నీరు - కారు
జపనీస్ కంపనీ టయోటా టోక్యో ఆటోషోలో ప్రదర్శించిన సూపర్ కార్ ఇది. అత్యంత సమర్థమైన, కాలుష్యరహితమైన ఇంధనం ఉదజని (హైడ్రోజెన్) తో నడపగలగడం ఒక్కటే దీని ప్రత్యేకత అనుకునేరు. ఇంకా చాలా ఉన్నాయి. అత్యాధునిక ఫ్యుయెల్ సెల్ టెక్నాలజీతో తయారయ్యే ఉదజనితో విద్యుదుత్పత్తి చేసుకుని అవసరమైనప్పుడు కారును నడిపించుకోవచ్చు. లేదంటే గ్రిడ్‌కు కనెక్ట్ చేసుకుని అమ్ముకోవచ్చు కూడా. అంతేకాకుండా... మీ కారులోని విద్యుత్తును పక్క కారులోకి వైర్లెస్ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేయవచ్చు కూడా.
టయోటా ఫ్యుయెల్‌సెల్ కారు ‘మిరాయి’ని ఏడాది క్రితమే మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది మాత్రం ప్రస్తుతానికి ఓ కాన్సెప్ట్ కారేగానీ... కొన్నేళ్లలో ఇలాంటివే మనరోడ్ల మీద పరుగులు పెడుతూంటే మాత్రం ఆశ్చర్యపోనక్కరలేదు.