేపల్ని దిగుమతి చేసినట్లు తేలిందని అస్సాం సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పిజూష్ హజారికా ప్రకటించారు. చేపలకు విష పూరిత ఫార్మాలిన్ రసాయనం ప్రయోగించి ఆంధ్రప్రదేశ్ ఎగుమతి చేస్తోంది. అక్కడినుంచి పలు ప్రాంతాలకు చేపలు విరివిగా ఎగుమతి అవుతున్నాయి. వాటిలో ఒడిశా ఒకటి కావడంతో కలకలం రేగింది. అస్సాంలో ఆంధ్రా చేపల నిషేధం ఫార్మాలిన్ విష పూరిత రసాయనం ప్రయోగంతో ఆ రాష్ట్రం ఎగుమతి చేసిన ఆంధ్రప్రదేశ్ చేపల వినియోగాన్ని నిషేధించినట్లు అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. 10 రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్ చేపల్ని అస్సాంలో విక్రయాలకు నిషేధించినట్లు అస్సాం సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పిజూష్ హజారికా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు ఆంధ్ర ప్రదేశ్ చేపల విక్రయంపట్ల నిఘా వేస్తారు. ఉల్లంఘనల్ని అధిగమించి ఫార్మాలిన్ పూత కలిగిన ఆంధ్రా చేపల్ని విక్రయించే వారికి భారీగా జరిమానా విధించే అధికారాల్ని జిల్లా కలెక్టర్లకు కల్పించారు. నిందితులకు 2 నుంచి 7 ఏళ్ల వరకు ఖైదు, రూ.10 లక్షల జరిమానా విధిస్తామని అస్సాం ప్రభుత్వం హెచ్చరించింది. ఫార్మాలిన్ రసాయనం ఏమిటి? మనుషుల మృతదేహాలను దీర్ఘకాలం పదిల పరిచేందుకు వినియోగించే రసాయనం ఫార్మాలిన్. ఈ రసాయనం ప్రయోగించడంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోకుండా ఉంటాయి. మొప్పల గుండా ఫార్మాలిన్ రసాయనాన్ని చేపల్లోనికి చొప్పిస్తారు. ఇలా చేయడంతో వారాల తరబడి చేపలు తాజాగా ఉంటాయి. ఫార్మాలిన్ ఛాయలు ఇలా.. ఫార్మాలిన్ ప్రయోగించిన చేపలు సాధారణ చేపల కంటే గట్టిగా ఉంటాయి. ఈ చేపల్ని తింటే రబ్బరులా అనిపిస్తాయి. దీనిపై పొలుసు సాధారణ చేపల కంటే రాటుదేలి ఉంటుంది. ఫార్మాలిన్ రసాయనం ప్రయోగంతో చేపమొప్పలు ఎర్రగా నిగనిగలాడతాయి. కళ్లు సజీవతను సంతరించుకుంటాయి. ఈ చేపల్ని వండే సమయంలో భిన్నమైన వాసన వస్తుంది. ఫార్మాలిన్ మానవ శరీరంలో చొరబడితే కేన్సర్ సంభవించే ఆస్కారం ఉన్నట్లు కొన్ని వర్గాలు హెచ్చరిస్తున్నాయి. -
బోరు కొట్టి 106 మందిని చంపేశాడు
-
బోరు కొట్టి 106 మందిని చంపేశాడు
బెర్లిన్: జర్మనీలో మేల్ నర్సుగా పనిచేసే ఓ మృగాడు తనకు బోరు కొట్టడంతో రోగులకు విషపూరిత ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి 106 మందిని చంపేశాడు. పోలీసులు మరిన్ని శవాలను పరిశీలిస్తున్నందున ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1999 నుంచి 2005 మధ్య కాలంలో అతను రెండు వైద్యశాలల్లో ఈ దుష్కార్యానికి ఒడిగట్టాడు. నీల్స్ హొయెగెల్ (41) అనే వ్యక్తి బ్రెమెన్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేవాడు. రోజూ ఒకేలా పనిచేసి విసిగిపోయిన అతను... గుండె, రక్త ప్రసరణ వ్యవస్థలు విఫలమయ్యేలా రోగులకు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి ఆరోగ్యం మరింత దిగజారేలా చేసేవాడు. ఆ తర్వాత కాపాడటానికి ప్రయత్నించి ఒకవేళ రోగి బతికితే ఆ ఘనత తనదేనని చెప్పుకోవడం అతనికి అలవాటుగా మారింది. ఇలా ఎంతోమందిని నీల్స్ పొట్టనబెట్టుకున్నాడు. 2005లో ఓసారి రోగికి విషపూరిత మందులను ఇస్తుండగా, మరో నర్సు చూసి విషయాన్ని బయటపెట్టింది. పోలీసులు అతణ్ని అరెస్టు చేసి విచారించగా ఇలా ఎంతో మందికి విషపు ఇంజెక్షన్లు ఇచ్చాడని తేలడంతో హత్యాయత్నం నేరం కింద 2008లో అతనికి ఏడున్నరేళ్ల జైలు శిక్ష పడింది. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ఓ మహిళ, తన తల్లికి కూడా నీల్స్ విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసి ఉంటాడని ఫిర్యాదు చేయడంతో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పరీక్షలు చేయగా అదే నిజమని తేలింది. దీంతో అతని చేతుల్లో చనిపోయిన మరింత మంది మృతదేహాలను కూడా వెలికితీసి పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆ లెక్క 106గా ఉండగా మరింత పెరిగే అవకాశం ఉంది. కొంతమంది రోగుల శవాలను పూడ్చకుండా, కాల్చినందువల్ల నీల్స్ కారణంగా చనిపోయిన వారెందరనేది ఎప్పటికీ తెలిసే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. నీల్స్పై కొత్త అభియోగాలు కూడా మోపుతామన్నారు. జర్మనీ చరిత్రలో ఇలా వరస హత్యలు చేసిన ఇంతటి క్రూరుడు ఇంకొకరు లేరని పోలీసులు అంటున్నారు. -
ఆర్మీ కల్నల్ అఘాయిత్యం
ఆగ్రా: వాళ్లిద్దరూ ఇండియన్ ఆర్మీలో మంచి హోదాలో పనిచేస్తున్నారు. రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఎందుకోగానీ ఈ మధ్యే విడిపోయారు. వీడ్కోలు తీసుకునేక్రమంలో లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. అక్కడ సహచర లెఫ్లినెట్ పై బలాత్కారానికి దిగిన కల్నల్.. చివరికి విషపు ఇంజెక్షన్ పొడుచుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్మీ వర్గాల్లో సంచలనం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన టి.జాదవ్(40) ఆర్మీలో లెఫ్టినెట్ కల్నల్. ఆగ్రా ఆర్మీ ఆసుపత్రిలో అనస్తీషియా నిపుణుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. డెహ్రాడూన్ కు చెందిన మహిళా లెఫ్టినెంట్.. అదే ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. గడిచిన రెండేళ్లుగా ఈ ఇద్దరూ సహజీనం చేస్తున్నారు. జాదవ్ కు ఇదివరకే భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే జాదవ్ తో సంబంధాలు తెంచుకోవాలనుకున్న ఆ జూనియర్ అధికారిణి.. ఇటీవలే అతనికా విషయం చెప్పింది. ఒకేఒక్క లాంగ్ డ్రైవ్ తర్వాత తన నిర్ణయం చెబుతానని అతనన్నాడు. అనుకున్నట్లే శుక్రవారం రాత్రి యమునా తీరంలో లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. మథుర సమీపంలోని రాధా నగర్ కు చేరుకున్నాక, వెంట తెచ్చుకున్న విషపు ఇంజెక్షన్ ను బయటికి తీసిన జాదవ్.. ఇద్దరం కలిసి చనిపోదామని ఆమెతో అన్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఇంజక్షన్ పొడిచే ప్రయత్నం చేశాడు. తీవ్ర పెనుగులాత తర్వాత ఆమె కారులో నుంచి బయటికి దిగింది. వెంటనే కారు డోర్లు లాక్ చేసుకున్న జాదవ్.. విషపు ఇంజెక్షన్ ను ఒంట్లోకి పొడుచుకుని చనిపోయాడు. మహిళా లెఫ్టినెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మథుర ఏఎస్పీ అశోక్ కుమార్ సింగ్ మీడియాకు చెప్పారు. శనివారం ఆర్మీ వైద్యులే జాదవ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారని తెలిపారు. జాదవ్ మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు ఇచ్చారని అశోక్ కుమార్ పేర్కొన్నారు. -
ఫైనాన్షియర్ల వేధింపులకు మహిళ బలి
ఫైనాన్షియర్ల వేధింపులకు మరో మహిళ బలైంది. తీసుకున్న అప్పు కట్టడంలో ఆలస్యం అయ్యేసరికి అప్పు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కవయ్యాయ. దీంతో మనస్తాపానికి గురైన మహిళ విషపు ఇంజెక్షన్ శరీరంలోకి ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నగరంలోని రైన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదన్నపేటలో గురువారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.